Smart phone: మీ స్మార్ట్‌ఫోన్‌లో కూడా ఈ సమస్యలు వస్తున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి.
ఇక యూజర్ల అవసరాలకు అనుగుణంగా స్మార్ట్ ఫోన్ కంపెనీలు సైతం అత్యాధునిక ఫీచర్లను అందిస్తున్నారు. 5జీ నెట్‌వర్క్‌కు సపోర్ట్ చేసే ఫోన్‌లను తీసుకొస్తున్నారు. కెమెరా మొదలు స్టోరేజ్ వరకు ఎన్నో ఫీచర్స్‌ను జోడిస్తూ తీసుకొస్తున్నారు. అయితే స్మార్ట్ ఫోన్‌లను వినియోగిస్తున్న కాలం పెరిగేకొద్దీ ఫోన్‌ల పనితీరులో మార్పు వస్తుంది. ఫోన్ స్పీడ్ తగ్గడంతో పాటు, ఎన్నో రకాల సమస్యలు తలెత్తుతుంటాయి...

స్మార్ట్ ఫోన్ రాకతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రపంచం అరచేతిలో ఇమిడిపోయింది. ఇంటర్‌నెట్ స్పీడ్ భారీగా పెరగడం, ఇంటర్‌నెట్ ఛార్జీలు కూడా భారీగా తగ్గడంతో స్మార్ట్ ఫోన్స్ వినియోగం ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. ప్రతీ చిన్న పనికి స్మార్ట్ ఫోన్‌పై ఆధారపడే రోజులు వచ్చేశాయ్. ఆన్‌లైన్ షాపింగ్ మొదలు, కరెంట్ బిల్లు కట్టే వరకు ప్రతీ పనికి స్మార్ట్ ఫోన్ వినియోగం అనివార్యంగా మారిపోయింది.
ఇక యూజర్ల అవసరాలకు అనుగుణంగా స్మార్ట్ ఫోన్ కంపెనీలు సైతం అత్యాధునిక ఫీచర్లను అందిస్తున్నారు. 5జీ నెట్‌వర్క్‌కు సపోర్ట్ చేసే ఫోన్‌లను తీసుకొస్తున్నారు. కెమెరా మొదలు స్టోరేజ్ వరకు ఎన్నో ఫీచర్స్‌ను జోడిస్తూ తీసుకొస్తున్నారు. అయితే స్మార్ట్ ఫోన్‌లను వినియోగిస్తున్న కాలం పెరిగేకొద్దీ ఫోన్‌ల పనితీరులో మార్పు వస్తుంది. ఫోన్ స్పీడ్ తగ్గడంతో పాటు, ఎన్నో రకాల సమస్యలు తలెత్తుతుంటాయి. సాధారణంగా ఫోన్‌లో వచ్చే వచ్చే సమస్యలు ఏంటి.? వాటికి పరిష్కార మార్గాలు ఏంటి.? ఇప్పుడు చూద్దాం..
* స్మార్ట్ ఫోన్స్‌లో తలెత్తే ప్రధాన సమస్యల్లో ఫోన్ స్లో అవ్వడం ఒకటి. కొంతకాలం తర్వాత స్మార్ట్ ఫోన్స్ స్లో అవ్వడం అందరూ ఎదుర్కొనే సమస్యే. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. ఫోన్ పనితీరు నెమ్మదిస్తే వెంటనే ఫోన్‌లో అనవసరమై యాప్స్‌ను తొలగించాలి. అలాగే ఫోన్‌లో క్యాచీ మెమోరీని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఫోన్ పనితీరు మెరుగవుతుంది.
* స్మార్ట్ ఫోన్ ఉపయోగించే వారు ఎదుర్కొనే మరో ప్రధాన సమస్య ఫోన్ హీటెక్కడం. రోజంతా స్మార్ట్ ఫోన్స్ ఉపయోగించడం, ఇంటర్‌నెట్, వీడియో గేమ్స్ ఎక్కువగా ఆడడం వల్ల ఫోన్ వేడెక్కుతుంది. కాబట్టి ఫోన్‌కు అప్పుడప్పుడు విశ్రాంతి ఇవ్వాలి. ఫోన్‌ను పవర్ సేవర్ మోడ్‌తో పాటు, స్క్రీన్ బ్రైట్‌నెస్‌ను తగ్గించుకోవాలి. అవసరం లేనప్పుడు వైఫై, బ్లూటూత్‌ను ఆఫ్‌లో ఉంచాలి. ఇక వీలైనంత వరకు ఫోన్ ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు ఉపయోగించకూడదు.
* స్మార్ట్ ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోవడం కూడా ఫోన్ ఉపయోగించే వారు ఎదుర్కొనే సమస్యల్లో ఒకటి. ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రై అవ్వకూడదంటే స్క్రీన్ బ్రైట్‌నెస్‌ను తగ్గించుకోవాలి. అవసరం లేని సయంలో బ్లూటూత్, లొకేషన్, జీపీఎస్ వంటి వాటిని ఆఫ్ చేసుకోవాలి. బ్యాటరీ ఎక్కువ సేపు రావాలంటే పవర్ సేవర్ మోడ్‌తో పాటు అసవరం లేని సమయంలో ఇంటర్‌నెట్‌ను ఆఫ్ చేయాలి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..