AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Iphone 12: రూ. 30 వేలలోపే ఐఫోన్‌ 12 సొంతం చేసుకునే ఛాన్స్‌.. ఎలాగంటే..

ఫ్లిప్‌కార్ట్‌ యాపిల్‌ ఐఫోన్‌12పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. దీంతో ఫోన్‌ను తక్కువ ధరకే సొంతం చేసుకునే అవకాశం లభిస్తుంది. ఐఫోన్‌ 12 64 జీబీ వేరియంట్ అసలు ధర రూ. 49,900కాగా 15 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 41,999కే సొంతం చేసుకోవచ్చు. ఇక ఆఫర్స్‌ ఇక్కడితో ఆగిపోలేవు. యాక్సిస్‌ బ్యాంక్‌కు చెంది క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసే 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో గరిష్టంగా...

Iphone 12: రూ. 30 వేలలోపే ఐఫోన్‌ 12 సొంతం చేసుకునే ఛాన్స్‌.. ఎలాగంటే..
Iphone 12
Narender Vaitla
|

Updated on: Nov 29, 2023 | 11:41 PM

Share

టెక్‌ మార్కెట్‌లో యాపిల్ ప్రొడక్ట్స్‌కు ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యాపిల్ నుంచి కొత్తగా ఏదైనా ప్రొడక్ట్‌ లాంచ్‌ అవుతుందంటే అందరి దృష్టి పడుతుంది. ముఖ్యంగా ఐఫోన్‌కు భారీ క్రేజ్‌ ఉంటుంది. అయితే ఐఫోన్‌ కొనుగోలు చేయాలని అందరికీ ఉన్నా, భారీ ధర కారణంగా కొనుగోలు చేయడానికి వెనుకడుగు వేస్తుంటారు. అయితే మీలాంటి వారి కోసమే ఫ్లిప్‌కార్ట్ మంచి ఆఫర్‌ను తీసుకొచ్చింది..

ఫ్లిప్‌కార్ట్‌ యాపిల్‌ ఐఫోన్‌12పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. దీంతో ఫోన్‌ను తక్కువ ధరకే సొంతం చేసుకునే అవకాశం లభిస్తుంది. ఐఫోన్‌ 12 64 జీబీ వేరియంట్ అసలు ధర రూ. 49,900కాగా 15 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 41,999కే సొంతం చేసుకోవచ్చు. ఇక ఆఫర్స్‌ ఇక్కడితో ఆగిపోలేవు. యాక్సిస్‌ బ్యాంక్‌కు చెంది క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసే 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో గరిష్టంగా రూ. 1000 డిస్కౌంట్ పొందొచ్చు.

ఇక వీటితో పాటు ఫ్లిప్‌కార్ట్ ఎక్స్చేంజ్‌ ఆఫర్‌ను సైతం అందిస్తున్నారు. పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్‌ చేయడం ద్వారా గరిష్టంగా రూ. 40,800వ వరకు డిస్కౌంట్‌ పొందొచ్చు. తక్కువలో తక్కువ మీ పాత ఫోన్‌కు పదివేలు వచ్చినా రూ. 30 వేలలో యాపిల్ 12ని సొంతం చేసుకోవచ్చు. ఒకవేళ పూర్తిగా ఎక్స్చేంజ్‌ వర్తిస్తే.. అత్యంత తక్కువ ధరకే ఫోన్‌ను కొనుగోలు చేసుకోవచ్చు.

ఇక యాపిల్‌ ఐఫోన్‌ 12 ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 64 జీబీ స్టోరేజ్‌ను అందించారు. ఇక 6.1 ఇంచెస్‌తో కూడిన సూపర్‌ రెటీనా ఎక్స్‌డీఆర్‌ డిస్‌ప్లేను అందించారు. ఇక 12 మెగా పిక్సెల్‌, 12 మెగా పిక్సెల్స్‌తో కూడిన డ్యూయల్‌ కెమెరా సెటప్‌ను అందించారు. అలాగే సెల్ఫీల కోసం 12 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. ఏ14 బయోనిక్‌ చిప్‌ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఈ ఫోన్‌ సొంతం. ఇక కెమెరా నైట్‌ మోడ్‌, 4కే డాల్బీ విజన్‌ హెచ్‌డీఆర్‌ రికార్డింగ్‌ను అందించారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
సాధారణ కీళ్ల నొప్పులకు, ఆర్థరైటిస్‌కు మధ్య తేడా ఏంటి?..
సాధారణ కీళ్ల నొప్పులకు, ఆర్థరైటిస్‌కు మధ్య తేడా ఏంటి?..
క్లాసికల్ సినిమా ఆడదు అన్నారు.. కట్ చేస్తే.. ఇండస్ట్ర్లీలోనే పెద్
క్లాసికల్ సినిమా ఆడదు అన్నారు.. కట్ చేస్తే.. ఇండస్ట్ర్లీలోనే పెద్
విమానాన్ని తలపించేలా ఆర్టీసీ లగ్జరీ బస్సులు..హాస్టెస్, వైఫై ఎన్నో
విమానాన్ని తలపించేలా ఆర్టీసీ లగ్జరీ బస్సులు..హాస్టెస్, వైఫై ఎన్నో
ఢాకేశ్వరి ఆలయం: బంగ్లాదేశ్‌లోని 800 ఏళ్ల పురాతన దుర్గాదేవి ఆలయం..
ఢాకేశ్వరి ఆలయం: బంగ్లాదేశ్‌లోని 800 ఏళ్ల పురాతన దుర్గాదేవి ఆలయం..
వేల కోట్లు ఆదా.. రికార్డు వేగంతో పనులు.. 5 ఏళ్లలో పీఎం గతిశక్తి
వేల కోట్లు ఆదా.. రికార్డు వేగంతో పనులు.. 5 ఏళ్లలో పీఎం గతిశక్తి
ప్రెగ్నెంట్‏గా ఉండి ఆ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశా..
ప్రెగ్నెంట్‏గా ఉండి ఆ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశా..
మంచం దగ్గరకు గుర్రాలు.. తల్లి చివరి కోరిక తీర్చిన కూతురు!
మంచం దగ్గరకు గుర్రాలు.. తల్లి చివరి కోరిక తీర్చిన కూతురు!
కేతువు సంచారం ఎఫెక్ట్.. 56 రోజుల పాటు ఈ 5 రాశులకు అదృష్టమే..
కేతువు సంచారం ఎఫెక్ట్.. 56 రోజుల పాటు ఈ 5 రాశులకు అదృష్టమే..
అదిరిపోయే ఫీచర్లతో కోడాక్ స్మార్ట్‌ టీవీ
అదిరిపోయే ఫీచర్లతో కోడాక్ స్మార్ట్‌ టీవీ
చికెన్‌ బ్రెస్ట్‌, లెగ్‌ పీస్‌.. ఏది తీసుకుంటే మంచిది?
చికెన్‌ బ్రెస్ట్‌, లెగ్‌ పీస్‌.. ఏది తీసుకుంటే మంచిది?