AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Plybook: భారతదేశంలోని చిన్న వ్యాపారుల కోసం గ్రో యువర్ బిజినెస్ ప్లేబుక్ ప్రారంభించిన ఫేస్‌బుక్ సంస్థ మెటా!

ఫేస్‌బుక్ యొక్క మాతృ సంస్థ మెటా భారతదేశంలో చిన్న- మధ్యస్థ వ్యాపారాలను (SMBs) సాధికారత చేయడానికి వ్యాపార కేంద్రమైన 'గ్రో యువర్ బిజినెస్' ప్లేబుక్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది.

Plybook: భారతదేశంలోని చిన్న వ్యాపారుల కోసం గ్రో యువర్ బిజినెస్ ప్లేబుక్ ప్రారంభించిన ఫేస్‌బుక్ సంస్థ మెటా!
Facebook Playbook
KVD Varma
|

Updated on: Nov 10, 2021 | 9:28 AM

Share

Plybook: ఫేస్‌బుక్ యొక్క మాతృ సంస్థ మెటా భారతదేశంలో చిన్న- మధ్యస్థ వ్యాపారాలను (SMBs) సాధికారత చేయడానికి వ్యాపార కేంద్రమైన ‘గ్రో యువర్ బిజినెస్’ ప్లేబుక్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ‘గ్రో యువర్ బిజినెస్ హబ్’ అనేది మైక్రో, స్మాల్ అదేవిధంగా మీడియం బిజినెస్‌లకు వారి వృద్ధి ప్రయాణం ఆధారంగా అవసరమైన సమాచారం, సాధనాలు, వనరుల కోసం శోధించడానికి వన్-స్టాప్ గమ్యస్థానంగా ఉంటుంది. ‘ప్లేబుక్’.. ఫేస్‌బుక్ ఇండియాలో ప్రచురించిన మొట్టమొదటి పుస్తకం అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. దీనిలో చిన్న వ్యాపారవేత్తలకు వ్యాపార పేజీని ప్రారంభించడం, కంటెంట్‌ను సృష్టించడం.. పేజీలో ప్రకటనల గురించి తెలియజేస్తారు.

ఆన్‌లైన్ అమ్మకాలను పెంచడానికి ఒక వేదిక

ఈ ‘ప్లేబుక్’ మొదటి ఎడిషన్ ఉద్దేశ్యం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో వ్యాపారాన్ని ప్రారంభించడం. తద్వారా కరోనా వెలుపల, చిన్న వ్యాపారాలు ఆన్‌లైన్ అమ్మకాలను పెంచుకోవడానికి ఒక వేదికను పొందే అవకాశం కల్పించడం. ఫేస్‌బుక్ ఇండియా స్మాల్ అండ్ మీడియం బిజినెస్ డైరెక్టర్ అర్చన వోహ్రా మాట్లాడుతూ చిన్న వ్యాపారాలే భారత ఆర్థిక వ్యవస్థకు గ్రోత్ ఇంజన్ అని అన్నారు. నేటి కాలంలో, అనేక చిన్న వ్యాపారాలు ఆన్‌లైన్‌లో నడుస్తాయి. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగిస్తున్నాయి. అందువల్ల మెటా (META) ‘గ్రో యువర్ బిజినెస్ హబ్’ వారి వృద్ధి అవకాశాలను అన్‌లాక్ చేయడంలో గతంలో కంటే చాలా ముఖ్యమైనదని చెప్పారు. క్యూరేటెడ్ .. కస్టమైజ్డ్ బిజినెస్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్‌ల నుండి చిన్న వ్యాపారాల వరకు, ఇది ఆదాయాన్ని పెంచడంలో సహాయపడుతుందని వోహ్రా తెలిపారు.

ప్రజలు సోషల్ మీడియాలో కూడా మద్దతు పొందుతున్నారు..

భారతదేశంలో వాట్సాప్(WhatsApp) ఒక్కదానిలోనే, 15 మిలియన్ల మంది ప్రజలు తమ ఆన్‌లైన్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి.. అభివృద్ధి చేయడానికి మెటా(Meta) యాప్‌ని ఉపయోగిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో, గత 3 నెలల్లో, భారతదేశంలోని వ్యక్తులు చిన్న వ్యాపారం, స్థానిక షాపింగ్‌లకు తమ మద్దతును చూపించడానికి 1.2 మిలియన్లకు పైగా పోస్ట్‌లు.. కామెంట్లను పొందారు.

భారతదేశంలోని అర మిలియన్ కంటే ఎక్కువ చిన్న వ్యాపారాలు వారి బయోలో ఇమెయిల్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో వాట్సాప్ నంబర్ లేదా ఫోన్ నంబర్‌ను జాబితా చేశాయి. ఇది చాలా మంది కస్టమర్‌లను టెక్స్ట్, కాల్ ద్వారా నేరుగా సంప్రదించడానికి ప్రోత్సహిస్తుంది.

ఇవి కూడా చదవండి: Smart Watch: భారత్‌ మార్కెట్లో స్మార్ట్‌వాచ్‌ల హవా.. ఆ రెండు కంపెనీల జోరు.. మరిన్ని అమ్మకాల దిశలో పరుగులు!

COP26 Summit: ఐక్యరాజ్యసమితి కాప్26 సమ్మిట్ కోసం.. అతి చిన్న దేశం.. వినూత్నంగా సందేశం.. ఆలోచింపచేస్తున్న ప్రయత్నం!

Malala Marriage: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా వివాహం..సోషల్ మీడియాలో ప్రకటన!