AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Independence Day Offer: నథింగ్‌ ఫోన్‌ లవర్స్‌కు దిమ్మతిరిగే న్యూస్‌… నథింగ్‌ ఫోన్‌-2పై ప్రత్యేక తగ్గింపు

భారతదేశంలో ప్రారంభం నుంచి ఓ ప్రత్యేక ఫ్యాన్‌ బేస్‌ ఏర్పరచుకున్న నథింగ్‌ కంపెనీలు ఇండిపెండెన్స్‌ డే ఆఫర్‌ ఇస్తుంది. ముఖ్యంగా కంపెనీ ఇటీవల రిలీజ్‌ చేసిన నథింగ్‌-2 ఫోన్‌పై రూ.7000 తగ్గింపునిస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది. అయితే ఈ ఆఫర్‌ ఎలా పొందాలో ఓ సారి తెలుసుకుందాం. ఈ ఏడాది జూలైలో ₹ 44,999 ప్రారంభ ధరతో ప్రారంభించబడిన నథింగ్ ఫోన్ (2) విక్రయ ఆఫర్ సమయంలో మరింత తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.

Independence Day Offer: నథింగ్‌ ఫోన్‌ లవర్స్‌కు దిమ్మతిరిగే న్యూస్‌… నథింగ్‌ ఫోన్‌-2పై ప్రత్యేక తగ్గింపు
Nothing Phone 2
Nikhil
|

Updated on: Aug 07, 2023 | 1:00 PM

Share

ప్రస్తుతం భారతదేశంలో ఇండిపెండెన్స్‌ సేల్‌ ఫీవర్‌ నడుస్తుంది. ప్రముఖ ఈ కామర్స్‌ సైట్ల నుంచి ఆఫ్‌లైన్‌ స్టోర్స్‌ వరకూ ప్రతి ఒక్కరూ వినియోగదారులను ఆకర్షించడానికి ప్రత్యేక సేల్స్‌ నిర్వహిస్తున్నాయి. అయితే భారతదేశంలో ప్రారంభం నుంచి ఓ ప్రత్యేక ఫ్యాన్‌ బేస్‌ ఏర్పరచుకున్న నథింగ్‌ కంపెనీలు ఇండిపెండెన్స్‌ డే ఆఫర్‌ ఇస్తుంది. ముఖ్యంగా కంపెనీ ఇటీవల రిలీజ్‌ చేసిన నథింగ్‌-2 ఫోన్‌పై రూ.7000 తగ్గింపునిస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది. అయితే ఈ ఆఫర్‌ ఎలా పొందాలో ఓ సారి తెలుసుకుందాం. ఈ ఏడాది జూలైలో ₹ 44,999 ప్రారంభ ధరతో ప్రారంభించబడిన నథింగ్ ఫోన్ (2) విక్రయ ఆఫర్ సమయంలో మరింత తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ముఖ్యంగా ఈ ఫోన్‌ను ఐసీఐసీఐ, కోటక్‌ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.3000 వరకూ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ వర్తిస్తుంది. అలాగే ఈ ఫోన​ కొనుగోలు చేయడానికి ఏదైనా ఇతర ఫోన్‌ను ఎక్స్చేంజ్‌ చేస్తే రూ.4000 వరకూ అదనపు తగ్గింపు పొందవచ్చు. ఇలా నథింగ్‌ (2)పై రూ.7000 తగ్గింపును పొందవచ్చు. 

నథింగ్‌(2) ఫోన్‌ ఫీచర్లు ఇవే

నథింగ్‌(2) ఫోన్‌ స్నాప్‌ డ్రాగన్‌ 8 ప్లస్‌ జెన్‌ 1 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ముఖ్యంగా నథింగ్‌ (1)తో పోలిస్తే ప్రాసెసర్ అప్‌గ్రేడ్ చేయడం వల్ల ఈ ఫోన్‌ పనితీరులో 80 శాతం మెరుగుదల కనిపిస్తుంది. అలాగే ఈ ఫోన్‌లో  50 ఎంపీ ప్రైమరీ కెమెరాతో సోనీ ఐఎంఎక్స్‌ 890 సెన్సార్‌తో  వస్తుంది. ప్రైమరీ సెన్సార్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మద్దతుతో పాటు మోషన్ ఫోటో, సూపర్-రెస్ జూమ్, ఏఐ సీన్ డిటెక్షన్, ఎక్స్‌పర్ట్ మోడ్, డాక్యుమెంట్ మోడ్ వంటి అనేక ఇతర ఫీచర్‌లతో వస్తుంది. 45 వాట్స్‌ ఫాస్ట్‌  ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 4,700 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఈ ఫోన్‌ ప్రత్యేకత. ముఖ్యంగా ఈ ఫోన్‌ కేవలం 55 నిమిషాల్లో పూర్తిగా చార్జింగ్‌ అవుతుంది. అలాగే ఈ ఫోన్‌ నథింగ్ ఓఎస్‌ 2.0 కస్టమ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తుంది.

నథింగ్‌ ఫోన్‌ కొనుగోలుతో వాటిపై కూడా ఆఫర్స్‌

నథింగ్ ఫోన్ (1) లేదాని నథింగ్‌ ఫోన్ (2) కొనుగోలు చేసేవారికి నథింగ్ ఇయర్ (స్టిక్) టీడబ్ల్యూఎస్‌ ఇయర్‌ఫోన్‌ల కోసం ఒక ప్రత్యేకమైన ఆఫర్ వస్తుంది. దీని ధర రూ. 4999గా ఉంటే ఈ ఫోన్లను కొనుగోలు చేసిన వారిని రూ.749 తగ్గి కేవలం రూ.4,250కు వస్తుంది. అలాగే నథింగ్ ఇయర్ (2)  కూడా రూ.8,999కు అందుబాటులో ఉంటుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us