- Telugu News Photo Gallery Technology photos The intensity of these TVs is different.. If you are at home, the look is different.. For cricket lovers, it is a super experience..
Best Smart Tvs: ఈ టీవీల ఠీవి వేరు.. ఇంట్లో ఉంటే ఆ లుక్కే సెపరేటు.. క్రికెట్ లవర్స్‌కైతే సూపర్ ఎక్స్‌పీరియన్స్..
ప్రస్తుత కాలంలో స్మార్ట్ టీవీల వినియోగం పెరుగుతూ వస్తుంది. గతంలో టీవీలంటే కేవలం కేబుల్ ఆధారంగా ఉండేవి. కానీ ప్రస్తుతం టీవీలు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్‌తో పని చేయడం వల్ల వివిధ యాప్స్ కూడా పని చేస్తున్నాయి. అలాగే భారతదేశంలో క్రికెట్ లవర్స్‌కు కొదవే లేదు. గతంలో రేడియోలో క్రికెట్ కామెంట్రీ వినే స్థాయి నుంచి ప్రస్తుతం లైవ్‌లో మ్యాచ్ ఎంజాయ్ చేసే స్థాయికి వచ్చాం. అయితే అందరూ ఇంట్లోనే క్రికెట్‌ను లైవ్ చూడాలని అనుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రస్తుతం మార్కెట్‌లో 55 ఇంచుల నుంచి 65 ఇంచుల మధ్య ఉన్న స్మార్ట్ టీవీల గురించి తెలుసుకుందాం.
Srinu |
Updated on: Aug 07, 2023 | 12:45 PM

ఏసర్ 55 అంగుళాల గూగుల్ టీవీ మీ క్రికెట్ వీక్షణ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. 4 కే అల్ట్రా హెచ్‌డీ డిస్‌ప్లేతో వచ్చే ఈ టీవీ గూగుల్ వాయిస్ అసిస్టెంట్ ద్వారా అన్ని యాప్స్‌ను సులభంగా యాక్సెస్ చేసుకునే సదుపాయాన్ని ఇస్తుంది. డాల్బీ విజన్‌తో వచ్చే వచ్చే ఈ టీవీ ధర రూ.34,999గా ఉంది.

ఎల్‌జీ 55 అంగుళాల స్మార్ట్ టీవీ కచ్చితంగా క్రికెట్ లవర్స్‌ను అలరిస్తుంది. 4 కే రిజుల్యూషన్‌తో వచ్చే ఈ టీవీ మీ ఇంట్లోని హాలుకు సరికొత్త లుక్కునిస్తుంది. ముఖ్యంగా ఈ టీవీలో ఉండే ఫిల్మ్‌మేకర్ మోడ్ చిత్ర నాణ్యతను వేగంగా పెంచుతుంది. అన్ని ఓటీటీ యాప్‌లకు సపోర్ట్ చేసే ఈ టీవీ ధర రూ.43,990.

వన్ ప్లస్ 55 అంగుళాల స్మార్ట్ టీవీ ఇంట్లోనే థియేటర్ అనుభవాన్ని అందిస్తుంది. 4 కే రిజుల్యూషన్‌తో వచ్చే ఈ స్మార్ట్‌టీవీలో ఆండ్రాయిడ్ టీవీ యాప్స్ అన్నీ పని చేస్తాయి. లాగ్ ఫ్రీ గేమింగ్‌తో వచ్చే ఈ టీవీ ధర రూ.39,999.

రూ.69,990కు అందుబాటులో ఉండే సామ్‌సంగ్ 65 అంగుళాల స్మార్ట్ టీవీ టీవీ లవర్స్‌ను ఎక్కువగా ఆకట్టుకుంటుంది. 4 కే రిజుల్యూషన్ సపోర్ట్ చేసే ఈ టీవీలో స్క్రీన్ మిర్రరింగ్, మొబైల్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్ వంటి యాప్స్ ఈ టీవీలో సపోర్ట్ చేస్తాయి.

65 ఇంచుల వీయూ క్యూ ఎల్‌ఈడీ టీవీ 4కే అల్ట్రా హెచ్‌డీ రిజుల్యూషన్‌తో వస్తుంది. లైఫ్‌లైక్ యాక్షన్ కోసం అద్భుతమైన 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. గూగుల్ ప్లే స్టోర్ సాధారణ వాయిస్ కమాండ్‌తో యూట్యూబ్, నెట్ ఫ్లిక్స్ వంటి యాప్స్‌కు సులభమైన యాక్సెస్‌ను అందిస్తుంది. ఈ టీవీ ధర రూ.83999గా ఉంది.





























