Whatsapp Tips: వాట్సప్‌లో ఈ సెట్టింగ్స్‌ గురించి 90 శాతం మందికి తెలియదు.. అందరూ ఆఫ్‌లో ఉంచుకుంటారు..

వాట్సప్ వాడుతున్నారా.. అయితే మీరు ఈ సెట్టింగ్స్‌ను తప్పనిసరిగా ఎనేబుల్ చేసుకోవాల్సిందే. దీని వల్ల మీ వాట్సప్ డేటా, వివరాలు భద్రంగా ఉంటాయి. మీ ఫోన్ హ్యాక్ చేసినా మీ వివరాలు సేఫ్‌గా ఉంటాయి. ఈ సెట్టింగ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Whatsapp Tips: వాట్సప్‌లో ఈ సెట్టింగ్స్‌ గురించి 90 శాతం మందికి తెలియదు.. అందరూ ఆఫ్‌లో ఉంచుకుంటారు..
Whatsapp

Updated on: Jan 26, 2026 | 9:45 PM

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది వాడుతున్న ప్రముఖ మెస్సేజింగ్ యాప్‌గా వాట్సప్ కొనసాగుతోంది. ప్రపంచంలోనే ఎక్కువ ప్రజాదరణ యాప్‌లలో ఇది తొలిస్థానంలో ఉంది. స్మార్ట్‌ఫోన్ కలిగి ఉన్న ప్రతీఒక్కరూ వాట్సప్‌ను తప్పనిసరిగా వినియోగిస్తూ ఉంటారు. గంటల తరబడి వాట్సప్‌లో సమయం గడుపుతూ ఉంటారు. ఫ్రెండ్స్‌తో ఛాట్ చేసుకుంటూ లేదా వాయిస్, వీడియో కాల్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక వాట్సప్ గ్రూపుల్లో చిట్ చాట్ చేసుకుంటూ ఉంటారు. ఇతర మెస్సేజింగ్ యాప్స్ చాలానే అందుబాటులో ఉన్నా.. వాట్సప్ తొలి నుంచి ఉండటంతో అందరూ అలవాటు పడిపోయారని చెప్పవచ్చు. కస్టమర్లను పెంచుకునేందుకు వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. దీంతో వాట్సప్‌కు కొత్త కస్టమర్లు పెరుగుతూనే ఉన్నారు.

వాట్సప్‌లో ఈ ఫీచర్ ఆన్ చేసుకోండి

అయితే యూజర్ల భద్రత కోసం వాట్సప్ అనేక ఫీచర్లను ప్రవేశపెడుతోంది. కానీ వీటి గురించి తెలియక చాలామంది ఈ సెట్టింగ్స్‌ను ఆఫ్‌లో పెట్టుకుంటారు. ఇలా చేయడం వల్ల మీ ఫోన్ ప్రమాదంలో పడటంతో పాటు డేటా లీకయ్యే అవకాశముంది. వీటి నుంచి తప్పించుకోవాలంటే ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఆప్షన్‌ను ఆన్‌లో పెట్టుకోవాలి. వాట్సప్ ఉపయోగించే 90 శాతం మంది ఈ సెట్టింగ్‌ ఆఫ్‌లో ఉంచుకుంటారు. ఈ సెట్టింగ్‌ను ఆన్ చేసుకోవడం వల్ల ఫిషింగ్ అటాక్స్, డేటా లీక్ నుంచి మీరు రక్షించబడతారు.

వాట్సప్ హ్యాక్ కాకుండా..

ఇక ఇటీవల వాట్సప్ హ్యాకింగ్ ఘటనలు జరుగుతున్నాయి. వాట్సప్‌లోకి మాల్వేర్, వైరస్‌లు పంపి వ్యక్తిగత వివరాలను సైబర్ నేరగాళ్లు చోరీ చేస్తున్నారు. దీని బారిన మీరు పడకుండా ఉండాలంటే వాట్సప్‌లో 6 అంకెల పిన్ నెంబర్‌ను సెక్యూరిటీ కోడ్‌గా పెట్టుకుంది. దీని వల్ల మీ వాట్సప్‌ను ఎవరైనా ఓపెన్ చేయాలన్నా పిన్ నెంబర్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీంతో అకౌంట్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఈ పిన్ సెట్ చేసుకోండి.

సెక్యూరిటీ నోటిఫికేషన్ ఆన్‌లో ఉంచుకోండి

ఇక వాట్సప్‌లో సెక్యూరిటీ నోటిఫికేషన్లు అందేలా ఆప్షన్‌ను ఆన్ చేసి పెట్టుకోండి. దీని వల్ల ఎన్‌క్రిప్షన్ కోడ్ మారితే మీకు నోటిఫికేషన్లు వస్తాయి. ఇక వాట్సప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ప్రైవసీ ఆప్షన్‌ను ఎంచుకోండి. అడ్వాన్స్‌డ్ ఆప్షన్‌లోకి వెళ్లి ప్రొటెక్ట్ ఐపీ, అడ్రస్ ఇన్ కాల్స్ ఆఫ్షన్‌ను టోగుల్ చేయండి. మీ వాట్సాప్‌లో ఈ సెట్టింగ్స్ అన్నీ ఎనేబుల్ చేసుకోవడం వల్ల సురక్షితంగా ఉంటుంది. మీ వాట్సప్‌లోని వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు అన్నీ ఇతరులకు చేరకుండా సేఫ్‌గా ఉంటాయి. వెంటనే వీటిని ఆన్ చేసుకుని మీ వాట్సప్‌ను సురక్షితంగా ఉంచుకోండి