Driving Tips: మీరు కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్నారా..? ఈ ఐదు విషయాలను తప్పకుండా తెలుసుకోండి.. లేకపోతే ఇబ్బందే..

|

Dec 17, 2022 | 6:31 PM

ఈ రోజుల్లో కారు డ్రైవింగ్‌ చేయాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. మధ్య తరగతి కుటుంబాలు సైతం కారును కొనుగోలు చేస్తున్నారు. అయితే వీటన్నింటికి ముందు కారు డ్రైవింగ్‌ వచ్చి ఉండాలి..

Driving Tips: మీరు కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్నారా..? ఈ ఐదు విషయాలను తప్పకుండా తెలుసుకోండి.. లేకపోతే ఇబ్బందే..
Driving Tips
Follow us on

ఈ రోజుల్లో కారు డ్రైవింగ్‌ చేయాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. మధ్య తరగతి కుటుంబాలు సైతం కారును కొనుగోలు చేస్తున్నారు. అయితే వీటన్నింటికి ముందు కారు డ్రైవింగ్‌ వచ్చి ఉండాలి. డ్రైవింగ్‌ కోసం చాలా మంది డ్రైవింగ్‌ స్కూల్‌లను సంప్రదిస్తుంటారు. వాటి ద్వారానే ఎక్కువ మంది డ్రైవింగ్‌ నేర్చుకుంటారు. కారు స్టీరింగ్ మొదటిసారిగా చేతికి వచ్చినప్పుడు చాలా మంది భయాందోళన చెందుతుంటారు. డ్రైవింగ్‌ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే మీకు డ్రైవింగ్‌ నడపడం సులభం అవుతుంది. ఇందు కోసం మీకు కొన్ని విషయాలను సూచిస్తున్నాము. డ్రైవింగ్ నేర్చుకునే ముందు ట్రాఫిక్ రూల్స్ గురించి తెలుసుకోవాలి. మీరు ట్రాఫిక్ నిబంధనల ప్రకారం కారును నడిపితే మీరు రోడ్డు ప్రమాదాల నుండి మిమ్మల్ని, ఇతరులను రక్షించవచ్చు .

  1.  సిమ్యులేటర్ ఉపయోగించండి: డ్రైవింగ్ స్కూల్‌లో రోడ్డుపై డ్రైవింగ్ నేర్పించే ముందు సిమ్యులేటర్ ద్వారా అధునాతన డ్రైవింగ్ శిక్షణ ఇస్తారు. దీని ప్రయోజనం ఏమిటంటే కారు నేర్చుకునే వ్యక్తి రోడ్డుపై వాహనం బ్యాలెన్స్, ఇతర వాహనాల నుండి దూరం ఉండటం, ప్రతి మలుపులో వేగ పరిమితి, ఓవర్‌టేక్ చేసే సమయంలో జాగ్రత్త పడటం, బ్రేకింగ్ మొదలైనవాటిని నేర్చుకుంటారు. సిమ్యులేటర్ తరువాత మీరు రోడ్డుపై డ్రైవ్ చేసినప్పుడు డ్రైవింగ్‌కు సంబంధించిన విషయాలు తెలుసుకుంటారు.
  2. స్పీడ్‌లో డ్రైవింగ్ చేయవద్దు: చాలాసార్లు యువకులు అతివేగంగా డ్రైవింగ్ చేయడం చూస్తుంటాము. అయితే ఎక్కువ వేగంతో యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని మర్చిపోతున్నారు. అందుకే రోడ్డుపై వాహనాన్ని ఎప్పుడూ స్లో స్పీడ్‌లో ఉంచాలి. తద్వారా మీరు మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకోవచ్చు. మీ జాగ్రత్తల కారణంగా పక్క వాహనాలు కూడా సురక్షితంగా ఉంటాయి.
  3. సీటు బెల్ట్ ధరించడం మర్చిపోవద్దు: మీరు కారులో కూర్చున్న వెంటనే ముందుగా సీట్ బెల్ట్ ధరించండి. ఇది కాకుండా మీతో కూర్చున్న వ్యక్తిని సీట్ బెల్ట్ ధరించమని చెప్పండి. వెనుక కూర్చున్న వారు తప్పనిసరిగా సీటు బెల్టు పెట్టుకోవాలి. మీరు సీటు బెల్ట్ ధరించాల్సింది చలాన్‌ను తప్పించుకోవడానికి కాదు.. మీ భద్రత కోసం అని గుర్తుంచుకోండి. చాలా రోడ్డు ప్రమాదాల్లో డ్రైవర్ సీటు బెల్టు పెట్టుకోకపోవడాన్ని గమనించి ఉంటారు.
  4. రోడ్డుపై మాత్రమే దృష్టి పెట్టండి: డ్రైవింగ్ చేసేటప్పుడు మీ దృష్టి రోడ్డుపై మాత్రమే ఉండాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్‌లో మాట్లాడటం లేదా మెసేజ్ చేయడం మానుకోవాలి. కారులో కూర్చున్న వారి మాటలు పట్టించుకోకూడదు. ఎందుకంటే మాట్లాడేటప్పుడు చాలాసార్లు కారు బ్యాలెన్స్‌ను పట్టించుకోక ప్రమాదం జరుగుతుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. అద్దాలు వాడండి: కారు నడుపుతున్నప్పుడు రియర్ వ్యూ మిర్రర్, వింగ్ మిర్రర్ అంటే సైడ్ మిర్రర్‌ని సరిగ్గా ఉపయోగించండి. దీని కోసం మీరు అన్ని అద్దాలను సరిగ్గా చూడాలి. దీని కారణంగా మీరు కుడి, ఎడమ వైపు నుంచి వచ్చే వాహనంపై ఒక కన్నేసి ఉంచండి. కారును రివర్స్ చేస్తున్నప్పుడు వెనుకవైపు చూసేందుకు మీ తలను కారు నుండి బయటకు తీయకుండా ఉండండి. ఈ రోజుల్లో చాలా కార్లు పార్కింగ్ కెమెరాలతో వస్తున్నాయి. దీని కారణంగా కారును నడపడం, పార్కింగ్ చేయడం చాలా సులభం.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి