గూగుల్ మ్యాప్స్ వినియోగం ప్రస్తుతం అనివార్యంగా మారిన విషయం తెలిసిందే. తెలిసిన అడ్రస్‌ను సైతం గూగుల్ మ్యాప్స్‌లో చూస్తున్న వెళ్తున్న రోజులివి. జర్నీకి ఎంత టైం పడుతుంది.? ఏవైనా షార్ట్‌కర్ట్స్ ఉన్నాయా.? లాంటి వివరాలను తెలుసుకుంటూ వెళ్లేందుకు మ్యాప్స్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే ప్రతీ ఒక్కరి ఫోన్‌లో కచ్చితంగే ఉండే ఈ మ్యాప్స్‌లో మనకు తెలియని ఎన్నో ఫీచర్లు ఉన్నాయని మీకు తెలుసా.? ఇంతకీ ఆ ఫీచర్లు ఏంటి.? వాటి ఉపయోగం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* గూగుల్ మ్యాప్స్‌లో అందుబాటులో ఉన్న ఫీచర్స్‌లో టైమ్‌లైన్ ఫీచర్ ఒకటి. ఈ ఫీచర్ సహాయంతో మీరు ఏ రోజు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవచ్చు. తేదీని సెలక్ట్ చేసుకుంటే చాలు ఆరోజు మీరు ఎంత దూరం ప్రయాణించారు. ఏ వాహనంలో వెళ్లారు.? ఏయే ప్రాంతాలను సందర్శించారు. లాంటి వివరాలను తెలుసుకోవచ్చు. ఇందుకోసం గూగుల్ మ్యాప్స్‌ను ఓపెన్ చేసి ప్రొఫైల్‌లో ఉన్న టైమ్‌లైన్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది.
* గూగుల్ మ్యాప్స్‌లో నిత్యం ఆటో అప్‌డేట్స్ జరుగుతూనే ఉంటాయి. దీంతో డేటాతో పాటు ఛార్జింగ్ త్వరగా డిస్‌చార్జ్ అవుతుంది. అయితే ఓ చిన్న సెట్టింగ్‌ను మార్చుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. ఇందుకోసం ప్రొఫెల్‌లోకి వెళ్‌లి ఆఫ్‌లైన్ మ్యాప్స్ సెట్టింగ్స్ ఆప్షన్‌లోకి వెళ్లాలి. అనంతరం అందులో ఉండే.. ఆటో అప్‌డేట్ ఆఫ్‌లైన్ మ్యాప్స్, ఆటో డౌన్‌లోడెడ్ రికమండెండ్ మ్యాప్స్ ఆప్షన్స్‌ను డిజేబుల్ చేసుకుంటే సరిపోతుంది. దీంతో డేటాను సేవ్ చేసుకోవచ్చు. అవసరమైనప్పుడు ఆన్ చేసుకుంటే సరిపోతుంది.
* గూగుల్ మ్యాప్స్‌లో అందుబాటులో ఉన్న మరో సీక్రెట్ ఫీచర్. మీరు ఎక్కడున్నారన్న విషయాన్ని లైవ్‌లో చూసుకోవచ్చు. ఇందుకోసం ప్రొఫైల్‌లోకి వెళ్లి షేర్ లొకేషన్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అనంతరం షేర్ లొకేషన్‌ను మీకు నచ్చిన వారికి పంపించుకోచ్చు. ఎంత సమయం లొకేషన్ షేర్ చేసుకోవచ్చో సమయాన్ని ఎంచుకోవాలి.
* మ్యాప్స్‌లో అందుబాటులో ఉన్న మరో బెస్ట్ ఫీచర్స్ విషయానికొస్తే రియల్‌టైమ్ లొకేషన్. సాధారణంగా మనం ఏదైనా లొకేషన్ సెట్ చేసుకున్న సమయంలో ప్రివ్యూ మాములుగా కనిపిస్తుంది. అలా కాకుండా రియల్ టైమ్ లొకేషన్స్ కనిపించాలంటే అందుకోసం రూట్ ప్రివ్యూ పక్కన ఉన్న త్రీ డాట్స్‌ను సెలక్ట్ చేసుకొని. శాటిలైట్, ట్రాఫిక్ ఆప్షన్స్‌ను ఎంచుకోవడం వల్ల బెస్ట్ ప్రివ్యూ కనిపిస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..