Smart watch: స్మార్ట్‌వాచ్‌లు హార్ట్ బీట్‌ని ఎలా లెక్కిస్తాయి.? దీని వెనకాల ఉన్న టెక్నాలజీ ఏంటో తెలుసా.?

Narender Vaitla

Narender Vaitla |

Updated on: Jan 23, 2023 | 7:35 PM

ఒకప్పుడు వాచ్‌ అంటే కేవలం సమయాన్ని తెలియజేసే ఒక సాధానం మాత్రమే. కానీ నేడు స్మార్ట్‌ వాచ్‌ల రాకతో వాచ్‌కి అర్థమే మారిపోయింది. బాడీ టెంపరేచర్‌ నుంచి ఆక్సిజన్‌ లెవల్స్‌ వరకు, గుండె కొట్టుకునే తీరు నుంచి ఎంత దూరం నడిచారు అన్న విషయాలను చెప్పేస్తున్నాయి...

Smart watch: స్మార్ట్‌వాచ్‌లు హార్ట్ బీట్‌ని ఎలా లెక్కిస్తాయి.? దీని వెనకాల ఉన్న టెక్నాలజీ ఏంటో తెలుసా.?
Smart Watch

ఒకప్పుడు వాచ్‌ అంటే కేవలం సమయాన్ని తెలియజేసే ఒక సాధానం మాత్రమే. కానీ నేడు స్మార్ట్‌ వాచ్‌ల రాకతో వాచ్‌కి అర్థమే మారిపోయింది. బాడీ టెంపరేచర్‌ నుంచి ఆక్సిజన్‌ లెవల్స్‌ వరకు, గుండె కొట్టుకునే తీరు నుంచి ఎంత దూరం నడిచారు అన్న విషయాలను చెప్పేస్తున్నాయి. వాతావరణం అలర్ట్స్‌తో పాటు మరెన్నో అద్భుత ఫీచర్లకు స్మార్ట్‌ వాచ్‌లు పెట్టింది పేరు. ఇలాంటి ఫీచర్స్‌లో హార్ట్ బీట్ ఒకటి. చేతికి ధరించిన స్మార్ట్ వాచ్‌ మన హార్ట్‌ బీట్‌ను ఎలా లెక్కిస్తుందనే సందేహం రావడం సర్వసాధారణమైన విషయమే.? అయితే స్మార్ట్‌ వాచ్‌ హార్ట్‌ బీట్‌ను ఎలా లెక్కగడుతుంది.? అసలు దీని వెనకాల ఉన్న టెక్నాలజీ ఏంటో ఇప్పుడు చూద్దాం..

హార్ట్‌ బీట్‌ను లెక్కగట్టడానికి స్మార్ట్‌ వాచ్‌లో ఫొటోఫ్లెతిస్మోగ్రఫీ అనే టెక్నాలజీని ఉపయోగిస్తారు. అలాగే స్మార్ట్‌ ఫోన్‌కు వెనకాల గ్రీన్‌ లైట్‌ వెలుగుతుండడాన్ని గమనించే ఉంటారు. ఈ గ్రీన్‌ లైటే మన హార్ట్‌బీట్‌ను లెక్కిస్తుంది. స్మార్ట్‌వాచ్‌ నుంచి వచ్చే గ్రీన్‌ లైట్‌ చేతి గుండాలోపలికి ప్రవేశిస్తుంది. ఆ సమయంలో ఎరుపు రక్తంలో ఉండే బ్లడ్ గ్రీన్‌ కలర్‌ని అబ్జర్వ్‌ చేసుకుంటుంది. అయితే రక్తం లేని చోట గ్రీన్‌ లైన్‌ రిఫ్లక్ట్ అవుతుంది. రిఫ్లక్ట్ అయిన ఆ గ్రీన్‌ లైట్‌ వాచ్‌లో ఉండే ఆప్టికల్‌ సెన్సార్‌ను క్యాప్చర్‌ చేస్తుంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

గుండె కొట్టుకునే సమయంలో రక్తం శరీరం గుండా ప్రవహిస్తుందనే విషయం తెలిసిందే. చేతిలో ప్రవహించే ఈ రక్త ప్రసారణ ఆధారంగానే స్మార్ట్‌వాచ్‌లోని గ్రీన్‌ లైట్‌ గుండె కొట్టుకునే వేగాన్ని లెక్కిస్తుంది. హార్ట్‌బీట్‌ని బట్టి చేతిలో ప్రవహించే రక్తంలో హెచ్చుతగ్గుల ఆధారంగానే హార్ట్‌ బీట్‌ను స్మార్ట్‌ వాచ్‌ లెక్కిస్తుంది. ఇదంటీ స్మార్ట్‌ వాచ్‌ వెనకాల ఉన్న అసలు టెక్నాలజీ.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu