ఇటీవల కాలంలో ఈ మెసేజింగ్ యాప్ లో ఒక స్కామ్ వెలుగులోకి వచ్చింది. చిన్ననాటి చిత్రం పేరుతో వచ్చే మెసేజ్ కారణంగా అనేక మంది మోసానికి గురవుతున్నారు. కొంచె అప్రమత్తంగా ఉంటే ఇలాంటి మోసాల నుంచి దూరంగా ఉండవచ్చు. ముందుగా టెలిగ్రామ్ లో మీకు మెసేజ్ వస్తుంది. దాన్ని ఓపెన్ చేయగానే మీ స్నేహితులు లేదా సన్నిహితులు పంపినట్టు ఉంటుంది. మీ చిన్ననాటి ఫొటోలు అనే క్యాప్షన్ కూడా రాస్తారు. దాని కింద ఒక లింక్ ను కూడా పంపిస్తారు. చిన్ననాటి ఫొటో చూడాలనే ఆసక్తితో దాన్ని ఓపెన్ చేయగానే మీరు ఓ పేజీలోకి వెళతారు. అక్కడ మొబైల్ నంబర్ ను ఎంటర్ చేయాలని ఉంటుంది. ఆ తర్వాత ఓటీపీ అడుగుతుంది. మీ మొబైల్ కు వచ్చిన ఓటీపీని దానిలో ఎంటర్ చేయడానే మీ ఖాతా స్కామర్ల చేతిలోకి వెళుతుంది.
చిన్ననాటి ఫోటోలు పేరుతో స్కామర్లు పాల్పడుతున్న కొత్త మోసం ఇది. ఫొటోలు చూడాలన్న ఆసక్తితో లింక్ ను క్లిక్ చేసి వివరాలు నమోదు చేస్తే తీవ్ర నష్టం కలుగుతుంది. దానిలోని సూచనల ప్రకారం అన్ని దశలను పూర్తి చేసి, ఓటీపీ నమోదు చేయడానే మీ ఖాతా హ్యాక్ అవుతుంది. దాన్ని అవతలి వారు నియంత్రణ చేసే అవకాశం కలుగుతుంది. ఆ వ్యక్తి మీ ఖాతాను దుర్వినియోగం చేయవచ్చు. దానిలోకి ముఖ్యమైన సందేహాలను, మీ వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించే ప్రమాదం ఉంది. అలాగే ఇతర ప్రమాదకర ఖాతాలకు యాక్సెస్ చేయవచ్చు. టెలిగ్రామ్ యూజర్లు కొంచెం అప్రమత్తంగా వ్యవహరిస్తే ఇలాంటి స్కాములకు దూరంగా ఉండవచ్చు.
ముందుగా టెలిగ్రామ్ వెబ్ సైట్ కు సంబంధించి యూఆర్ఎల్ నంబర్ ను జాగ్రత్తగా చూడాలి. దానిలోని వివరాలను పరిశీలించాలి. సాధారణంగా మన స్నేహితులు, బంధువులు పంపిన ఫోటోలను చూడటానికి ఓటీపీ అవసరం ఉండదు. పెరిగిన టెక్నాలజీని ఆసరాగా చేసుకుని స్కామర్లు అనేక మోసాలకు పాల్పడుతున్నారు. వివిధ రకాల ప్రలోభాలకు గురి చేస్తూ సందేశాలను పంపుతున్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వీరి బారిన పడి మోసపోయే ప్రమాదం ఉంది. మనకు వచ్చిన మెసేజ్ లను జాగ్రత్తగా చదవాలి. వాటిలోని లింక్ లను సాధ్యమైనంత వరకూ క్లిక్ చేయకపోవడమే మంచింది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి