Chandra Grahan 2025: ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం.. అరుదైన అవకాశం.. హైదరాబాద్‌లో సందడి

Chandra Grahan 2025: ఆసియా, పశ్చిమ ఆస్ట్రేలియాలో ఇది సంపూర్ణ చంద్రగ్రహణం. ఐరోపా, ఆఫ్రికా, తూర్పు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో మాత్రం పాక్షిక చంద్రగ్రహణం అంటున్నారు శాస్త్రవేత్తలు. భూమి ఆరోగ్యాన్ని కొలిచే సాధనంగా కూడా బ్లడ్‌మూన్‌ని చూస్తున్నారు సైంటిస్టులు. ఎందుకంటే భూమి ఎంత ఎర్రగా..

Chandra Grahan 2025: ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం.. అరుదైన అవకాశం.. హైదరాబాద్‌లో సందడి

Updated on: Sep 07, 2025 | 10:47 PM

Chandra Grahan 2025: ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. గ్రహణ ఘడియలు మొదలయ్యాయి. ఒకే సరళరేఖలోకి సూర్యుడు, భూమి, చంద్రుడు రావడం… భూమి నీడలోకి చంద్రుడు పూర్తిగా వెళ్లిపోవడంతో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. దీన్ని చూడటానికి మీరు ఏ ఎత్తైన ప్రదేశానికి వెళ్లవలసిన అవసరం లేదు. ఎందుకంటే అది సులభంగా కనిపిస్తుంది. ఈరోజు, సెప్టెంబర్ 7 రాత్రి 11:00 నుండి 12:22 వరకు ఈ చంద్రగ్రహణం భారతదేశంలోనే అత్యంత ఎర్రగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

రాత్రి 9 గంటల 57 నిమిషాలకు మొదలైన చంద్రగ్రహణం… అర్ధరాత్రి 1:26 వరకు కనిపించబోతోంది. అరుదైన ఈ దృశ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది వీక్షిస్తున్నారు. ఈ బ్లడ్‌మూన్‌ దాదాపు 82 నిమిషాల పాటు కొనసాగనుందంటున్నారు శాస్త్రవేత్తలు. రాత్రి 11 గంటలకు సంపూర్ణ గ్రహణం మొదలవుతుందని.. 11.41కి చంద్రుడు అత్యంత ఎర్రగా మారతాడని చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: UPI New Limit: సెప్టెంబర్ 15 నుంచి యూపీఐలో కీలక మార్పులు.. లావాదేవీ పరిమితులు ఇవే

ఇవి కూడా చదవండి

హైదరాబాద్, విజయవాడ, ముంబై, కోల్‌కతాలోనూ బ్లడ్‌మూన్‌ను చూసేందుకు ఏర్పాట్లు చేయడంతో వందలాది మంది వీక్షకులు తరలివచ్చారు. అయితే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే హిమాచల్‌, లడాఖ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, కూర్గ్‌లో బ్లడ్‌మూన్‌ చాలా స్పష్టంగా కనిపిస్తుందంటున్నారు సైంటిస్టులు.

ఢిల్లీలోని నెహ్రూ ప్లానిటోరియంలో వీక్షకుల సందడి మామూలుగా లేదు. చంద్రగ్రహణాన్ని చూసేందుకు భారీగా ఏర్పాట్లు చేశారు. టెలిస్కోప్, భారీ స్క్రీన్లు పెట్టడంతో.. గ్రహణాన్ని చూసేందుకు వేలాది మంది వచ్చారు. ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వహకులు తెలిపారు.

ఇది కూడా చదవండి: BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి మరో సూపర్‌ ప్లాన్‌.. చౌకైన రీఛార్జ్‌తో 65 రోజుల వ్యాలిడిటీ

బ్లడ్‌మూన్‌ను చూసేందుకు బెంగళూరులోనూ భారీగా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక కళ్లద్దాలు, టెలిస్కోప్‌లను ఏర్పాటు చేశారు. అయితే అలాంటివేం లేకుండా నార్మల్‌గా చూసినా ఎలాంటి ఇబ్బంది లేదంటున్నారు శాస్త్రవేత్తలు. బ్లడ్‌మూన్‌ ఖగోళ ప్రియులకు పండగే అంటున్నారు

ఆసియా, పశ్చిమ ఆస్ట్రేలియాలో ఇది సంపూర్ణ చంద్రగ్రహణం. ఐరోపా, ఆఫ్రికా, తూర్పు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో మాత్రం పాక్షిక చంద్రగ్రహణం అంటున్నారు శాస్త్రవేత్తలు. భూమి ఆరోగ్యాన్ని కొలిచే సాధనంగా కూడా బ్లడ్‌మూన్‌ని చూస్తున్నారు సైంటిస్టులు. ఎందుకంటే భూమి ఎంత ఎర్రగా కనిపిస్తే కాలుష్యం అంత దట్టంగా ఉన్నట్టు. ఇది ఓరకంగా భూమి ఆరోగ్యానికి పరీక్షలాంటిదంటున్నారు.

ఇది కూడా చదవండి: Metro Station: మెట్రో స్టేషన్‌లోకి అతిపెద్ద అరుదైన బల్లి.. హడలిపోయిన ప్రయాణికులు

ఈ తరహా ఖగోళ సంఘటన చాలా అరుదంటారు శాస్త్రవేత్తలు. ఒక తరానికి ఒకసారి మాత్రమే ఇలాంటివి సంభవిస్తాయని, మళ్లీ ఎన్నో దశాబ్దాల తర్వాత కానీ ఇటువంటి అద్భుతం సాక్షాత్కారం కాకపోవచ్చంటారు సైంటిస్టులు.

ఇది కూడా చదవండి: BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి మరో సూపర్‌ ప్లాన్‌.. చౌకైన రీఛార్జ్‌తో 65 రోజుల వ్యాలిడిటీ

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి