Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samsung: సామ్‌సంగ్‌ ఫోన్ వాడుతున్నారా.. అయితే మీ ఫోన్ హ్యాక్ అయి ఉండొచ్చు.. ఓసారి చెక్ చేసుకోండి

ఇదంతా ఎందుకంటే.. మనం సురక్షితం అనుకున్న ఫోన్లను సైతం సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేయగల్గుతున్నారు. ఇప్పుడు ఆ కోవలోకి ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ శాంసంగ్ (SAMSUNG) కూడా చేరింది. ఆ సంస్థ తయారు చేసిన కొన్ని ఫోన్లు హ్యాకింగ్ బారిన పడే ప్రమాదం ఉందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఇప్పటికే కొందరు వినియోగదారులు హ్యాకింగ్ బారిన పడి ఉండొచ్చని కూడా అంచనా వేసింది. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ...

Samsung: సామ్‌సంగ్‌ ఫోన్ వాడుతున్నారా.. అయితే మీ ఫోన్ హ్యాక్ అయి ఉండొచ్చు.. ఓసారి చెక్ చేసుకోండి
Samsung Phone
Follow us
Mahatma Kodiyar, Delhi, TV9 Telugu

| Edited By: Narender Vaitla

Updated on: Dec 16, 2023 | 10:11 PM

మనిషి సౌలభ్యం కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంతగా అభివృద్ధి చేస్తుంటే.. అంతే వేగంగా దాన్ని దుర్వినియోగం చేసే నేరగాళ్లు కూడా పెరిగిపోతున్నారు. ఒకప్పుడు సుదూరంగా ఉన్న బంధుమిత్రులతో మాట్లాడ్డం కోసం ఉపయోగపడ్డ మొబైల్ ఫోన్.. స్మార్ట్‌గా మారాక డిజిటల్ యుగంలో ప్రతి పనికీ మొబైల్ ఫోన్‌ ఉపయోగిస్తున్నాం. బ్యాంకింగ్ సేవలు, ప్రభుత్వ సేవలకు కూడా మొబైల్ ఫోన్లు, మొబైల్ నెంబర్లు అనుసంధాన వేదికగా మారాయి. అదేమాదిరిగా అమాయకులను బుట్టలో వేసుకునే సైబర్ నేరగాళ్లు, మాయగాళ్లు కూడా ఉన్నారు.

ఇదంతా ఎందుకంటే.. మనం సురక్షితం అనుకున్న ఫోన్లను సైతం సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేయగల్గుతున్నారు. ఇప్పుడు ఆ కోవలోకి ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ శాంసంగ్ (SAMSUNG) కూడా చేరింది. ఆ సంస్థ తయారు చేసిన కొన్ని ఫోన్లు హ్యాకింగ్ బారిన పడే ప్రమాదం ఉందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఇప్పటికే కొందరు వినియోగదారులు హ్యాకింగ్ బారిన పడి ఉండొచ్చని కూడా అంచనా వేసింది. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) జారీ చేసిన ఈ హెచ్చరికలు హై-రిస్క్ కేటగిరీలో ఉండడం ఆందోళన కల్గిస్తోంది.

ఆ 4 వెర్షన్లతోనే ప్రమాదం…

శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన హై-రిస్క్ అలర్ట్‌లో 4 ఆండ్రాయిడ్ వర్షన్లు ఉన్నాయని ప్రభుత్వం కింద పనిచేస్తున్న నోడల్ ఏజెన్సీ CERT-In తెలిపింది. మొబైల్‌ ఫోన్లలోని వ్యక్తిగత సమాచారమే హ్యాకర్ల లక్ష్యమని నోడల్ ఏజెన్సీ చెబుతోంది. Samsung స్మార్ట్‌ఫోన్లను వినియోగిస్తున్నవారిలో ఏయే ఫోన్లకు ముప్పు అధకంగా ఉందో వివరంగా పేర్కొంది. ఆయా ఫోన్ల వినియోగదారులు మరింత అప్రమత్తంగా ఉండాలని, హ్యాకింగ్‌ను నివారించడానికి వారు ఎలాంటి తక్షణ చర్యలు తీసుకోవాలో కూడా వివరించింది. ప్రభుత్వం ప్రకటన ప్రకారం, శాంసంగ్ స్మార్ట్‌ఫోన్లలో 4 ఆండ్రాయిడ్ వెర్షన్‌లలో ఈ లోపాలు బయటపడ్డాయి. CERT-In ప్రకారం ఆండ్రాయిడ్ వర్షన్ 11, 12, 13, అలాగే వర్షన్ 14తో నడుస్తున్న శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల లోపాలు ఉన్నాయి. వాటి కారణంగా ఆయా ఫోన్‌లను సులభంగా హ్యాక్ చేయవచ్చు. తద్వారా మొబైల్‌లోని సున్నితమైన సమాచారం మాత్రమే కాదు, వ్యక్తిగత సమాచారాన్ని అలాగే SIM పిన్‌ను కూడా హ్యాకర్లు యాక్సెస్ చేయవచ్చని CERT-In పేర్కొంది.

హ్యాకింగ్ ఎలా గుర్తించాలి.?

శాంసంగ్ వినియోగదారులు తక్షణమే తమ ఫోన్ హ్యాక్ అయిందో లేదో తెలుసుకోవచ్చు. ఇందుకోసం ఏం చేయాలన్నది కూడా ప్రభుత్వం తన ప్రకటనలో వివరించింది. ఒకవేళ హ్యాక్ అయిందని తేలితే దాన్నుంచి ఎలా బయటపడాలో కూడా తెలియజేసింది. మొదట *#21# ను డయల్ చేయాలి. ఈ పని చేసిన వెంటనే మెసేజ్ లేదా ఇతర ఫీచర్ల ముందు Not forwarded అని కనిపిస్తే మీ మొబైల్ సురక్షితంగా ఉందని అర్థం. ఒకవేళ Forwarded అని దాని ముందు రాసి ఉంటే, మీ మొబైల్ హ్యాక్ అయిందని, ఆ ఫోన్ డేటాను ఎవరో దొంగిలించారని అర్థం.

ఇప్పుడు హ్యాకింగ్‌ను ఎలా వదిలించుకోవాలో తెలుసుకుందాం. దీని కోసం మరో నంబర్‌కు డయల్ చేయాల్సి ఉంటుంది. ##002# టైప్ చేసి డయల్ చేసిన వెంటనే, మీ ఫోన్ హ్యాకింగ్ నుంచి బయటపడుతుంది. ఆ క్షణం నుంచి మొబైల్ సురక్షితంగా మారుతుంది. అయితే అప్పటికే జరిగిన నష్టాన్ని గుర్తించాల్సి ఉంటుంది. వెనువెంటనే పాస్‌వర్డ్‌లను మార్చడం, లేటెస్ట్ వర్షన్ డౌన్లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

హ్యాకర్లు ఏ డేటాను సేకరిస్తారు.?

ప్రభుత్వ హెచ్చరిక ప్రకారం మొబైల్ ఫోన్ హ్యాక్ అయిందంటే మీ ఫోన్‌లోని ఫోటోలు, వీడియోలను సులభంగా కాపీ చేసుకోవచ్చు. అలాగే ఫోన్‌లో సేవ్ చేసిన నంబర్లను కూడా హ్యాకర్లు తెలుసుకునే అవకాశం ఉంటుంది. మొబైల్‌లో సేవ్ చేసిన బ్యాంకు ఖాతా వివరాలు, పాస్‌వర్డ్‌లు కూడా లీకయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాదు మీరున్న లొకేషన్ కూడా హ్యాకర్లు తెలుసుకునే ప్రమాదం ఉంది. ఏ ఫోన్ అయినా సరే హ్యాకింగ్ బారిన పడకుండా కాపాడుకోనికి ప్రతి వినియోగదారుడు కొన్ని కనీస జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మొబైల్ ఫోన్‌లో తాజా సెక్యూరిటీని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయడం చాలా ముఖ్యం.

అలాగే ఏదైనా యాప్‌ను డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేసే ముందు దాని గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలి. ఆ యాప్ కోసం ఇచ్చే పర్మిషన్ల విషయంలో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అన్నింటి కంటే ముఖ్యం.. ఏ లింక్‌పై పడితే ఆ లింక్‌పై క్లిక్ చేయవద్దు. అలాంటి లింకుల ద్వారానే హ్యాకర్లు మన ఫోన్లలోకి స్పైవేర్లు, మాల్‌వేర్లు ప్రవేశించి ఫోన్లోని సమాచారాన్ని హ్యాకర్లకు చేరవేస్తాయి. ఇది కాకుండా, మీ మొబైల్‌లో ఇప్పటికే ఉన్న అప్లికేషన్‌లను లేటెస్ట్ వర్షన్‌కు అప్‌డేట్ చేస్తూ ఉండాలి. అప్పుడే కొత్త రకం సైబర్ ప్రమాదాల బారినపడకుండా ఫోన్‌ను, తద్వారా మన వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..