ఆ క్రెడిట్ నాసాకు సొంతం!

| Edited By:

Jul 24, 2019 | 5:29 AM

50 ఏళ్ళ క్రితం 1969లో అపోలో 11 అంతరిక్ష నౌక ద్వారా మొదటి సారి చంద్రుడి మీదకు అమెరికా వ్యోమగాములను పంపి, సురక్షితంగా తిరిగి వెనక్కి తీసుకురాగలిగింది. దాన్ని పురస్కరించుకొని అసాధ్యమనుకున్న దాన్ని సుగమం చేసినట్లు ఆ దేశ అంతరిక్ష సంస్థ నాసా ట్విటర్ వేదికగా వెల్లడించింది. ‘50 సంవత్సరాల క్రితం చంద్రుడి మీద కాలుమోపి, తాము అసాధ్యం అనుకున్న ఆలోచనను సాకారం చేసి, అపోలో 11లో తిరిగి భూగ్రహం మీదకు వ్యోమగాములు పయనమయ్యారు. చంద్రుడి మీద […]

ఆ క్రెడిట్ నాసాకు సొంతం!
Follow us on

50 ఏళ్ళ క్రితం 1969లో అపోలో 11 అంతరిక్ష నౌక ద్వారా మొదటి సారి చంద్రుడి మీదకు అమెరికా వ్యోమగాములను పంపి, సురక్షితంగా తిరిగి వెనక్కి తీసుకురాగలిగింది. దాన్ని పురస్కరించుకొని అసాధ్యమనుకున్న దాన్ని సుగమం చేసినట్లు ఆ దేశ అంతరిక్ష సంస్థ నాసా ట్విటర్ వేదికగా వెల్లడించింది. ‘50 సంవత్సరాల క్రితం చంద్రుడి మీద కాలుమోపి, తాము అసాధ్యం అనుకున్న ఆలోచనను సాకారం చేసి, అపోలో 11లో తిరిగి భూగ్రహం మీదకు వ్యోమగాములు పయనమయ్యారు. చంద్రుడి మీద మానవాళి మొదటి సారి అడుగుపెట్టి, తిరిగి వెనక్కి వచ్చింది’ అని పేర్కొంది.

జులై 16న కెన్నడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి సాటర్న్‌ v రాకెట్ ద్వారా అపోలో 11లో ముగ్గురు వ్యోమగాములు నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, మైకెల్ కోలిన్స్‌, ఎడ్విన్‌ ఇ.ఆల్డ్రిన్‌ జూనియర్‌ చంద్రుడి మీదకు పయనమయ్యారు. జులై 20న నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ మొదటి సారి జాబిల్లి మీద కాలుమోపి చరిత్ర సృష్టించారు.