Car Tips: ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద ఆగినప్పుడు ఈ తప్పు చేస్తున్నారా? పెద్ద నష్టమే.. అదేంటో తెలుసా?

Car Tips: ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద రెడ్‌లైట్‌ పడినప్పుడు వాహనాన్ని ఆన్‌లో ఉంచడంలో చేసే చిన్న పొరపాటు మీ జేబుపైనే కాకుండా పర్యావరణంపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతుందని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. ప్రజలు ఒకటి లేదా రెండు నిమిషాలు సిగ్నల్స్‌ వద్ద ఆగినప్పుడు, వారు ఇంజిన్‌ను ఆన్‌లోనే ఉంచుతారు. ఇది అనేక సమస్యలను కలిగిస్తుంది..

Car Tips: ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద ఆగినప్పుడు ఈ తప్పు చేస్తున్నారా? పెద్ద నష్టమే.. అదేంటో తెలుసా?

Updated on: Feb 18, 2025 | 3:43 PM

పెరుగుతున్న కాలుష్యం అందరిని ఆందోళనకు గురి చేస్తుంది. కాలుష్యాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం ‘రెడ్ లైట్ ఆన్-కార్ ఆఫ్’, ‘బేసి-ఈవెన్’ వంటి ప్రచారాలను కూడా నిర్వహిస్తుంది. మీ మద్దతు లభిస్తేనే ప్రభుత్వం చేస్తున్న ప్రచారం విజయవంతమవుతుంది. కానీ ఇప్పటికీ ప్రజలు ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద రెడ్ లైట్ పడినప్పుడు కారును గానీ బైక్‌లను గానీ ఆపేస్తుంటారు. అయితే సిగ్నల్స్‌ వద్ద ఆగినప్పుడు వాహనాల ఇంజిన్‌ ఆన్‌లో ఉంటుంది. ఆఫ్‌ చేయరు. ఎంత సేపు సిగ్నల్స్‌ వద్ద ఆగినా ఇంజిన్ నడుస్తూనే ఉంటుంది. ఇది కాలుష్యాన్ని పెంచడమే కాకుండా అనేక ఇతర రకాల నష్టాలను కూడా కలిగిస్తుంది. ఇది జేబును కూడా ప్రభావితం చేస్తుంది.

సిగ్నల్స్‌ వద్ద ఇంజిన్‌ ఆన్‌లో ఉంటే నష్టం ఏంటి?

కొంతమంది తమ కారును రెడ్‌లైట్‌ వద్ద గేర్‌లో ఉంచుతారు. దీని కోసం వారు క్లచ్‌ను నొక్కి ఉంచాల్సి ఉంటుంది. ఎందుకంటే వారు క్లచ్‌ను గేర్‌లో వదిలేస్తే కారు ఆగిపోతుంది. క్లచ్‌ను అలాగే నొక్కి ఉంచడం వల్ల క్లచ్ ప్లేట్‌పై భారం పడే ప్రమాదం ఉందని, దీని వల్ల క్లచ్ ప్లేట్ దెబ్బతినే అవకాశాలు పెరుగుతాయని టెక్‌ నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఇంధనం వృధా..

ఇలా ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద కారు ఆగినప్పుడు ఇంజిన్‌ ఆన్‌లో ఉంటే ఇంధనం వృధా కావడం లేదా క్లచ్ ప్లేట్‌లో లోపం వల్ల మీకు ఆర్థిక నష్టం జరగవచ్చు. అంతేకాకుండా, పెరిగిన ఇంధన వినియోగం కూడా మైలేజీని ప్రభావితం చేస్తుంది. ట్రాఫిక్ లైట్లలో ఇంజిన్‌ను నడుపుతూ ఉండటం వల్ల కలిగే అతిపెద్ద ప్రతికూలత ఏమిటంటే, మీ వాహనం ఇంధనాన్ని మండిస్తూనే ఉంటుంది. ఇది మొత్తం ఇంధన వృధాకు దారితీస్తుంది. రెండవ ప్రతికూలత ఏమిటంటే, ఇంజిన్ నడుస్తుంటే, వాహనం నుండి వెలువడే పొగలోని హానికరమైన వాయువులు వాయు కాలుష్యాన్ని పెంచుతాయి.
రెడ్‌లైట్‌ వెలిగినప్పుడు ఇంజిన్ ఆఫ్ చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి? ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద రెడ్ లైట్ ఉన్నప్పుడల్లా ఇంజిన్ ఆఫ్ చేయడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే ఇంధనం ఆదా అవుతుంది. అంటే దీని వల్ల డబ్బు ఆదా అవుతుంది. మీరు డబ్బు ఆదా చేయడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణకు దోహదపడవచ్చు.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి