ప్రభుత్వ టెలికాం కంపెనీ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) కొత్త ప్లాన్‌పై కసరత్తు చేస్తోంది. ఈ కొత్త పథకం కింద బీఎస్‌ఎన్‌ఎల్ దేశంలోని ప్రతి గ్రామాన్ని హై-స్పీడ్ ఇంటర్నెట్‌తో అనుసంధానిస్తుంది. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. బీఎస్‌ఎన్‌ఎల్ 4G ప్రోగ్రామ్‌పై పని చేస్తోందని, దీనిలో హై స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ లేని ప్రతి గ్రామానికి ఏడాదిలోపు అందించనున్నట్లు టెలికాం సెక్రటరీ కె రాజారామన్ తెలిపారు. బీఎస్‌ఎన్‌ఎల్ తన మౌలిక సదుపాయాల కోసం అనేక కాంట్రాక్టులను ఇచ్చిందని రాజారామన్ ఒక కార్యక్రమంలో చెప్పారు. అయితే కంపెనీ యాక్టివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం ఒప్పందాలను ఖరారు చేసే ప్రక్రియలో ఉంది. డిజిటల్ వివక్షను తొలగించడానికి భారతదేశం అనేక చర్యలు తీసుకుందని, 2040 నాటికి భారతదేశంలో 100% డిజిటల్ చెల్లింపుల సౌకర్యం ఉంటుందని టెలికాం సహాయ మంత్రి దేవుసింగ్ చౌహాన్ అన్నారు.
2017లో డిజిటల్ లావాదేవీలు జరుపుతున్న భారతీయుల సంఖ్య చైనా జనాభాలో సగానికి సమానమని చౌహాన్ ఒక కార్యక్రమంలో చెప్పారు. కానీ 2021 డేటా ప్రకారం.. భారతదేశంలో డిజిటల్ లావాదేవీల సంఖ్య చైనా కంటే రెండింతలు. 4G నెట్‌వర్క్ విస్తరణ ప్రణాళికలో భారత్ నెట్ ప్రోగ్రామ్ కూడా సహాయపడుతుంది. ఈ కార్యక్రమం కింద గ్రామీణ ప్రాంతాల్లో ఆప్టిక్ ఫైబర్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
భారత్ నెట్ కార్యక్రమం సాయంతో 1.9 లక్షల గ్రామాలకు చేరుకుందని రాజారామన్ తెలిపారు. వచ్చే ఏడాది మధ్య నాటికి 2.2 లక్షల గ్రామాలకు చేరుకోవాలన్నది లక్ష్యం. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (DoT) భారతదేశంలోని మొత్తం ఆరు లక్షల గ్రామాలకు భారత్ నెట్ నెట్‌వర్క్‌ను విస్తరించే ప్రణాళికపై కూడా పని చేస్తోంది. ప్రభుత్వం 600 బ్లాక్‌లలో పైలట్ ప్రాజెక్ట్‌ను నిర్వహిస్తోంది. ఇందులో వారు సబ్సిడీ ధరతో 30,000 కుటుంబాలకు భారత్ నెట్ కింద ఫైబర్ కనెక్షన్‌లను అందిస్తారు.
అదే సమయంలో దేశంలో 5G సేవలను అందించడానికి టెలికాం ఆపరేటర్లు ప్రతి వారం సుమారు 2,500 బేస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారని కేంద్ర మంత్రి దేవ్‌సింగ్ చౌహాన్ తెలిపారు. నవంబర్ 26 వరకు 20,980 మొబైల్ బేస్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి రాజ్యసభకు తెలిపారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి