AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BSNL Prepaid Plans: బీఎస్ఎన్ఎల్ నుంచి మరో రెండు కొత్త ప్లాన్లు.. ప్రత్యేకంగా డేటా కోసమే.. వివరాలు ఇవి..

గ్రామీణ భారతంలో బీఎస్ఎన్ఎల్ కు ఉన్న పట్టును మరింత బలోపేతం చేసుకునేందుకు తాపత్రయ పడుతోంది. ఈ క్రమంలోనే అనేక కొత్త ప్లాన్లను ప్రవేశపెడుతోంది. అతి తక్కువ ధరలోనే మంచి బెనిఫిట్స్ తో కూడిన ప్రీ పెయిడ్ ప్లాన్లను అందిస్తోంది. ఇటీవల తన కస్టమర్ల కోసం రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను తీసుకొచ్చింది. ఈ రెండు ప్లాన్‌లు రూ. 91, రూ. 288కి వస్తాయి. రెండు ప్లాన్‌లు ప్రీపెయిడ్ డేటా వోచర్‌లే..

BSNL Prepaid Plans: బీఎస్ఎన్ఎల్ నుంచి మరో రెండు కొత్త ప్లాన్లు.. ప్రత్యేకంగా డేటా కోసమే.. వివరాలు ఇవి..
BSNL
Madhu
|

Updated on: Jan 15, 2024 | 8:03 AM

Share

భారత ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) ప్రైవేటు టెలికాం సంస్థలతో పోటీని తట్టుకొని నిలబడేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. గ్రామీణ భారతంలో బీఎస్ఎన్ఎల్ కు ఉన్న పట్టును మరింత బలోపేతం చేసుకునేందుకు తాపత్రయ పడుతోంది. ఈ క్రమంలోనే అనేక కొత్త ప్లాన్లను ప్రవేశపెడుతోంది. అతి తక్కువ ధరలోనే మంచి బెనిఫిట్స్ తో కూడిన ప్రీ పెయిడ్ ప్లాన్లను అందిస్తోంది. ఇటీవల తన కస్టమర్ల కోసం రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను తీసుకొచ్చింది. ఈ రెండు ప్లాన్‌లు రూ. 91, రూ. 288కి వస్తాయి. రెండు ప్లాన్‌లు ప్రీపెయిడ్ డేటా వోచర్‌లు. అంటే అవి సర్వీస్ చెల్లుబాటుతో రావు, డేటా ప్రయోజనాలను మాత్రమే అందిస్తాయి. అంతేకాక ఈ రెండు ప్లాన్‌లు భారతదేశం అంతటా అందుబాటులో లేవు. ప్రస్తుతానికి చెన్నై సర్కిల్‌లో నివసిస్తున్న వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే ఆయా సర్కిళ్లలో ఉన్న పరిస్థితిని బట్టి కస్టమర్ల డిమాండ్లను బట్టి ప్లాన్లను తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రూ. 91, రూ.288 డేటా వోచర్లలో అందించే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

బీఎస్ఎన్ఎల్ రూ. 91 ప్లాన్..

బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న కొత్త ప్రీ పెయిడ్ ప్లాన్ ధర రూ. 91. ఇది ఏడు రోజుల సర్వీస్ వ్యాలిడిటీతో మాత్రమే వస్తుంది. ఇది వినియోగదారులకు 600ఎంబీ డేటాతో పాటు 700ఎస్ఎంఎస్ లను అందిస్తుంది. కస్టమర్‌లకు బండిల్‌ చేసిన ఇతర ప్రయోజనాలేవీ లేవు. ఈ ప్లాన్‌ని ఉపయోగించడానికి మీరు బేస్ ప్రీపెయిడ్ ప్లాన్ యాక్టివ్ చేసుకొని ఉండాలి. రూ. 91 ప్లాన్ ఎక్కువ డేటాను కోరుకునే వినియోగదారులకు ఉపయోగపడదు. అయితే ఇది ప్రధానంగా ఎస్ఎంఎస్ ప్రయోజనాలతో పాటు కొద్ది పాటి డేటాను వినియోగించే వారికి ఉపయుక్తంగా ఉంటుంది. అధిక డేటా వినియోగం అవసరం ఉన్న వారు దీనిని వదిలేయొచ్చు.

బీఎస్ఎన్ఎల్ రూ. 288 ప్లాన్..

బీఎస్ఎన్ఎల్ రూ. 288 ప్రీ పెయిడ్ ప్లాన్ 60 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్యాక్ లో ప్రతి రోజూ 2జీబీ డేటా వస్తుంది. 2జీబీ ఎఫ్యూపీ(ఫెయిర్ యూసేజ్ పాలసీ) డేటా వినియోగం తర్వాత అ ప్లాన్ అందించే డేటా వేగం 40 కేబీపీఎస్ కు తగ్గుతుంది. ఎఫ్ యూపీ డేటా పరిమితి ప్రతి రోజూ మీకు రిఫ్రెస్ అవుతుంది. నిర్ణీత టైం పీరియడ్ లో రోజు ముగుస్తుందని ఆ రోజు డేటా ముగిసిపోయి, కొత్తగా మళ్లీ డేటా రీసెట్ అవుతుంది. ఇది డేటా ఎక్కువగా వినియోగించే వారికి చాలా ఉపయుక్తంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
యాపిల్‌ ఫోన్‌ మినీ సిరీస్‌పై షాకింగ్ నిర్ణయం
యాపిల్‌ ఫోన్‌ మినీ సిరీస్‌పై షాకింగ్ నిర్ణయం
8 గంటలు నిద్రపోయినా ఉదయాన్నే అలసటగా ఉంటుందా? కారణం ఇదే..!
8 గంటలు నిద్రపోయినా ఉదయాన్నే అలసటగా ఉంటుందా? కారణం ఇదే..!
హైసెన్స్‌ ఏ10, ఏ10 అల్ట్రా ఫోన్‌ డిస్‌ప్లే గురించి తెలుసా
హైసెన్స్‌ ఏ10, ఏ10 అల్ట్రా ఫోన్‌ డిస్‌ప్లే గురించి తెలుసా
పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టపడే హెల్తీ ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్
పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టపడే హెల్తీ ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్
కేవలం సినిమా స్నాక్ మాత్రమే కాదు.. పాప్‌కార్న్‌తో ఈ లాభాలు తెల్సా
కేవలం సినిమా స్నాక్ మాత్రమే కాదు.. పాప్‌కార్న్‌తో ఈ లాభాలు తెల్సా
ఎలుక తోక ఎందుకు పొడవు ఉంటుంది? దీంతో ఏమైనా ఉపయోగం ఉంటుందా?
ఎలుక తోక ఎందుకు పొడవు ఉంటుంది? దీంతో ఏమైనా ఉపయోగం ఉంటుందా?
నోట్లో వేస్తే కరిగిపోయేలా డబల్ కా మీఠా.. పక్కా కొలతలతో ఇలా చేయండి
నోట్లో వేస్తే కరిగిపోయేలా డబల్ కా మీఠా.. పక్కా కొలతలతో ఇలా చేయండి
ఒక వ్యక్తి పేరుపై రెండు గ్యాస్ కనెక్షన్లు తీసుకోవచ్చా..?
ఒక వ్యక్తి పేరుపై రెండు గ్యాస్ కనెక్షన్లు తీసుకోవచ్చా..?
ఈ యాప్స్‌ ఉంటే గూగుల్ మ్యాప్స్ అక్కర్లేదు
ఈ యాప్స్‌ ఉంటే గూగుల్ మ్యాప్స్ అక్కర్లేదు
జబర్దస్త్‌లోకి ఆ స్టార్ కమెడియన్ల రీఎంట్రీ.. రష్మీ ఎమోషనల్
జబర్దస్త్‌లోకి ఆ స్టార్ కమెడియన్ల రీఎంట్రీ.. రష్మీ ఎమోషనల్