Infinix Smart TV: చవకైన ధరకే 4కే క్యూఎల్ఈడీ టీవీ.. అత్యాధునిక ఫీచర్లు, అద్భుతమైన పనితీరు..

|

Jul 12, 2023 | 10:40 AM

ఈ టీవీల్లో మరో అత్యాధునిక ఫీచర్ ఉంది. అదే హోమ్ డ్యాష్‌బోర్డ్ ఫీచర్. దీని ద్వారా ఇంట్లో ఉన్న స్మార్ట్ పరికరాలను నేరుగా ఆపరేట్ చేయవచ్చు. ఇది అన్ని డివైజ్లకు సెంట్రల్ హబ్‌గా పనిచేస్తుంది. సెట్టింగ్‌లను మార్చుకోడానికి, పరికర స్థితిని పర్యవేక్షించడానికి ఉపయోగపడుతుంది.

Infinix Smart TV: చవకైన ధరకే 4కే క్యూఎల్ఈడీ టీవీ.. అత్యాధునిక ఫీచర్లు, అద్భుతమైన పనితీరు..
Infinix W1 43 Inch 4k Qled Tv
Follow us on

లేటెస్ట్‌ ట్రెండీ ఐటెం స్మార్ట్‌ టీవీ. ఓటీటీల రంగ ప్రవేశంతో ఇంట్లో స్మార్ట్‌, ఆండ్రాయిడ్‌ టీవీలకు డిమాండ్‌ బాగా పెరిగింది. థియేటర్‌ అనుభవం కోసం అందరూ పెద్ద స్క్రీన్‌ ఉన్న టీవీలను కొనుగోలు చేస్తున్నారు. నచ్చిన యాప్‌ లను డౌన్‌ లోడ్‌ చేసుకొని నచ్చిన సమయంలో సీరియళ్లు కావాలంటే సీరియళ్లు, సినిమాలు కావాలంటే సినిమాలు చూస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇటీవల కాలంలో వస్తున్న టీవీల అన్ని కూడా ఆండ్రాయిడ్‌ సపోర్టుతో కూడిన స్మార్ట్‌ టీవీలే కావడంతో వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో అన్ని ప్రముఖ కంపెనీలు తమ ఉత్పత్తులను లాంచ్‌ చేస్తున్నాయి. తక్కువ ధరలో, ఉత్తమ ఫీచర్లను అందిస్తున్నాయి. ఈ క్రమంలో ఇన్‌ఫినిక్స్‌ కంపెనీ అనువైన బడ్జెట్లో రెండు స్మార్ట్‌ టీవీలను మార్కెట్లోకి విడుదల చేసింది. డబ్ల్యూ1 సిరీస్‌ పేరిట 32 అంగుళాల హెచ్‌డీ రెడీ, 43 అంగుళాల 4కే క్యూఎల్‌ఈడీ మోడల్‌ టీవీలను లాంచ్‌ చేసింది. ఇవి వెబ్ఓఎస్‌ ఆధారంగా పనిచేస్తాయి. వీటిలో రియల్‌ లైఫ్‌ విజువల్స్‌లా పిక్చర్‌ కనిపించడం కోసం క్వాంటం డాట్‌ లేయర్స్‌ను వినియోగించారు. 4కే మోడల్ టీవీలో ఎయిర్ మౌస్, వీల్ కంట్రోల్, యూనివర్సల్ కంట్రోల్ తో కూడిన మ్యాజిక్ రిమోట్ ఉంటుంది. ఇది వినియోగదారులకు సౌకర్యవంతమైన, వేగవంతమైన పనితీరును కనబరుస్తుంది. అలాగే హెచ్ డీ రెడీ మోడల్ టీవీకి ప్రామాణిక ఐఆర్ రిమోట్ వస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఇన్‌ఫినిక్స్‌ డబ్ల్యూ1 క్యూఎల్‌ఈడీ టీవీ ఫీచర్లు..

32-అంగుళాల హెచ్‌డీ రెడీ టీవీలో 1366 x 768 పిక్సెల్స్‌తో కూడిన క్యూఎల్‌ఈడీ డిస్‌ప్లే ఉంటుంది. 90%ఎన్టీఎస్సీ వైడ్ కలర్ గామట్, గేమ్ డ్యాష్‌బోర్డ్ ఆప్టిమైజేషన్ ఉంటుంది.అలాగే 43-అంగుళాల 4కే క్యూఎల్‌ఈడీ టీవీలో 3840 x 2160 పిక్సెల్స్‌తో కూడిన డిస్‌ప్లే ఉంటుంది. 94% డీసీఐ-పీ3 వైడ్ కలర్ గామట్ (+/-5%), గేమ్ డ్యాష్‌బోర్డ్ ఆప్టిమైజేషన్, హెచ్‌డీఆర్‌ 10, ఎంఈఎంసీ టెక్నాలజీతో ఈ టీవీ పనిచేస్తుంది. రెండింటిలోనూ ఐఎంజీ బీఎక్స్‌ఈ4 జీపీయూ, 700 మెగాహెర్జ్‌ క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్‌ ఉంటుంది. 1జీబీ ర్యామ్‌, 8జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఉంటుంది. వెబ్‌ ఓఎస్‌ ద్వారా నెట్‌ ఫ్లిక్స్‌, ప్రైమ్‌ వీడియో, డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌, యూట్యూబ్‌ వంటి యాప్‌లను సపోర్టు చేస్తుంది. అలాగే యాపిల్‌ హోమ్‌ ద్వారా యాపిల్‌ ఎయిర్‌ప్లే పనిచేస్తుంది. 4కే మోడల్లో మ్యాజిక్‌ రిపోట్‌ వస్తుంది. దీని ద్వారా వాయస్‌, గెస్చర్‌ ద్వారా టీవీని కంట్రోల్‌ చేయొచ్చు. ఇక కనెక్టివిటీ ఫీచర్ల విషయానికి వస్తే డ్యూయల్‌ బ్యాండ్‌ వైఫై 802.11 ఏసీ, 3ఎక్స్‌ హెచ్‌డీఎంఐ(ఏఆర్‌సీ సపోర్టు) ఈఎక్స్‌ యూఎస్బీ పోర్ట్స్‌, ఒక ఆర్‌ఎఫ్‌ ఇన్‌పుట్‌, ఒక ఏవీ ఇన్‌పుట్‌, ఒక హెడ్‌ఫోన్‌ జాక్‌, ల్యాన్‌ ఉంటాయి. 20 వాట్ల సామర్థ్యంతో రెండు స్పీకర్లు ఉంటాయి. డాల్డీ ఆడియోతో హై క్వాలిటీ సౌండ్ అవుట్ పుట్ వస్తుంది.

ఇంట్లో వస్తువులను టీవీ నుంచి ఆపరేట్ చేయొచ్చు..

ఈ టీవీల్లో మరో అత్యాధునిక ఫీచర్ ఉంది. అదే హోమ్ డ్యాష్‌బోర్డ్ ఫీచర్. దీని ద్వారా ఇంట్లో ఉన్న స్మార్ట్ పరికరాలను నేరుగా ఆపరేట్ చేయవచ్చు. ఇది అన్ని డివైజ్లకు సెంట్రల్ హబ్‌గా పనిచేస్తుంది. సెట్టింగ్‌లను మార్చుకోడానికి, పరికర స్థితిని పర్యవేక్షించడానికి ఉపయోగపడుతుంది. స్మార్ట్ లైట్లు, థర్మోస్టాట్‌లు, సీసీ కెమెరాల వంటి అనుకూల స్మార్ట్ పరికరాలను దీని ద్వారా నియంత్రించవచ్చు.

ఇవి కూడా చదవండి

ఇన్ ఫినిక్స్ డబ్ల్యూ1 స్మార్ట్ టీవీల ధర, లభ్యత..

ఇన్ఫినిక్స్ డబ్ల్యూ1 క్యూఎల్ఈడీ 32 అంగుళాల హెచ్ డీ రెడీ టీవీ ధర రూ. 10,999 కాగా.. 43 అంగుళాల 4కే మోడల్ టీవీ ధర రూ. 20,999గా ఉంది. ఈ టీవీలు ఆగస్టు రెండో తేదీ నుంచి ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫారం ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంటుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..