Feature phones: రూ. వెయ్యిలోపు బెస్ట్‌ ఫీచర్‌ ఫోన్స్‌.. ఫీచర్స్‌ కూడా అదుర్స్

|

Oct 11, 2024 | 8:30 AM

ఓవైపు స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం ఓ రేంజ్‌లో పెరిగిపోతోంది. అదే విధంగా ఫీచర్‌ ఫోన్‌లకు సైతం ఆదరణ లభిస్తోంది. స్మార్ట్ ఫోన్‌ వినియోగం తగ్గించాలనో, మరే కారణమో కానీ ఫీచర్‌ ఫోన్‌లను కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రస్తుతం అమెజాన్‌లో ఇలాంటి ఫీచర్‌ ఫోన్‌లపై లభిస్తోన్న ఆఫర్స్‌పై ఓ లుక్కేయండి....

Feature phones: రూ. వెయ్యిలోపు బెస్ట్‌ ఫీచర్‌ ఫోన్స్‌.. ఫీచర్స్‌ కూడా అదుర్స్
Feature Phones
Follow us on

ఓవైపు స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం ఓ రేంజ్‌లో పెరిగిపోతోంది. అదే విధంగా ఫీచర్‌ ఫోన్‌లకు సైతం ఆదరణ లభిస్తోంది. స్మార్ట్ ఫోన్‌ వినియోగం తగ్గించాలనో, మరే కారణమో కానీ ఫీచర్‌ ఫోన్‌లను కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రస్తుతం అమెజాన్‌లో ఇలాంటి ఫీచర్‌ ఫోన్‌లపై లభిస్తోన్న ఆఫర్స్‌పై ఓ లుక్కేయండి..

itel it5027: ఈ ఫోన్‌ అసలు ధర రూ. 1599కాగా ప్రస్తుతం అమెజాన్‌లో 34 శాతం డిస్కౌంట్‌తో రూ. 1049కి లభిస్తోంది. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 2.4 ఇంచెస్‌తో కూడి డిస్‌ప్లేను, కీప్యాడ్‌ను అదించారు. అలాగే ఇందులో 1200 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని ఇచ్చారు. న్యూక్లస్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. మీడియాటెక్‌ హీలియో ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 4జీబీ స్టోరేజీని అందించారు.

Nokia All-New 105: నోకియా కంపెనీకి చెందిన ఈ ఫీచర్‌ ఫోన్‌ అసలు ధర రూ. 1599కాగా అమెజాన్‌ 25 శాతం సేల్‌లో భాగంగా రూ. 1198కి సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌లో ఇన్‌బిల్ట్‌గా యూపీఐ పేమెంట్స్‌ ఆప్షన్‌ను ఇచ్చారు. వైర్‌లెస్‌ ఎఫ్‌ఎమ్‌ రేడియా ఆప్షన్‌ను అందించారు. ఈ ఫోన్‌లో 4 జీబీ ర్యామ్‌ను అందించారు. కోర్టెక్స్‌ ఏ7 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 32 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ను ఇచ్చారు.

Motorola All-New A10: ఈ ఫీచర్‌ ఫోన్‌ అసలు ధర రూ. 1549కాగా 25 శాతం డిస్కౌంట్‌తో రూ. 1159కి సొంతం చేసుకోవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే డ్యూయల్ సిమ్‌ కీప్యాడ్‌ను ఇచ్చారు. లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ బ్యాకప్‌ను అందించారు. వైర్‌లెస్‌ ఎఫ్‌ఎమ్‌ విత్ రికార్డింగ్‌ ఆప్షన్‌ను ఇచ్చారు. బ్లూటూత్‌ కనెక్టివిటీ, ఆటోకాలింగ్ వంటి ఫీచర్లను అందించారు.

Lava A7 Torch Keypad: ఈ ఫీచర్‌ ఫోన్‌ అసలు ధర రూ. 1899కాగా 27 శాతం డిస్కౌంట్‌తో రూ. 1379కి సొంతం చేసుకోవచ్చు. పవర్‌ఫుల్ లౌడ్‌, క్లీనర్‌ స్పీకర్‌ను ఇచ్చారు. 2575 ఎమ్‌ఏహెచ్‌ బిగ్ బ్యాటరీని ఇచ్చారు. 2.4 ఇంచెస్‌తో కూడిన బిగ్‌ డిస్‌ప్లేను ఇచ్చారు. వైబ్రేషన్‌ అలర్ట్‌, బ్లూటూత్ వంటి ఫీచర్లను అందించారు.

HMD 105 Keypad: హెచ్‌ఎండీ కంపెనీకి చెందిన ఈ ఫీచర్‌ ఫోన్ అసలు రూ. 1499 కాగా, అమెజాన్‌ సేల్‌లో 33 శాతం డిస్కౌంట్‌తో ఈ ఫోన్‌ను రూ. 999కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌లో బిల్ట్‌ఇన్‌ యూపీఐ యాప్‌ను అందించారు. ఫోన్‌ టాకర్‌, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీని అందించారు. ఎస్‌30+ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఎమ్‌పీ3 ప్లేయర్‌, వైర్‌లెస్‌ ఎఫ్‌ఎమ్‌ రేడియోను ఇచ్చారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..