తక్కువ ధరలో అదిరిపోయే పవర్ బ్యాంకులు కావాలా? వీటి గురించి తెలుసుకోవాల్సిందే
Power Banks.. స్మార్ట్‌ఫోన్‌లు మాత్రమే కాకుండా ఇతర గాడ్జెట్‌లను నిరంతరం ఛార్జ్ చేయడానికి శక్తివంతమైన బ్యాటరీలు ఎంతో అవసరం. తక్కువ ధరలో ఎక్కువ కెపాసిటీ అందించే డివైజ్‌ల కోసం వెతుకుతున్న వారికి మార్కెట్లో అద్భుతమైన ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా వివిధ ప్రముఖ బ్రాండ్లు సరికొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చాయి.

ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ అందించే పవర్ బ్యాంకులు ఇప్పుడు సామాన్యులకు కూడా అందుబాటు ధరల్లో లభిస్తున్నాయి. ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఫోన్లు స్విచ్ ఆఫ్ కాకుండా ఉండేందుకు ఈ పోర్టబుల్ ఛార్జర్లు ఎంతగానో ఉపయోగపడతాయి. తక్కువ బడ్జెట్లో అత్యుత్తమ ఫీచర్లు కలిగిన ఈ డివైజ్‌లు టెక్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
మార్కెట్లో రూ. 1,500 లోపు ధరలో లభించే పవర్ బ్యాంకులు 10,000 ఎంఏహెచ్ నుండి 20,000 ఎంఏహెచ్ వరకు బ్యాటరీ సామర్థ్యాన్ని అందిస్తున్నాయి. అర్బన్, క్రాటోస్, పోర్ట్రానిక్స్, ఫిలిప్స్, అగారో, బోట్, షావోమి వంటి ప్రముఖ బ్రాండ్లు ఈ విభాగంలో వివిధ రకాల మోడళ్లను విక్రయిస్తున్నాయి. 22.5 వాట్ల నుంచి 35 వాట్ల వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుండటం విశేషం.
బిల్ట్-ఇన్ కేబుల్స్
కొన్ని పవర్ బ్యాంకులు ప్రత్యేకంగా బిల్ట్-ఇన్ కేబుల్స్‌తో వస్తుండటంతో విడిగా వైర్లు మోసుకెళ్లాల్సిన అవసరం తప్పుతుంది. ఏకకాలంలో రెండు లేదా మూడు పరికరాలను ఛార్జ్ చేసుకునే వెసులుబాటు ఉండటం వల్ల ప్రయాణాలు చేసే వారికి ఈ డివైజ్‌లు ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయి. డిజిటల్ ఎల్ఈడీ డిస్‌ప్లేల ద్వారా బ్యాటరీ ఎంత మిగిలి ఉందనే విషయాన్ని సులభంగా తెలుసుకోవచ్చు.
గమనించాల్సిన అంశాలు
అవసరాలను బట్టి 10,000 ఎంఏహెచ్ లేదా 20,000 ఎంఏహెచ్ సామర్థ్యం గల మోడళ్లను ఎంచుకోవాలి. ఏకకాలంలో ఎన్ని పరికరాలను ఛార్జ్ చేయాలనుకుంటున్నారో దానిని బట్టి అవుట్‌పుట్ పోర్ట్‌లను పరిశీలించాలి. కనెక్ట్ చేసిన పరికరం కూడా తగినంత ఛార్జింగ్ స్పీడ్‌ను సపోర్ట్ చేస్తేనే గరిష్ట వేగం లభిస్తుంది.
