AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AI tools: ఈ ఏఐ టూల్స్‌తో రెజ్యూమె చేస్తే.. జాబ్ పక్కా!

మెరుగైన ఉద్యోగావకాశాలు పొందాలంటే ముందుగా కావాల్సింది అట్రాక్టివ్ రెజ్యూమె. అభ్యర్థుల ప్రొఫైల్ ఎంత అట్రాక్టివ్‌గా ఉంటే అన్ని ఎక్కువ అవకాశాలు పొందేందుకు వీలుంటుంది. అయితే రెజ్యూమెని అట్రాక్టివ్‌గా క్రియేట్ చేసేందకు పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. దానికోసం బోలెడు ఏఐ టూల్స్ రెడీగా ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేద్దామా..

AI tools: ఈ ఏఐ టూల్స్‌తో రెజ్యూమె చేస్తే.. జాబ్ పక్కా!
Ai Tools For Resume
Nikhil
|

Updated on: Oct 03, 2025 | 5:53 PM

Share

ఒక ఉద్యోగానికి వందల కొద్దీ అప్లికేషన్లు వస్తాయి. కానీ, అందులో మొదటి దశ ఫిల్టరేషన్ జరిగేది  రెజ్యూమె దగ్గరే. ప్రొఫెషనల్ రెజ్యూమె ఉన్నవాళ్లు ముందుగా ఇంటర్వ్యూ కాల్‌కి సెలక్ట్ అవుతారు. రెజ్యుమెలో ఉద్యోగానికి కావల్సిన బేసిక్ డీటెయిల్స్ తో పాటు రెజ్యూమె చూడ్డానికి కూడా చాలా అట్రాక్టివ్ గా కనపించాలి. అలాంటి ప్రొఫెషనల్ రెజ్యూమెని చిటికెలో రెడీ చేయడం కొన్ని ఏఐ టూల్స్ అందుబాటులో ఉన్నాయి.  వాటిలో కొన్ని బెస్ట్ టూల్స్ ఇవీ..

రెజ్యూమేకర్‌.ఏఐ

‘రెజ్యూమేకర్ డాట్ ఏఐ (resumaker.ai)’ అనే వెబ్‌సైట్‌ సాయంతో రకరకాల ప్రొఫెషనల్ టెంప్లేట్స్‌లో మీ రెజ్యూమెని క్రియేట్ చేసుకోవచ్చు. ఇందులో డేటా ఎన్‌క్రిప్షన్‌ ఫీచర్ కూడా ఉంటుంది. అంటే రెజ్యూమె కోసం మీరిచ్చే డేటా ఇతరుల చేతుల్లోకి వెళ్లకుండా సేఫ్‌గా ఉంటుంది.

రెజ్యూమె.ఐవో

‘రెజ్యూమె డాట్ ఐవో(resume.io)’ అనేది పాపులర్ ఏఐ రెజ్యూమె టూల్. ఇందులో బోలెడన్ని ప్రొఫెషనల్ టెంప్లేట్స్‌తో పాటు కవర్‌ లెటర్లు కూడా ఉంటాయి.  రెజ్యూమెలో స్పెల్లింగ్‌ చెక్‌, గ్రామర్ చెక్ వంటివి కూడా సరిచూసుకోవచ్చు.

కాన్వా

‘కాన్వా(canva.com)’ అనేది గ్రాఫిక్ డిజైనింగ్ ప్లాట్‌ఫామ్. అయితే ఇందులోని రెజ్యూమె మేకర్‌ టూల్ సాయంతో అందమైన రెజ్యూమెను డిజైన్ చేసుకోవచ్చు. కంటెంట్‌తో పాటు రెజ్యూమె డిజైన్ కూడా క్రియేటివ్‌గా ఉండాలనుకుంటే ఈ టూల్ ట్రై చేయొచ్చు. ఇందులో ఫాంట్‌, లేఅవుట్‌, గ్రాఫిక్స్.. ఇలా రకరకాల టూల్స్‌తో రెజ్యూమెను డిజైన్ చేయొచ్చు.

రెజీ

‘రెజీ డాట్ ఏఐ(rezi.ai)’ అనేది ‘ఓపెన్‌ ఏఐ’ జీపీటీ సపోర్ట్‌తో పనిచేస్తుంది. మీ ఎడ్యుకేషన్ వివరాలు, జాబ్ ప్రొఫైల్ నేమ్.. ఇలా బేసిక్ వివరాలు అందజేస్తే.. నిమిషంలో ప్రొఫెషనల్ రెజ్యూమె రెడీ చేస్తుంది. అలాగే ఇందులో రకరకాల టెంప్లేట్స్, ప్రీ కంపోజ్డ్ సెంటెన్స్‌లు అందుబాటులో ఉంటాయి.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

రోజూ ఓ గ్లాస్‌ రెడ్‌ వైన్‌ తాగితే గుండె ఆరోగ్యానికి మంచిదా?
రోజూ ఓ గ్లాస్‌ రెడ్‌ వైన్‌ తాగితే గుండె ఆరోగ్యానికి మంచిదా?
బెస్ట్‌ స్కీమ్‌- ప్రతిరోజూ రూ.333 ఆదా చేస్తే చేతికి రూ.17 లక్షలు!
బెస్ట్‌ స్కీమ్‌- ప్రతిరోజూ రూ.333 ఆదా చేస్తే చేతికి రూ.17 లక్షలు!
రాయల్ లుక్‌లో యంగ్‌ బ్యూటీ సారా అర్జున్‌.. మతిపోగొట్టేలా ఫోజులు!
రాయల్ లుక్‌లో యంగ్‌ బ్యూటీ సారా అర్జున్‌.. మతిపోగొట్టేలా ఫోజులు!
చీకట్లో మగ్గుతున్న గిరి పుత్రుల జీవితాల్లో వెలుగులు..!
చీకట్లో మగ్గుతున్న గిరి పుత్రుల జీవితాల్లో వెలుగులు..!
కుంభ రాశిలో త్రిగ్రాహి రాజయోగం.. వీరికి పట్టిందల్లా బంగారమే!
కుంభ రాశిలో త్రిగ్రాహి రాజయోగం.. వీరికి పట్టిందల్లా బంగారమే!
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టాలీవుడ్ యంగ్ హీరో
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టాలీవుడ్ యంగ్ హీరో
నోట్లో వేయగానే కరిగిపోతుంది.. తందూరి చికెన్ ఇంట్లో ఇలా చేయండి!
నోట్లో వేయగానే కరిగిపోతుంది.. తందూరి చికెన్ ఇంట్లో ఇలా చేయండి!
ఒక్కసారి ఛార్జింగ్‌తో 110 కి.మీ రేంజ్‌.. ధర ఎంతో తెలుసా?
ఒక్కసారి ఛార్జింగ్‌తో 110 కి.మీ రేంజ్‌.. ధర ఎంతో తెలుసా?
రాజయోగం పట్టనుంది.. రాసిపెట్టుకోండి ఫిబ్రవరిలో ధనవంతులు వీరే
రాజయోగం పట్టనుంది.. రాసిపెట్టుకోండి ఫిబ్రవరిలో ధనవంతులు వీరే
ప్రేమంటే ఇదేరా.. రెండు హృదాయాలను కలిపే అద్భుతమైన కానుక..
ప్రేమంటే ఇదేరా.. రెండు హృదాయాలను కలిపే అద్భుతమైన కానుక..