AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eco Bandage: ఇకపై గాయం చల్లనైనది.. పండ్ల వ్యర్ధాల నుంచి యాంటీ బాక్టీరియల్ బ్యాండేజ్..

పండ్ల వ్యర్థాల నుండి యాంటీ బాక్టీరియల్ బ్యాండేజ్‌ను సింగపూర్‌లోని శాస్త్రవేత్తలు సిద్ధం చేశారు. ఇది పండు వృధా కాకుండా నిరోధించి, త్వరగా గాయం నయం చేయడంలో సహాయపడుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

Eco Bandage: ఇకపై గాయం చల్లనైనది.. పండ్ల వ్యర్ధాల నుంచి యాంటీ బాక్టీరియల్ బ్యాండేజ్..
Eco Bandage From Fruit Wastage
KVD Varma
|

Updated on: Oct 18, 2021 | 6:29 PM

Share

Eco Bandage : పండ్ల వ్యర్థాల నుండి యాంటీ బాక్టీరియల్ బ్యాండేజ్‌ను సింగపూర్‌లోని శాస్త్రవేత్తలు సిద్ధం చేశారు. ఇది పండు వృధా కాకుండా నిరోధించి, త్వరగా గాయం నయం చేయడంలో సహాయపడుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. సింగపూర్‌లోని నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ పరిశోధకులు దీనిని దురియాన్ పండు అవశేషాల నుండి తయారు చేసినట్లు చెప్పారు. పరిశోధకుడు ప్రొ. విలియం చెన్ చెబుతున్న దాని ప్రకారం, సింగపూర్ ప్రజలు ప్రతి సంవత్సరం 125 మిలియన్ డూరియన్లను తింటారు. ప్రత్యేక విషయం ఏమిటంటే ప్రజలు గుజ్జును మాత్రమే తింటారు. అంటే దురియన్‌లో గుజ్జు భాగం తిన్న తరువాత దాని పై తొక్క, విత్తనాలు పారవేస్తారు. ఇది పర్యావరణంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. కొత్త కట్టును సిద్ధం చేయడం ద్వారా, పర్యావరణాన్ని కూడా రక్షించవచ్చు. అదేవిధంగా గాయాలను నయం చేయడానికి మానవులు కూడా కొత్త ఎంపికను పొందుతారు.

నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ పరిశోధకులు దురియన్ తొక్కను పండును వేరు చేశారు. దీనిని గ్రైండింగ్ చేయడం ద్వారా, సెల్యులోజ్ పౌడర్ తయారు అయింది. తర్వాత ఈ పొడిలో గ్లిసరాల్‌ని జోడించడం ద్వారా దానిని యాంటీ బాక్టీరియల్ స్ట్రిప్స్‌గా మార్చారు. తరువాత దీనిని సన్నని స్ట్రిప్స్‌గా కట్ చేసి పట్టీలుగా తయారు చేశారు.

ఈ పట్టీ రెగ్యులర్ బ్యాండేజీల కంటే మరింత సౌకర్యవంతం..

పరిశోధకులు ఈ బ్యాండేజ్ సాఫ్ట్ హైడ్రోజెల్‌గా కనిపిస్తుందని చెబుతున్నారు. ఇతర గాయం నయం చేసే పట్టీల కంటే ఇది మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. అంతే కాకుండా, గాయాన్ని చల్లగా, తేమగా ఉంచుతుంది, దీని కారణంగా గాయం త్వరగా నయమవుతుంది.

ఇతర పట్టీల కంటే చౌకైనది..

పండ్ల వ్యర్థాల నుండి పట్టీలను తయారు చేయడం ఇతర పట్టీల కంటే చౌక అని పరిశోధకులు అంటున్నారు. అందువల్ల, ఇది రోగులకు మెరుగైన, చౌకైన ఎంపికగా చెప్పవచ్చు అని వారు చెబుతున్నారు.

సింగపూర్‌లో దురియన్ పండ్లను విక్రయించే టాన్ ఇంగ్ చువాన్, దాని సీజన్‌లో దాదాపు 1800 కిలోల పండ్లను విక్రయిస్తున్నట్లు చెప్పారు. సగటున ప్రతిరోజూ 30 పెట్టెలు అమ్ముతారు. వాటిలో ఎక్కువ భాగం వివిధ కారణాల వాళ్ళ బయట పాదేయడం జరుగుతుందని చెప్పారు. ఇలా పారవేసే పండ్లను వివిధ రకాల గాయాలకు చికిత్స చేయడానికి ఉపయోగించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

దురియన్ పండు ఎలా ఉంటుంది?

జాక్ ఫ్రూట్ లాగా కనిపించే దురియన్ పండు దాని ప్రత్యేకమైన రుచి, పోషక విలువలకు ప్రసిద్ధి చెందింది. ఈ పండు ముఖ్యంగా మలేషియా, థాయిలాండ్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌లో కనిపిస్తుంది. దక్షిణ ఆసియాలో దీనిని ‘కింగ్స్ ఆఫ్ ఫ్రూట్స్’ అంటారు. విటమిన్ -సి, ఫోలిక్ యాసిడ్, విటమిన్-బి -6, విటమిన్-ఎ, ఐరన్, కాల్షియం వంటి పోషకాలు ఇందులో లభిస్తాయి.

ఇవి కూడా చదవండి: TATA Punch: భద్రతా ప్రమాణాలలో టాటా మోటార్స్ కార్లు టాప్.. 5 స్టార్ రేటింగ్ తో వస్తున్న టాటా పంచ్!

Pre Install Apps: మీకు తెలుసా? స్మార్ట్‌ఫోన్‌లలో ప్రీ ఇన్‌స్టాల్ యాప్‌లతో మన డాటా చోరీ అయిపోతోంది!

Dera Baba Case: రంజిత్ సింగ్ హత్య కేసులో డేరా సచ్చా సౌదాకు చెందిన గుర్మీత్ రామ్ రహీమ్ సహా నలుగురికి జీవిత ఖైదు!