AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Whatsapp Tips: ఈ పనులు చేస్తే మీ వాట్సాప్ బ్యాన్ అవుతుంది జాగ్రత్త!

వాట్సాప్‌ను మిస్ యూజ్ చేసినట్టు గుర్తిస్తే ఆ నెంబర్‌‌పై వాట్సాప్ వాడకుండా మెటా సంస్థ వెంటనే చర్యలు తీసుకుంటుందని మీకు తెలుసా? అంతే కాదు, కొంతమంది తెలియక చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల కూడా అకౌంట్స్ బ్యాన్ అవుతుంటాయి. అందుకే వాట్సాప్ లో ఈ మిస్టేక్స్ చెయకుండా జాగ్రత్తపడాలి.

Whatsapp Tips: ఈ పనులు చేస్తే మీ వాట్సాప్ బ్యాన్ అవుతుంది జాగ్రత్త!
Whatsapp Tips
Nikhil
|

Updated on: Oct 05, 2025 | 6:01 PM

Share

రోజువారీ జీవితంలో వాట్సాప్ అనేది చాలా ముఖ్యమైనదిగా మారిపోయింది. అయితే వ్యక్తుల ప్రైవసీ, సెక్యూరిటీ విషయంలో వాట్సాప్ కొన్ని నిర్ధిష్టమైన జాగ్రత్తలు పాటిస్తుంది. అందులో భాగంగా కొన్ని యాక్టివిటీస్ కనుక రికార్డ్ అయితే ఆ అకౌంట్స్‌ను పూర్తిగా బ్యాన్ చేస్తుంటుంది. ఈ లిస్ట్‌లో మీ నెంబర్ చేరకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటంటే..

రిపోర్ట్ చేస్తే..

ఎక్కువమంది వాట్సాప్ యూజర్లు మీ అకౌంట్‌ను రిపోర్ట్ చేస్తే మీ నెంబర్ వెంటనే బ్యాన్ లిస్ట్‌లోకి వెళ్లిపోతుంది. ఇతర యూజర్లకు ఫేక్ న్యూస్‌లు పంపినా లేదా ప్రమోషన్స్, అశ్లీలమైన కంటెంట్ వంటివి పంపినప్పుడు అవతలివాళ్లు మీ అకౌంట్‌ను రిపోర్ట్ చేస్తే మీ నెంబర్ బ్యాన్ అయ్యే అవకాశం ఉంది.

ఫేక్ యాప్

వాట్సాప్ పేరుతో ఉండే నకిలీ యాప్స్‌కు లాగిన్ అవ్వడం, థర్డ్ పార్టీ డెవలపర్స్ క్రియేట్ చేసిన వాట్సాప్ ఫేక్ యాప్స్ వాడడం ద్వారా కూడా మీ అకౌంట్ బ్లాక్ అవుతుంది. చాలామంది రెండో అకౌంట్ కోసమని వాట్సాప్ గో, వాట్సాప్ ప్లస్ వంటి నకిలీ యాప్స్ వాడుతుంటారు. అయితే ఇప్పుడు వాట్సాప్‌లో మల్టిపుల్ అకౌంట్స్ ఫీచర్ వచ్చింది. మీ రెండో నెంబర్‌‌తో కూడా వాట్సాప్‌లోనే మరోక అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు.

గ్రూప్ యాక్టివిటీ

వాట్సాప్ గ్రూపుల్లో ఫేక్ న్యూస్‌లు షేర్ చేయడం, పర్మిషన్ తీసుకోకుండా ఎక్కువమందిని గ్రూప్స్‌లో చేర్చడం వంటి పనుల చేసినప్పుడు గ్రూప్ మెంబర్స్ రిపోర్ట్ చేయడం ద్వారా సదరు యూజర్ అకౌంట్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంది.

ఆటోమేటెడ్ యాక్టివిటీ

వాట్సాప్‌లో బల్క్ మెసేజ్‌లు పంపడం, ఏఐ టూల్స్ ద్వారా ఆటోమేటిక్ రిప్లైలు వెళ్లేలా వాట్సాప్‌ను ఇతర యాప్స్‌తో లింక్ చేస్తే.. సదరు అకౌంట్‌ను వాట్సాప్ బ్లాక్ చేస్తుంది. వాట్సాప్‌ను బిజినెస్ కోసం వాడాలి అనుకునేవాళ్లు వాట్సాప్ బిజినెస్ అకౌంట్ ద్వారా తగిన వివరాలు ఎంటర్ చేసి బిజినెస్ అకౌంట్‌కు యాక్సెస్ పొందాలి.

ఇవి కూడా..

ఇక వీటితోపాటు వాట్సాప్‌లో చట్టవిరుద్ధమైన కంటెంట్‌ షేర్ చేయడం, క్రైమ్, డ్రగ్స్ రిలేటెడ్ కంటెంట్ పంపడం, బెదిరించడం, అసభ్యకరమైన కామెంట్లు చేయడం వల్ల కూడా అకౌంట్ బ్యాన్ అవుతుంది. అలాగే స్కామ్స్ చేసేవాళ్లు, నకిలీ లింక్స్ పంపేవాళ్లను కూడా వాట్సాప్ గుర్తించి నెంబర్‌‌ను బ్లాక్ చేస్తుంది. ఒకవేళ తెలియక చేసిన మిస్టేక్స్ వల్ల మీ నెంబర్ బ్యాన్ అయినట్టయితే.. అకౌంట్‌ను తిరిగి యాక్టివేట్ చేయమని వాట్సాప్‌కు రిక్వెస్ట్ పెట్టొచ్చు. రివ్యూ చేసిన తర్వాత వాట్సాప్ మీ అకౌంట్‌ను మళ్లీ రికవరీ చేస్తుంది.

ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా