Best Camera Smartphones: ఒకప్పుడు ఫోన్ అంటే కేవలం కాల్స్ మాట్లాడుకోవడానికి మాత్రమే కానీ ఇప్పుడు అన్ని పనులను ఫోన్ చేసి పెడుతోంది. ముఖ్యంగా కేవలం కెమరా కోసమే ఫోన్‌లు కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో కంపెనీలు సైతం వినియోగదారుల అభిరుచుకులకు అనుగుణంగా హై క్లారిటీ ఉండే స్మార్ట్ ఫోన్‌లను విడుదల చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్‌లోని కెమెరాల క్వాలిటీ సాధారణ కెమెరాల ఫొటోలు తలపిస్తున్నాయి. మరి రూ. 20 వేల లోపు బడ్జెట్‌లో 108 మెగాపిక్సెల్‌తో అదిరిపోయే ఫొటో క్వాలిటీని అందించే కెమెరాలున్న కొన్ని స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు మీకోసం..
ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 18,999గా ఉంది. ఇందులో 108 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. 6.67 ఇంచెస్ ఫుల్‌హెచ్‌డీ+అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. అక్టాకోర్ మీడియా టెక్ డైమెన్సిటీ 800 యూ ప్రాసెసర్ ఈ ఫోన్ సొంతం. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు.
రూ. 17,999కి అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ ఫోన్‌లో 108 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరా, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. 6.67 ఇంచెస్ ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లే ఈ ఫోన్ సొంతం. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఫోన్‌లో 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు.
రూ. 19,999గా ఉన్న ఈ ఫోన్‌లో 6.67 ఇంచెస్ ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. ఇందులో 108 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరా, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌లో 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు.
రియల్‌మీ 9 స్మార్ట్ ఫోన్‌లో 6.4 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ స్క్రీన్‌ను అందించారు. ఈ ఫోన్ ధర రూ. 18,999గా ఉంది. ఇందులో 108 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.
రూ. 20 వేల లోపు అందుబాటులో ఉన్న బెస్ట్ క్వాలిటీ కెమెరా ఉన్న ఫోన్లలో మోటో జీ 60 ఒకటి. రూ. 15,689గా ఉన్న ఈ స్మార్ట్ ఫోన్‌లో 108 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరా, సెల్ఫీల కోసం 32మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. 15 వాట్స్ టర్బో చార్జింగ్‌కు సపోర్ట్ చేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో 6000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..