AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amazon Prime Day 2023: అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్స్‌ షురూ.. ఆ ఫోన్లపై భారీ తగ్గింపు

ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, హెడ్‌ఫోన్‌లు, పవర్ బ్యాంక్‌లు, స్మార్ట్‌వాచ్‌లు,  వంటి అనేక ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై డిస్కౌంట్‌లను ఆఫర్ చేస్తుంది. ముఖ్యంగా ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపైపై భారీ తగ్గింపును అందిస్తుంది. సామ్‌సంగ్‌, రియల్‌మీ, మోటరోలా, ఐక్యూ వంటి ప్రఖ్యాత బ్రాండ్ల ఫోన్లపై అదిరిపోయే తగ్గింపును అందిస్తున్నారు. ఈ సేల్‌లో ఏయే ఫోన్లపై సూపర్‌ ఆఫర్లు ఉన్నాయో? ఓ సారి తెలుసుకుందాం. 

Amazon Prime Day 2023: అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్స్‌ షురూ.. ఆ ఫోన్లపై భారీ తగ్గింపు
Amazon
Nikhil
|

Updated on: Jul 15, 2023 | 8:00 PM

Share

అమెజాన్ భారతదేశంలో తన ప్రైమ్ డే సేల్‌ను జూలై 15న ప్రారంభించింది. ఈ సేల్‌ మధ్యాహ్నం 12:00 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, హెడ్‌ఫోన్‌లు, పవర్ బ్యాంక్‌లు, స్మార్ట్‌వాచ్‌లు,  వంటి అనేక ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై డిస్కౌంట్‌లను ఆఫర్ చేస్తుంది. ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపైపై భారీ తగ్గింపును అందిస్తుంది. సామ్‌సంగ్‌, రియల్‌మీ, మోటరోలా, ఐక్యూ వంటి ప్రఖ్యాత బ్రాండ్ల ఫోన్లపై అదిరిపోయే తగ్గింపును అందిస్తున్నారు. ఈ సేల్‌లో ఏయే ఫోన్లపై సూపర్‌ ఆఫర్లు ఉన్నాయో? ఓ సారి తెలుసుకుందాం. 

నోకియా సీ12

నోకియా సీ 12 ఆండ్రాయిడ్‌ 12 గోతో రన్‌ అవుతుంది. ఈ ఫోన్‌ 2 జీబీ + 64 జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. ఈ ఫోన్‌ను ఓ సారి చార్జ్‌ చేస్తే రెండు నుంచి మూడు రోజుల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. ఈ ఫోన్‌ ఈ సేల్లో రూ.5219కు అందుబాటులో ఉంది.

రెడ్‌మీ ఏ2

రెడ్‌మీ ఏ2ను బడ్జెన్‌ ఫ్రెండ్లీ ఫోన్‌లా ఎంఐ కంపెనీ లాంచ్‌ చేసింది. ఈ ఫోన్‌ను మీడియాటెక్‌ హీలియో జీ 36 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. అలాగే ఈ ఫోన్‌ ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తుంది. అలాగే ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ గో రన్‌తో పని చేస్తుంది. ఈ ఫోణ​ 2 జీబీ + 32 జీబీ వేరియంట్‌లో వస్తుంది. ఈ ఫోన్‌ ఈ సేల్లో రూ.5699కు అందుబాటులో ఉంది. 

ఇవి కూడా చదవండి

సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎం 34

సామ్‌సంగ్‌ ఇటీవల మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే లా ఎం 34ను లాంచ్‌ చసింది. ఈ ఫోన్‌ ఎక్సినోస్‌ 1280 చిప్‌సెట్‌తో పని చేస్తుంది. అలాగే ఈ ఫోన్‌లో ఎమోల్‌ఈడీ స్క్రీన్‌ ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ ఫోన​ 6,000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో పని చేస్తుంది. ఈ ఫోన్‌ ఈ సేల్‌లో రూ.16999కు అందుబాటులో ఉంటుంది. 

లావా అగ్ని 2

ఈ ఫోన్‌ కర్వ్డ్ డిస్‌ప్లేతో ప్రీమియం అనుభూతిని అందిస్తుంది. స్టాక్ ఆండ్రాయిడ్ అనుభవంతో వస్తున్న ఈ ఫోన్‌ మీడియా టెక​ డైమెన్‌సిటీ 7050 చిప్‌ సెట్‌తో పని చేస్తుంది. అలాగే 256 స్టోరేజీ వస్తుంది. అలాగే ఎమోఎల్‌ఈడీ డిస్‌ప్లేతో చాలా బాగా ఆకర్షి‍స్తుంది. ఈ ఫోన్‌ ప్రైమ్ డే సేల్‌లో రూ. 20,999కి అందుబాటులో ఉంటుంది.

రియల్‌మీ నార్జో 60 ప్రో

గత వారం రియల్‌మీ రెండు కొత్త ఫోన్‌లను ఆవిష్కరించింది. నార్జో 60, నార్జో 60 ప్రో పేరుతో రిలీజ్‌ చేసిన ఈ ఫోన్‌లు 1 టీబీ ఇంటర్నల్ స్టోరేజీతో వస్తున్నాయి. రియల్‌మీ రిలీజ్‌ చేసిన రూ. 30,000 లోపు మొదటి ఫోన్ ఇది. మీడియా టెక్‌ డైమెన్సిటీ 7050 పని చేసే ఈ ఫోన్లు  రియల్‌మీ 11 సిరీస్ డివైజ్‌ల మాదిరిగానే వేగన్ లెదర్ బ్యాక్‌తో వస్తుంది. 6.7 అంగుళాల 120హెర్ట్జ్ కర్వ్డ్ ఎమోఎల్‌ఈడీ స్క్రీన్‌ ఈ ఫోన్‌ ప్రత్యేకత. ఈ ఫోన్‌ రూ. 23,999 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఫోన్‌ ఆరు నెలల నో కాస్ట్‌ ఈఎంఐ ప్లాన్‌ అందుబాటులో ఉంది.

ఐక్యూ నియో 7 ప్రో

దేశంలోనే అత్యంత చౌకైన స్నాప్‌డ్రాగన్ 8+ జె 1 ఫోన్ అయిన ఐక్యూ నియో 7 ప్రో ఇటీవల కంపెనీ రిలీజ్‌ చేసింది. ఈ ఫోన్‌ ప్రైమ్ డే సేల్‌ సందర్భంగా రూ. 33,999కు అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్‌ను ప్రీ-బుక్ చేసే వారికి అదనంగా ఒక సంవత్సరం వారెంటీ లభిస్తుంది. 

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..