AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tecno POVA 6 NEO: ఈ స్మార్ట్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. రూ. 12 వేలలో కళ్లు చెదిరే ఫీచర్లు..

ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ దీపావళి సందర్బంగా సేల్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సేల్ లో భాగంగా పలు స్మార్ట్ ఫోన్స్ పై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నారు. ఇందులో భాగంగా చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ టెక్నోకు చెందిన ఫోన్ పై కళ్లు చెదిరే డిస్ ప్లేను అందిస్తోంది. ఇంతకీ ఏంటా ఫోన్.? అందులో ఉన్న ఫీచర్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Tecno POVA 6 NEO: ఈ స్మార్ట్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. రూ. 12 వేలలో కళ్లు చెదిరే ఫీచర్లు..
Tecno Pova 6 Neo
Narender Vaitla
|

Updated on: Oct 23, 2024 | 10:40 AM

Share

ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ గ్రేట్ ఇండియన్‌ ఫెస్టివల్‌ పేరుతో సేల్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అక్టోబర్‌ 29వ తేదీతో ముగియనున్న ఈ సేల్‌లో భాగంగా అన్ని రకాల వస్తువులపై కళ్లు చెదిరే డిస్కౌంట్స్‌ అందిస్తున్నారు. ముఖ్యంగా స్మార్ట్‌ ఫోన్స్‌పై ఈ సేల్‌లో భారీ తగ్గింపు ధరలను అందిస్తున్నారు. ఇందులో భాగంగా టెక్నో కంపెనీకి చెందిన ఓ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. ఇంతకీ ఏంటా ఫోన్‌.? అందులో ఉన్న ఫీచర్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

టెక్నో పోవా 6 నియో 5జీ ఫోన్‌పై అమెజాన్‌లో మంచి డీల్‌ లభిస్తోంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ అసలు ధర రూ. 16,999గా ఉంది. అయితే అమెజాన్‌ సేల్‌లో భాగంగా 18 శాతం డిస్కౌంట్‌తో రూ. 13,999కి లభిస్తోంది. ఇక ప్రత్యేకంగా ఈ ఫోన్‌పై రూ. 1000 కూపన్‌ను అందిస్తోంది. అలాగే పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా మరో రూ. వెయ్యి డిస్కౌంట్‌ పొందొచ్చు. దీంతో ఈ ఫోన్‌ను రూ. 12వేలకే సొంతం చేసుకోవచ్చు. కాగా మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్‌ చేసుకోవడం ద్వారా గరిష్టంగా రూ. 13 వేల వరకు డిస్కౌంట్‌ పొందొచ్చు.

ఇక ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌ను 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌తో తీసుకొచ్చారు. కెమెరా విషయానికొస్తే టెక్నో పోవా నియో 5జీలో 108 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. డీ6300 వంటి పవర్‌ ఫుల్ ప్రాసెసర్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. ఇందులో 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఇక ఈ ఫోన్‌లో ఇన్‌బిల్ట్‌గా ఇన్‌ఫ్రారెడ్‌, ఎన్‌ఎఫ్‌సీ వంటి ఫీచర్లను ఇచ్చారు.

ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 6.67 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను ఇచ్చార. అలాగే ఏఐ ఎరెజర్‌, ఏఐ కట్‌ అవుట్‌, ఏఐ వాల్‌ పేపర్‌, ఆస్క్‌ ఏఐ వంటి అధునాతన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్స్‌ను ఇందులో ఇచ్చారు. ఐపీ54 రేటింగ్‌తో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఇక సౌండ్ విషయానికొస్తే ఇందులో డాల్బీ ఆట్స్‌ డ్యూయల్‌ స్టీరియో స్పీకర్స్‌ను ఇచ్చారు. తక్కువ ధరలో లాంటి బెస్ట్‌ ఫీచర్స్‌ కోసం చూస్తున్న వారికి ఈ ఫోన్‌ బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి