Galaxy Z Fold, Z Flip: దేశంలో రోజురోజుకు కొత్త స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయి. పోటాపోటీగా అత్యాధునిక ఫీచర్లతో మార్కెట్లో విడుదల చేస్తున్నాయి పలు మొబైల్ కంపెనీలు. అధునాతన ఫీచర్లను జోడిస్తూ కంపెనీలు కొత్త కొత్త ఫోన్లను తయారు చేస్తున్నాయి. ఈ క్రమంలో అందుబాటులోకి వచ్చినవే ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్స్. తాజాగా ఈ హైఎండ్ స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే భారత్ మినహాయించి ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 11న గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 మడత (ఫోల్డబుల్ ) ఫోన్లతో పాటు గెలాక్సీ బడ్స్ 2, గెలాక్సీ వాచ్ 4 సిరీస్‌లను విడుదల చేయగా.. ఈ ఫోల్డబుల్ ఫోన్లను ఇండియాలో ఆగస్ట్ 20న బాలీవుడ్ హీరోయిన్ ఆలియా బట్ చేతులు మీదిగా మార్కెట్ లో విడుదల విడుదలైంది.
శాంసంగ్ ఇండియా ట్విట్టర్ ఫేజ్ ఈ ఫోల్డబుల్ ఫోన్లకు సంబంధించి కొన్ని విషయాలను పంచుకుంది. బాలీవుడ్ నటి ఆలియా భట్‌తో ఇంటరాక్షన్ ద్వారా గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3, జెడ్ ఫ్లిప్ 3లను దేశంలో లాంచ్ చేయడాన్ని ప్రస్తావించింది. వీటిని బట్టి చూస్తే ఈ ఫోల్డబుల్ ఫోన్లకు ప్రముఖ బాలీవుడ్ నటి ఆలియా భట్ ప్రమోషన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఈ ఫోన్ ధర విషయానికొస్తే 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ రూ. 1,49,999గా ఉండగా, 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 1,57,999గా ఉంది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ రూ. 84,999, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ రూ. 88,999గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికోసం ఆగస్టు 24 నుంచి ప్రీ ఆర్డర్లు తీసుకోనున్నారు. సెప్టెంబర్ 10 నుంచి సేల్ ప్రారంభం కానుంది.
ఈ ఫోన్ ఫీచర్స్.. 7.6 అంగుళాల ప్రైమరీ క్యూఎక్స్‌జీఏ ప్లస్ డైనమిక్ అమోఎల్ఈడీ 2ఎక్స్ ఇన్‌ఫినిటీ ఫ్లెక్స్ డిస్‌ప్లేను అందించారు. 120 హెర్ట్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ఈ ఫోన్ సొంతం. ఇక ఫోన్ కవర్ డిస్‌ప్లేను అందించారు. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై నడిచే ఈ ఫోన్‌లో మూడు రెయిర్ కెమెరాలు అందించారు. వీటిలో ఒక్కో కెమెరా 12 మెగా పిక్సెల్ ఉంటుంది. వైర్‌తోపాటు వైర్‌లెస్ ఛార్జింగ్ దీని ప్రత్యేకత. ఇక ఫోల్డ్ చేసిన స్క్రీన్‌వైపు అండర్ డిస్‌ప్లే కెమెరాను కూడా అందించారు. ఇలా మార్కెట్లో రోజురోజుకు విడుదలయ్యే కొత్త ఫోన్లు కస్టమర్లను మరింతగా ఆకట్టుకుంటున్నాయి. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నకొద్ది అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి స్మార్ట్‌ఫోన్లను తయారు చేస్తున్నాయి కంపెనీలు. తక్కువ ధరల్లో ఎక్కువ ఫీచర్స్ ఉండేలా మొబైల్స్ అందుబాటులోకి వస్తున్నాయి.
It’s the D-day! Watch Alia and Alia unfold #GalaxyZFlip3 5G and #GalaxyZFold3 5G
Go ahead and unfold new experiences just like @aliaa08! https://t.co/Tvb5s6S2YA #UnfoldYourWorld #Collab #Samsung pic.twitter.com/UJiWGp3Yzw— Samsung India (@SamsungIndia) August 20, 2021