AI: మెడలో ఈ లాకెట్ ఉంటే చాలు.. తోడుగా ఫ్రెండ్ ఉన్నట్లే..
ఏఐ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే నెక్లెస్‌ను రూపొందించారు. చూడ్డానికి నార్మల్ లాకెట్‌లా కనిపించే ఈ చిన్న గ్యాడ్జెట్ ఒక అద్భుతమని చెప్పాలి. ఇది మీ మెడలో ఉంటే చాలు ఎల్లప్పుడూ మీ వెన్నంటే ఓ స్నేహితుడు ఉన్న ఫీలింగ్ మీకు కలుగుతుంది. ఎయిర్ ట్యాగ్ రూపంలో ఉన్న ఈ గ్యాడ్జెట్‌ను ఫ్రెండ్ నెక్లెస్‌గా పిలుస్తున్నారు. ఈ లాకెట్‌తో మీరు...
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోజురోజుకీ విస్తరిస్తోంది. తన రూపాన్ని మార్చుకుంటూ ప్రపంచాన్ని సరికొత్త దిశలో నడిపిస్తోంది. ప్రస్తుతం దాదాపు అన్ని రంగాల్లో ఏఐ వినియోగం అనివార్యంగా మారింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉద్యోగాలు పోతున్నాయన్నదాంట్లో ఎంత వరకు నిజం ఉందో కానీ, ఈ టెక్నాలజీతో వస్తున్న గ్యాడ్జెట్స్ మాత్రం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. తాజాగా అలాంటి ఓ ట్రెండీ గ్యాడ్జెట్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ప్రీ బుకింగ్స్ అవుతోన్న ఈ గ్యాడ్జెట్ ఏంటి.? దీని ఉపయోగం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఏఐ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే నెక్లెస్‌ను రూపొందించారు. చూడ్డానికి నార్మల్ లాకెట్‌లా కనిపించే ఈ చిన్న గ్యాడ్జెట్ ఒక అద్భుతమని చెప్పాలి. ఇది మీ మెడలో ఉంటే చాలు ఎల్లప్పుడూ మీ వెన్నంటే ఓ స్నేహితుడు ఉన్న ఫీలింగ్ మీకు కలుగుతుంది. ఎయిర్ ట్యాగ్ రూపంలో ఉన్న ఈ గ్యాడ్జెట్‌ను ఫ్రెండ్ నెక్లెస్‌గా పిలుస్తున్నారు. ఈ లాకెట్‌తో మీరు మాట్లాడగలరు, మీ భావాలను పంచుకోలరు. దీనికి ప్రతిస్పందనగా లాకెట్ సైతం మీతో తిరిగి సంభాషిస్తుంది. అయితే దాని భావాన్ని మెసేజ్ రూపంలో మీ స్మార్ట్ ఫోన్‌ను పంపిస్తుంది.
ఈ ఏఐ ఆధారిత నెక్లెస్ ఐఓఎస్ యాప్ ద్వారా పనిచేస్తుంది. ఐఫోన్‌కు ఈ గ్యాడ్జెట్‌ను కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 2025 ప్రారంభంలో ఈ నెక్లెస్ అమ్మకాలను ప్రారంభించనున్నారు. అయితే కంపెనీ ప్రస్తుతం ప్రీ ఆర్డర్స్‌ని స్వీకరిస్తుంది. ఈ లాకెట్ ధర మన కరెన్సీలో రూ. 8000 వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక కంపెనీ ఈ ఏఐ లాకెట్ ప్రమోషన్స్‌లో భాగంగా రూపొందించిన ఈ వీడియోను రిలీజ్ చేశారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఈ లాకెట్ ఎలా పనిచేస్తుందన్న విషయాలను వివరించారు. ఒంటరిగా ఉన్న సమయంలో ఈ లాకెట్ అచ్చంగా ఒక స్నేహితుడిలా మీకు తోడుగా ఉంటుందని కంపెనీ చెబుతోంది. అయితే నిజంగా పక్కన మనిషి లోటును ఈ చిన్న గ్యాడ్జెట్ పూడుస్తుందా అంటే కచ్చితంగా అవుననే సమాధానం చెప్పలేము. కానీ మారుతోన్న టెక్నాలజీకి ఈ గ్యాడ్జెట్ కచ్చితంగా ఒక సాక్ష్యమని చెప్పొచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..