AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Foldable Phone: ఫోల్డబుల్ ఫోన్‌ కోసం చూస్తున్నారా.? తక్కువ బడ్జెట్‌లోనే..

స్మోర్ట్ ఫోన్ తయారీలో రోజురోజుకీ మార్పులు వస్తున్నాయి. అధునాతన ఫీచర్లతో కూడిన ఫోన్‌లను కంపెనీలు తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా డిజైన్‌ పరంగా సరికొత్తదనాన్ని పరిచయం చేస్తూ యూజర్లను ఆకట్టుకుంటున్నాయి కంపెనీలు. ఈ కోవలోకే వస్తాయి ఫోల్డబుల్‌ ఫోన్స్‌. మడత పెట్టే ఫోన్‌లకు ప్రస్తుతం మార్కెట్లో భారీగా డిమాండ్‌ ఉంది. అయితే ఫోల్డబుల్ ఫోన్‌ అనగానే ధర ఎక్కువనే అభిప్రాయం మనలో చాలా మందికే ఉండే ఉంటుంది..

Foldable Phone: ఫోల్డబుల్ ఫోన్‌ కోసం చూస్తున్నారా.? తక్కువ బడ్జెట్‌లోనే..
Foldable Phone
Narender Vaitla
|

Updated on: Aug 09, 2024 | 4:17 PM

Share

స్మోర్ట్ ఫోన్ తయారీలో రోజురోజుకీ మార్పులు వస్తున్నాయి. అధునాతన ఫీచర్లతో కూడిన ఫోన్‌లను కంపెనీలు తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా డిజైన్‌ పరంగా సరికొత్తదనాన్ని పరిచయం చేస్తూ యూజర్లను ఆకట్టుకుంటున్నాయి కంపెనీలు. ఈ కోవలోకే వస్తాయి ఫోల్డబుల్‌ ఫోన్స్‌. మడత పెట్టే ఫోన్‌లకు ప్రస్తుతం మార్కెట్లో భారీగా డిమాండ్‌ ఉంది. అయితే ఫోల్డబుల్ ఫోన్‌ అనగానే ధర ఎక్కువనే అభిప్రాయం మనలో చాలా మందికే ఉండే ఉంటుంది.

కానీ ఈ కామర్స్‌ దిగ్గజ సంస్థలు అమెజాన్‌తో పాటు, ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం సేల్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సేల్‌లో భాగంగా ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ మొదలు, గృహోపకరణాల వరకు అన్ని రకాల ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు. ఇందులో భాగంగానే పలు ఫోల్డబుల్ స్మార్ట్‌ ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్స్‌ లభిస్తున్నాయి. ఈ సేల్‌లో భాగంగా రూ. 30 వేల రేంజ్‌లో లభిస్తోన్న కొన్ని బెస్ట్‌ ఫోల్డబుల్ స్మార్ట్‌ ఫోన్స్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

* తక్కువ ధరలో లభిస్తోన్న బెస్ట్‌ ఫోల్డబుల్ ఫోన్స్‌లో మోటోరోలా రేజర్‌ 40 ఒకటి. ఈ స్మార్ట్‌ ఫోన్‌ను సేల్‌లో భాగంగా రూ. 33,749 లభిస్తోంది. కొన్ని బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా ర. 1000 వరకు డిస్కౌంట్‌ పొందొచ్చు. ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 4200 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. 6.9 ఇంచెస్‌తో కూడిన స్క్రీన్‌ను ఇచ్చారు. 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ సొంతం.

* ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ సామ్‌సంగ్‌కు చెందిన ఫోల్డబుల్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. సామ్‌సంగ్ గ్యాలక్సీ జెడ్‌ ఫ్లిప్‌ 3 ఫోల్డబుల్ ఫోన్ ధర రూ. 39,999కి లభిస్తోంది. ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌లో 3300 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. అలాగే ఈ ఫోన్‌ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 888 ఆక్టాకోర్ ప్రోసెసర్‌తో పనిచేస్తుంది.

* అత్యంత తక్కువ ధరలో ఫోల్డబుల్ ఫోన్‌ను సొంతం చేసుకోవాలనుకునే వారికి టెక్నో ఫాంథామ వీ ఫ్లిప్‌ ఫోన్‌ ఒకటి. అమెజాన్‌ సేల్‌లో భాగంగా ఈ ఫోన్‌ను కేవలం రూ. 29,899కే సొంతం చేసుకోవచ్చు. 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ను అందించారు. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నఅత్యంత చౌకైన ఫోల్డబుల్ ఫోన్‌ ఇదే కావడం విశేషం.

* మోటోరోలా రేజర్‌ 40 అల్ట్రా ఫోల్డబుల్ ఫోన్‌పైకూడా భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఫోన్‌ ధర రూ. 46,749కి లభిస్తోంది ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి 3.6 అంగుళాల కవర్ డిస్‌ప్లేను అందించారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
హోండా యాక్టివాకు గట్టి పోటీ.. 90 కి.మీ మైలేజ్ ఇచ్చే స్కూటర్!
హోండా యాక్టివాకు గట్టి పోటీ.. 90 కి.మీ మైలేజ్ ఇచ్చే స్కూటర్!
పెట్రోల్ బంకుల్లో దర్శనమిస్తున్న నో స్టాక్‌ బోర్డులు!
పెట్రోల్ బంకుల్లో దర్శనమిస్తున్న నో స్టాక్‌ బోర్డులు!
రూ.2కే కోడిగుడ్లు.. కొనేందుకు ఎగబడ్డ జనాలు! కాసేపటికే గుట్టురట్టు
రూ.2కే కోడిగుడ్లు.. కొనేందుకు ఎగబడ్డ జనాలు! కాసేపటికే గుట్టురట్టు
మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. వెండిపై ఎంతంటే
మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. వెండిపై ఎంతంటే
హైవేలపై ప్రయాణించే వారికి గుడ్‌న్యూస్.. ఇక ఒక్క స్కాన్‌తో
హైవేలపై ప్రయాణించే వారికి గుడ్‌న్యూస్.. ఇక ఒక్క స్కాన్‌తో
టెన్త్ అర్హతతో నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్
టెన్త్ అర్హతతో నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్
నెల రోజులు వచ్చే గ్యాస్ సిలిండర్ 45 రోజులు రావాలా? సింపుల్ టిప్స్
నెల రోజులు వచ్చే గ్యాస్ సిలిండర్ 45 రోజులు రావాలా? సింపుల్ టిప్స్
వాకింగ్ లేదా రన్నింగ్.. ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్?
వాకింగ్ లేదా రన్నింగ్.. ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్?
మరికొన్ని గంటల్లో ముగుస్తు Polycet 2026 దరఖాస్తు గడువు.. లింక్
మరికొన్ని గంటల్లో ముగుస్తు Polycet 2026 దరఖాస్తు గడువు.. లింక్
మ్యూజిక్ లవర్స్‌కి జాతీయ గీతం లాంటి పాట ఇది...
మ్యూజిక్ లవర్స్‌కి జాతీయ గీతం లాంటి పాట ఇది...