Cyber Crime: కొరియర్లో డ్రగ్స్ అంటూ బెదిరింపు.. మహిళ నుంచి రూ. 80లక్షలకు కుచ్చుటోపీ..

తాజాగా నవీ ముంబైకి చెందిన ఓ రిటైర్డ్ విద్యుత్ ఉద్యోగి సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారు. తాము ఓ ప్రముఖ అంతర్జాతీయ కొరియన్ కంపెనీ పేరిట.. ప్రభుత్వ ఉద్యోగులమంటూ ఆ మహిళకు కుచ్చుటోపీ పెట్టారు. ఏకంగా రూ. 80లక్షలు ఆమె వద్ద నుంచి నేరగాళ్లు కాజేశారు. ఈ స్కామ్ ముంబైలో సంచలనం రేపింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Cyber Crime: కొరియర్లో డ్రగ్స్ అంటూ బెదిరింపు.. మహిళ నుంచి రూ. 80లక్షలకు కుచ్చుటోపీ..
Cyber Crime

Updated on: Apr 05, 2024 | 5:23 PM

ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. ఎంతలా భద్రతా చర్యలు తీసుకుంటున్నా.. సైబర్ దాడులు కొనసాగుతూనే ఉంటున్నాయి. నేరగాళ్లు ఏదో ఒక రకంగా వ్యక్తులను బురిడీ కొట్టిస్తూనే ఉన్నారు. చదువుకున్న వారు కూడా వీరి బారిన పడుతూనే ఉన్నారు. తాజాగా నవీ ముంబైకి చెందిన ఓ రిటైర్డ్ విద్యుత్ ఉద్యోగి సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారు. తాము ఓ ప్రముఖ అంతర్జాతీయ కొరియన్ కంపెనీ పేరిట.. ప్రభుత్వ ఉద్యోగులమంటూ ఆ మహిళకు కుచ్చుటోపీ పెట్టారు. ఏకంగా రూ. 80లక్షలు ఆమె వద్ద నుంచి నేరగాళ్లు కాజేశారు. ఈ స్కామ్ ముంబైలో సంచలనం రేపింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

స్మగ్లింగ్ పేరుతో..

నవీ ముంబైలో నివసిస్తున్న 63 ఏళ్ల మహిళ ఓ విద్యుత్ కంపెనీలో పనిచేసి రిటైర్ అయ్యారు. ఆమె ప్రస్తుతం మహారాష్ట్రలోని నవీ ముంబై టౌన్‌షిప్‌లోని వాషిలో నివాసం ఉంటున్నారు. ఆమెకు ఒక ప్రముఖ అంతర్జాతీయ కొరియర్ కంపెనీ, ప్రభుత్వ అధికారుల ప్రతినిధులుగా నటిస్తూ మోసగాళ్లు రూ. 80 లక్షలు కాజేయడానికి ప్రయత్నించారు. స్మగ్లింగ్ కేసులో చట్టపరమైన పరిణామాల నుంచి రక్షణ కల్పిస్తామని తప్పుడు వాగ్దానాలు చేసి ఆమె నుంచి డబ్బులు వసూలు చేశారు.

స్కామ్ ఏంటంటే..

మార్చి 29న, బాధితురాలికి అంతర్జాతీయ కొరియర్ సర్వీస్ కి చెందిన ఓ వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆమె పేరుతో స్మగ్లింగ్ వస్తువులతో కూడిన పార్శిల్ వచ్చిందని కాల్ చేసిన వ్యక్తి ఆమెకు తెలియజేసాడు. దీంతో ఆమెపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశామని పేర్కొన్నాడు. సైబర్ పోలీస్ స్టేషన్ అధికారి అని చెబుతూ వేరరే వ్యక్తితో మాట్లాడించాడు. ఆ తర్వాత బాధితురాలికి స్కైప్ ఖాతా ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆర్థిక మంత్రిత్వ శాఖ పేరుతో నకిలీ లేఖలు అందాయని ఆమె పేర్కొన్నారు. ఫోన్లో మాట్లాడిన వ్యక్తులు ఆమెను త్వరలో అరెస్ట్ కూడా చేస్తామని బెదిరించినట్లు తెలిపారు. ఆ తర్వాత ఆమెతో ఫోన్లో మాట్లాడిన వ్యక్తి చట్టపరమైన చర్యల నుంచి రక్షించడానికి సహాయం అందిస్తామని చెప్పి.. వివిధ బ్యాంకు ఖాతాలలోకి రూ.80 లక్షలు బదిలీ చేయమని మహిళను ఒత్తిడి చేశారు.

ఇవి కూడా చదవండి

మోసాన్ని గ్రహించి..

ఆ తర్వాత అసలు విషయం అర్థమై.. తాను మోసపోయానని గ్రహించిన ఆ మహిళ సైబర్ క్రై పోలీసులను ఆశ్రయించింది. జరిగిన విషయాన్ని వివరించింది. ఏప్రిల్ రెండో తేదీన ఫిర్యాదు చేసింది. పోలీసులు గుర్తు ఆమెకు ఫోన్ చేసిన తెలియని వ్యక్తులపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్లు 420 (మోసం), 465, 468, 471 (ఫోర్జరీ), 170 (ప్రభుత్వ సేవకుడిగా నటించడం), 120బీ (నేరపూరిత కుట్ర) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. 34 (సాధారణ ఉద్దేశం), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం నిబంధనలు ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఇలాంటి ఘటనే మరొకటి..

ఇటీవల, ఇలాంటి సంఘటనలో, మోసగాళ్లు, ప్రఖ్యాత లాజిస్టిక్స్ కంపెనీ, లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు చెందినవారిగా నటిస్తూ, ముంబైకి చెందిన ఒక మహిళా న్యాయవాది నుంచి 80 లక్షల రూపాయలను కొట్టేయడానికి ప్రయత్నించారు. అయితే, ఆమె అప్రమత్తంగా ఉండటం వల్ల ఎలాంటి ఆర్థిక నష్టం జరగలేదు. మోసగాళ్లు 30 ఏళ్ల న్యాయవాదిని సంప్రదించి ఆమె ఇరాన్‌కు పంపడానికి ప్రయత్నించిన ప్యాకేజీలో సింథటిక్ డ్రగ్ ఎల్‌ఎస్‌డీ ఉందని బెదిరించారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..