- Telugu News Photo Gallery Technology photos IMOO Kids Watch Phone Z7 smart watch for kids with inbuilt camera
Smartwatch: ఇన్‌బిల్ట్ కెమెరాతో స్మార్ట్‌వాచ్.. చిన్నారుల కోసం ప్రత్యేకంగా..
స్మార్ట వాచ్‌ల్లో రోజుకో మోడల్ మార్కెట్లోకి అందుబాటులోకి వస్తున్నాయి. ఈక్రమంలోనే చిన్నారుల కోసం కూడా ప్రత్యేకంగా వాచ్‌లు లాంచ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే చిన్నారుల భద్రతకు పెద్ద పీట వేస్తూ ఐఎమ్‌ఓ అనే కంపెనీ మార్కెట్లోకి ఓ స్టన్నింగ్ స్మార్ట్‌వాచ్‌ను లాంచ్ చేసింది. ఇంతకీ వాచ్ ప్రత్యేక ఏంటి.? ఇందులో ఉన్న ఫీచర్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Apr 05, 2024 | 8:28 PM

IMO వాచ్ ఫోన్ 27 పేరుతో చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఓ స్మార్ట్ వాచ్‌ను తీసుకొచ్చింది. ఈ వాచ్‌లో చిన్నారుల భద్రత, ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో రకాల ఫీచర్లను అందించారు.

ఈ వాచ్ ఫీచర్ల విషయానికొస్తే 1.3 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను అందించారు. ఏఐ ఇంటెలిజెంట్ మోడ్ వంటి అధునాతన ఫీచర్‌ను ఇందులో ప్రత్యేకంగా ఇచ్చారు.

చిన్నారుల ఆరోగ్యానికి సంబంధించి వారి శరీర ఉష్ణోగ్రత, హృదయ స్పందన రేటు ట్రాకింగ్ వంటి హెల్త్ ఫీచర్లను అందించారు. అలాగే ఇందులో ఫ్యామిలీ చాట్, యాడ్ ఫ్రెండ్స్, ఎమోషన్ రికగ్నిషన్, హార్ట్ రేట్, బాడీ టెంపరేచర్, బ్లడ్ ఆక్సిజన్ వంటి ఫీచర్లను సైతం ఇచ్చారు.

ఈ వాచ్‌లో ప్రత్యేకంగా ఇన్‌బిల్ట్ కెమెరాను అందించారు. 2 మెగాపిక్సెల్ ఫ్రంట్, 5 మెగాపిక్సెల్స్ బ్యాక్ కెమెరాను అందించారు. ఇందులో 4జీబీ ఇంటర్నల్ స్టోరేజీని అందించారు. 4G, వైఫై కనెక్టివిటీ ఇందులో ఇచ్చారు.

అలాగే ఇందులో IPX8 రేట్ వాటర్ రెసిస్టెంట్ అందించారు. 740 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఈ వాచ్ సొంతం. 100 గంటల వరకు బ్యాకప్ ఉంటుంది. ధర విషయానికొస్తే రూ. 14,990గా నిర్ణయించారు




