AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smartphone Battery: మీ ఫోన్ బ్యాటరీ డౌన్ అవుతుందా..?ఈ టిప్స్‌తో చార్జింగ్ సమస్య ఫసక్..!

ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్‌ను వాడే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఇంట్లో ఒకటి నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అయితే స్మార్ట్ ఫోన్ పనితీరులో బ్యాటరీ కీలకపాత్ర పోషిస్తుంది. ఫోన్ కొన్న కొత్తల్లో బ్యాటరీ బాగానే ఉన్నా క్రమేపి స్మార్ట్ ఫోన్ బ్యాటరీ ఈజీగా డ్రెయిన్ అయిపోతూ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ బ్యాటరీ సంరక్షించుకోవడానికి నిపుణులు చెప్పే టిప్స్ తెలుసుకందాం.

Smartphone Battery: మీ ఫోన్ బ్యాటరీ డౌన్ అవుతుందా..?ఈ టిప్స్‌తో చార్జింగ్ సమస్య ఫసక్..!
Smart Phone Battery
Nikhil
|

Updated on: May 03, 2025 | 5:45 PM

Share

స్మార్ట్‌ఫోన్‌లు అనేవి మన జీవితంలో అతి ముఖ్యమైన భాగాల్లో ఒకటిగా మారాయి. ఇటీవల కాలంలో చాలా పని సంబంధిత సంభాషణల కోసం వాటిపై ఆధారపడాల్సి వస్తుంది. అధికంగా ఈ స్మార్ట్ ఫోన్‌ను ఉపయోగించడం వల్ల ఫోన్ బ్యాటరీని వేగంగా ఖాళీ చేస్తుంది. మీరు గేమర్ అయినా, సోషల్ మీడియా ఔత్సాహికులైతే ఈ బ్యాటరీ సమస్య మరింత ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే మన ఫోన్ వాడకంలో రాజీ పడకుండా మీ బ్యాటరీ జీవితాన్ని పొడిగించడానికి నిపుణులు కొన్ని టిప్స్ చెబుతున్నారు. నిపుణులు చెప్పే టాప్-5 టిప్స్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

బ్యాక్‌గ్రౌండ్ యాప్స్

సాధారణంగా మన ఫోన్‌లో ఓ యాప్‌ను ఓపెన్ చేసి, వేరే అవసరంపై మరో యాప్‌ను వాడుతూ ఉంటారు. అయితే బ్యాక్‌గ్రౌండ్‌లో ఆ యాప్ పని చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, ఇమెయిల్, మెసేజింగ్ యాప్‌లు ఆటో-సింక్ ఫీచర్‌లను ఉపయోగించి కంటెంట్‌ను నిరంతరం రిఫ్రెష్ చేస్తాయి. ఇవి మీ బ్యాటరీని లైఫ్‌ను త్వరగా ఖాళీ చేస్తాయి. కాబట్టి మీ ఫోన్ సెట్టింగ్స్‌కు వెళ్లి ఉపయోగించని యాప్‌లను మాన్యువల్‌గా మూసివేయాలి. అలాగే అవసరం లేని యాప్స్ ఆటో-సింక్‌ను నిలిపివేయడం వల్ల మీ బ్యాటరీ త్వరగా 

పవర్ సేవింగ్ మోడ్‌

దాదాపు అన్ని లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు అంతర్నిర్మిత బ్యాటరీ సేవర్ లేదా పవర్-సేవింగ్ మోడ్‌తో వస్తాయి. ఈ ఆప్షన్‌ను ఎనేబుల్ చేస్తే బ్యాక్ గ్రౌండ్ యాక్టివిటీను తగ్గిస్తాయి. స్క్రీన్‌ను లైటింగ్‌ను పరిమితం చేస్తుంది. బ్యాటరీ లైఫ్‌ను పెంచుతుంది. మీ ఫోన్‌కు చార్జింగ్ తక్కువగా ఉన్నప్పుడు ఈ ఆప్షన్ ఎంచుకుంటే త్వరగా ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వకుండా చూసుకోవచ్చు. 

ఇవి కూడా చదవండి

టైమ్‌అవుట్ సెట్టింగ్‌లు

మీ స్క్రీన్ బ్రైట్‌నెస్ మీ ఫోన్ బ్యాటరీని ఎక్కువగా ఖాళీ చేస్తుంది. బ్రైట్‌నెస్‌ను 100 శాతం వద్ద ఉంచడం వల్ల మీ బ్యాటరీ త్వరగా అయిపోతుంది. కాబట్టి మీ ఫోన్‌లో ఆటో బ్రైట్‌నెస్‌ని ప్రారంభించాలి. లేదా మాన్యువల్‌గా సౌకర్యవంతమైన స్థాయికి తగ్గించాలి. అలాగే 15-30 సెకన్ల సమయానికే ఆటోమెటిక్‌గా స్క్రీన్ ఆఫ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలి. 

జీపీఎస్, కనెక్టవిటీ

ప్రతి ఒక్కరి ఫోన్‌లో జీపీఎస్, బ్లూటూత్, వైఫై, మొబైల్ డేటా అందుబాటులో ఉంటున్నాయి. ఈ సౌకర్యాలు మన ఫోన్ చార్జింగ్‌ను వేగంగా తగ్గిస్తాయి. మీకు వీటి అవసరం లేకపోతే వాటిని ఆపివేయడం ఉత్తమం. ముఖ్యంగా సిగ్నల్ కనెక్టివిటీ తక్కువగా ఉన్న సమయంలో ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను ఎంచుకోవడం ఉత్తమం.

అప్‌డేటెడ్ యాప్స్ 

స్మార్ట్ ఫోన్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లలో తరచుగా బ్యాటరీ ఆప్టిమైజేషన్‌లు, బగ్ పరిష్కారాలు ఉంటాయి. పాత వెర్షన్‌లను ఉపయోగించడం వల్ల అసమర్థ పనితీరుతో పాటు బ్యాటరీ త్వరగా చార్జ్ అయ్యిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మీ ఫోన్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవడం ఉత్తమం. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్లు జాగ్రత్త.. స్ట్రోక్ వచ్చే ప్రమాదం..
ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్లు జాగ్రత్త.. స్ట్రోక్ వచ్చే ప్రమాదం..
ఈ చిత్రంలో రెండు అంకెలు ఉన్నాయ్.. 5 సెకన్లలో కనుగొన్నారో జీనియసే
ఈ చిత్రంలో రెండు అంకెలు ఉన్నాయ్.. 5 సెకన్లలో కనుగొన్నారో జీనియసే
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న దేఖ్ లేంగే సాలా సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న దేఖ్ లేంగే సాలా సాంగ్..
ఈ కష్టం ఏ తండ్రికీ రాకూడదు.. టెట్ పరీక్షకు తీసుకెళ్తుండగా..
ఈ కష్టం ఏ తండ్రికీ రాకూడదు.. టెట్ పరీక్షకు తీసుకెళ్తుండగా..
భారీ డీల్.. తెలంగాణలో అమెజాన్‌ డేటా సెంటర్‌.. ఎక్కడో తెలుసా?
భారీ డీల్.. తెలంగాణలో అమెజాన్‌ డేటా సెంటర్‌.. ఎక్కడో తెలుసా?
ప్రతి నెలా రూ.10 వేలు SIPలో పెడితే.. చేతికి ఎంతొస్తుంది?
ప్రతి నెలా రూ.10 వేలు SIPలో పెడితే.. చేతికి ఎంతొస్తుంది?
ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల 2026 మార్కుల కేటాయింపులో కీలక మార్పులు
ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల 2026 మార్కుల కేటాయింపులో కీలక మార్పులు
11 సినిమాలు చేస్తే 10 బ్లాక్ బస్టర్ హిట్లే.. తోపు హీరోయిన్..
11 సినిమాలు చేస్తే 10 బ్లాక్ బస్టర్ హిట్లే.. తోపు హీరోయిన్..
బంగారం, వెండి కొనాలనుకుంటే ఇదే రైట్‌ టైమ్‌!
బంగారం, వెండి కొనాలనుకుంటే ఇదే రైట్‌ టైమ్‌!
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..