Hero Sharwanand: ‘శ్రీకారం’ నుంచి మరో సాంగ్ టీజర్ రిలీజ్.. సంక్రాంతి సందల్లె అంటున్న హీరో శర్వానంద్..
తెలుగు యంగ్ హీరో శర్వానంద్ నటిస్తోన్న సినిమా శ్రీకారం. డెబ్యూ డైరెక్టర్ కిషోర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

తెలుగు యంగ్ హీరో శర్వానంద్ నటిస్తోన్న సినిమా శ్రీకారం. డెబ్యూ డైరెక్టర్ కిషోర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. లాక్డౌన్ కారణంగా ఈ సినిమా చిత్రీకరణ వాయిదా పడింది. ఇక పూర్తి విలేజ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ సినిమా రూపొందుతుంది. శతమానం భవతి సూపర్ హిట్ తర్వాత శర్వానంద్ ఎలాంటి హిట్ అందుకోలేకపోయాడు. ఆ తర్వాత వచ్చిన జాను, రణరంగంలో అంతగా విజయం శాదించలేకపోయాయి. ఇక ప్రస్తుతం శర్వా నటించే శ్రీకారం సినిమాపైనే అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.
ఇదివరకే ఈ సినిమా నుంచి భలేగుంది బాలా అనే సాంగ్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పంధన లభించింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో సాంగ్ టీజర్‌ను విడుదల చేశారు చిత్రయూనిట్. సందల్లే, సందల్లే సంక్రాంతి సందల్లే అంటూ సాగే ఈ పాట పూర్తిగా పండగా వాతావరణం కనిపించేలా రూపొందించారు. శర్వానంద్‌కు జోడిగా అరుల్ మోహన్ నటిస్తుంది. ఇక పూర్తి సాంగ్‌ను జనవరి 7న విడుదల చేయనున్నారు.
Also Read:
Sharwanand : కోన చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన యంగ్ హీరో.. మెడికల్ థ్రిల్లర్ లో శర్వానంద్