Sharwanand : కోన చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన యంగ్ హీరో.. మెడికల్ థ్రిల్లర్ లో శర్వానంద్
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్డిఫరెంట్ స్టోరీస్ ను ఎంచుకుంటూ.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఇక ఈ యంగ్ హీరో ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.

sharwanand : టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్డిఫరెంట్ స్టోరీస్ ను ఎంచుకుంటూ.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఇక ఈ యంగ్ హీరో ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. త్వరలో ‘శ్రీకారం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా తర్వాత సంచలన దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో ‘మహాసముద్రం’ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత తిరుమల కిషోర్ దర్శకత్వంలో ‘ఆడాళ్ళు మీకు జోహార్లు’ అనే సినిమా చేస్తున్నాడు.
ఇలా వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న శర్వా తాజాగా మరో సినిమాను ఓకే చేసాడని తెలుస్తుంది. ప్రముఖ రచయిత కోన వెంకట్ కథను అందిస్తున్న ఒక మెడికల్ థ్రిల్లర్ ఎంటర్ టైన్ మెంట్ కథతో శర్వానంద్ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు దర్శకుడు ఎవరన్నది తెలియలేదు. ఇంట్రెస్టింగ్ పాయింట్ తో కోన వెంకట్ రాసిన ఈ కథ శర్వానంద్ కు బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పాడని టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. అయితే ముందు ఈ స్టోరీ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ దగ్గరకు వెళ్లిందట.. కానీ అనుకోని కారణాలవల్ల ఆ కథ శర్వా దగ్గరకు చేరిందని టాక్.
also read : Rajinikanth : తలైవాకు తలనొప్పిగా మారిన అభిమానులు.. ప్రశాంతత కోసం అమెరికాకు పయనమవుతున్న సూపర్ స్టార్..