Cricketers Who Got Divorce: వివిధ కారణాలతో తమ భార్యలకు విడాకులు ఇచ్చిన ప్రముఖ క్రికెట్ ప్లేయర్లు వీరు..

Cricketers Who Got Divorce: ప్రపంచ క్రీడా రంగంలో ఫుట్‌బాల్ తరువాత అంతటి క్రేజ్ ఉండేది ఒక్క క్రికెట్‌కు మాత్రమే. అందుకే క్రికెటర్లకు ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన అభిమానులు ఉంటారు.

Cricketers Who Got Divorce: వివిధ కారణాలతో తమ భార్యలకు విడాకులు ఇచ్చిన ప్రముఖ క్రికెట్ ప్లేయర్లు వీరు..
Cricketers Divorce

Cricketers Who Got Divorce: ప్రపంచ క్రీడా రంగంలో ఫుట్‌బాల్ తరువాత అంతటి క్రేజ్ ఉండేది ఒక్క క్రికెట్‌కు మాత్రమే. అందుకే క్రికెటర్లకు ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన అభిమానులు ఉంటారు. మైదానంలో వారి ఆట తీరుతో అభిమానులను సంపాదించుకుంటారు. అందుకే.. దాదాపు ఏ క్రికెటర్ పేరు లేవనెత్తినా వారి ఆట గురించి ప్రస్తావించడం జరుగుతుంది. వారి వ్యక్తిగత జీవితం ఎలాంటిదో ఎవరికీ తెలియదు. కొంతమంది ఆటగాళ్లు మైదానంలో, వెలుపల ఒకేలా ఉంటారు. మరికొందరు పూర్తిగా భిన్నంగా ఉంటారు. అయితే, క్రీడాకరుల వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవడానికి చాలా మంది ఔత్సాహికులు ప్రయత్నిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖ క్రికెట్ ప్లేయర్ల జీవితం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. క్రికెట్ లైఫ్‌ను ఆస్వాధిస్తూ.. వైవాహిక జీవితానికి ఎండ్ కార్డ్ పలికిన క్రికెటర్ల వివరాలు ఇప్పుడు చూద్దాం..

శిఖర్ ధావన్:
మొదటి భర్తకు విడాకులు ఇచ్చి, ఇద్దరు కుమార్తెలు కలిగిన అయేషా ముఖర్జీని టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లి చేసుకుని తన ప్రేమకు పరిమితులు లేవని చాటిచెప్పాడు. అయేషా ముఖర్జీ తండ్రి ఇండియన్ కాగా, తల్లి విదేశీయురాలు. అయేషా ఇండియాలో జన్మించిన తరువాత ఆమె కుటుంబం ఆస్ట్రేలియాకు మకాం మార్చేసింది. ప్రొఫెషనల్ కిక్ బాక్సర్ అయిన అయేషా.. గతంలో ఆస్ట్రేలియన్ వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. తాజాగా వీరిద్దరూ విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రమ్ వేదికగా అయేషా ముఖర్జీ చేసిన పోస్ట్ ఈ విషయాన్ని నిర్ధారిస్తోంది.

మొహమ్మద్ అజారుద్దీన్:
హైదరాబాదీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ రెండు పెళ్లిళ్లు చేసుకున్న విషయం దాదాపుగా అందరికీ తెలిసిందే. అజారుద్దీన్ మొదటగా నౌరీన్‌ను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ఆ తరువాత నౌరీన్‌కు విడాకులు ఇచ్చిన అజారుద్దీన్.. 1996లో నటి సంగీత బిల్జానీని వివాహం చేసుకున్నాడు.

దినేష్ కార్తీక్:
దినేష్ కార్తీక్ విడాకుల స్టోరీ చాలా ఇంట్రస్టింగ్ అనే చెప్పాలి. కార్తీక్ తన చిన్ననాటి స్నేహితుడు నికితా వంజారాను వివాహం చేసుకున్నాడు. అయితే, 2012 లో కార్తీక్ తన భార్య వనిత.. సహచర క్రికెట్ ప్లేయర్ అయిన మురళీ విజయ్‌తో ఎఫైర్ నడుపుతోందని తెలుసుకున్నాడు. దాంతో ఆమెకు విడాకులు ఇచ్చాడు. ఆ తరువాత 2015 లో, ప్రముఖ స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్‌ను వివాహం చేసుకున్నాడు.

మహమ్మద్ షమీ :
మహమ్మద్ షమీ 2014 లో హసీన్ జహాన్‌ను పెళ్లి చేసుకున్నాడు. అయితే, హాసిన్ జహాన్‌కు ఇంతకు ముందే వివాహం జరిగింది, ఒక కూతురు కూడా ఉంది. 2012లో మహమ్మద్ షమీ, హసీన్ ఐపిఎల్ మ్యాచ్ సందర్భంగా కలుసుకున్నారు. వీరి ఫస్ట్ మీట్‌లోనే షమీ.. హాసిన్ జహాన్‌తో ప్రేమలో పడ్డాడు. వారిద్దరూ ఒకరితో ఒకరు డేటింగ్ చేయడం ప్రారంభించారు. చాలా కాలం ఇలా కొనసాగిన తరువాత.. వారిద్దరూ 6 జూన్, 2014 న మొరాదాబాద్-ఢిల్లీ రోడ్‌లోని ఒక ఫైవ్ స్టార్ హోటల్‌లో వివాహం చేసుకున్నారు. కొంతమంది ప్రత్యేక వ్యక్తులు మాత్రమే వారి వివాహానికి హాజరయ్యారు. హసీన్ గ్రాడ్యుయేషన్ వరకు చదువుకోగా.. చిన్నప్పటి నుంచి ఆమెకు మోడలింగ్ పట్ల ఆసక్తి ఉంది. కొంతకాలం మోడలింగ్ కూడా చేయగా.. ఐపీఎల్ మ్యాచ్‌లలో చీర్‌ లీడర్‌గా కూడా పని చేసింది. అయితే, వివాహం తర్వాత ఆమె తన వృత్తిని వదిలివేసింది. అనంతరం కాలంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం హసీన్ జహాన్, మహమ్మద్ షమీ విడాకులు తీసుకున్నారు.

జవగల్ శ్రీనాథ్:
భారత ఫాస్ట్ బౌలర్ శ్రీనాథ్.. మొదట జ్యోత్స్నను వివాహం చేసుకున్నాడు. ఆ తరువాత ఆమెకు విడాకులు ఇచ్చి మాధవి పాత్రవాలి అనే జర్నలిస్ట్‌ను పెళ్లి చేసుకున్నాడు.

వినోద్ కాంబ్లి:
వినోద్ కాంబ్లి 1998 లో తన చిన్ననాటి స్నేహితురాలు నోయెల్లా లూయిస్‌ని వివాహం చేసుకున్నాడు. కానీ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆమెకు విడాకులు ఇచ్చాడు. అనంతరం మాజీ మోడల్ ఆండ్రియా హెవిట్‌ను మ్యారేజ్ చేసుకున్నాడు.

బ్రెట్ లీ:
ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ 2006 లో ఎలిజబెత్ కెంప్ ను పెళ్లి చేసుకున్నాడు. కానీ, వారు కేవలం రెండు సంవత్సరాలలోనే విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2014 లో బ్రెట్ లీ.. లానా ఆండర్సన్‌ను వివాహం చేసుకున్నాడు.

జోంటీ రోడ్స్:
కేట్ మెక్‌కార్తీ అనే మహిళను వివాహం చేసుకున్న ప్రముఖ దక్షిణాఫ్రికా ఫీల్డర్ జోంటీ రోడ్స్.. 19 సంవత్సరాల తరువాత తమ వివాహ బంధానికి ముగింపు పలికాడు.

సనత్ జయసూర్య:
సుముధు కరుణనాయక్ అనే మహిళను 1998 లో వివాహం చేసుకున్నాడు. కాని, వీరు ఒక్క సంవత్సరంలోనే విడాకులు తీసుకున్నారు. 2000 సంవత్సరంలో అతను సాండ్రాను పెళ్లాడాడు. వీరు కూడా 2021లో డైవర్స్ తీసుకున్నారు.

షోయబ్ మాలిక్:
షోయబ్ మాలిక్.. ప్రస్తుత భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను వివాహం చేసుకున్నాడు. అయితే ఈ పెళ్లికి ముందు, మాలిక్ 2002 లో అయేషా సిద్ధిఖీ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. ఆ తరువాత ఆమెకు విడాకులు ఇచ్చి.. సానియా మీర్జాను పెళ్లాడాడు.

సైమన్ డాల్:
స్వింగ్ బౌలింగ్‌కు పేరుగాంచిన కివీ ఫాస్ట్ బౌలర్ సైమన్ డౌల్ తన మొదటి భార్యకు డైవర్స్ ఇచ్చాడు. డాల్ కరీన్ అనే మహిళను మ్యారేజ్ చేసుకున్న సైమన్.. ఆ తరువాత ఆమె నుంచి విడిపోయాడు. అతనికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. గత సంవత్సరం డాల్ లియానా హెర్బర్ట్ అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు.

మైఖేల్ క్లార్క్:
2015 లో ప్రపంచ కప్ గెలిచిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్.. 7 సంవత్సరాల తన వైవాహిక జీవితానికి స్వస్తి పలికాడు. తన మొదటి భార్య కైలీకి విడాకులు ఇచ్చేశాడు. 2012లో వీరు వివాహం చేసుకున్నారు. వీరికి నాలుగు సంవత్సరాల కుమార్తె కూడా ఉంది.

Also read:

Praja Sangrama Yatra: తెలంగాణలో అధికారంలోకి వస్తే ఫస్ట్ ఆ పనే చేస్తాం.. బండి సంజయ్ సంచలన కామెంట్స్..

Indian Cricketers: పెళ్లైన మహిళలను వివాహమాడిన క్రికెట్ ప్లేయర్లు వీరే.. ఇంట్రస్టింగ్ విషయాలు మీకోసం..

Whatsapp Features: వాట్సప్ నుంచి మరో సరికొత్త ఫీచర్.. ఇకపై సెలక్టీవ్‌గా హైడ్ చేసుకోవచ్చు.. అదెలాగంటే..

Click on your DTH Provider to Add TV9 Telugu