ట్రాన్స్ జెండర్లకు షాక్.. అంతర్జాతీయ మహిళా క్రీడల పోటీల్లో నిషేధం

|

Mar 24, 2023 | 12:24 PM

ఈ మధ్య కొంతమంది ట్రాన్స్ జెండర్లు కూడా వివిధ రంగాల్లో రాణిస్తూ వారికంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంటున్నారు. అయితే తాజాగా వరల్డ్ అథ్లెటిక్ సంస్థ ట్రాన్స్ జెండర్లకు ఓ షాకింగ్ న్యూస్ ప్రకటించింది. అంతర్జాతీయ మహిళా క్రీడా పోటిల్లో ట్రాన్సజెండర్లు పాల్గొనకుండా నిషేధం విధించింది.

ట్రాన్స్ జెండర్లకు షాక్.. అంతర్జాతీయ మహిళా క్రీడల పోటీల్లో నిషేధం
Athlete
Follow us on

ఈ మధ్య కొంతమంది ట్రాన్స్ జెండర్లు కూడా వివిధ రంగాల్లో రాణిస్తూ వారికంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంటున్నారు. వైద్యులుగా, న్యాయవాదులుగా ఇలా ఎన్నో రంగాల్లో తమ ప్రతిభను చాటుకుంటున్నారు. అయితే అంతర్జాతీయ క్రీడా రంగానికి సంబంధించి వారికి ప్రంపంచ అథ్లెటిక్ సంస్థ చేదు వార్త తెలిపింది.  ఇక నుంచి అంతర్జాతీయ మహిళా క్రీడల పోటీల్లో ట్రాన్స్ జెండర్ల పాల్గొనే అవకాశం ఉండదని ప్రకటించింది.  ఈ పోటిల్లో పాల్గొనకుండా వారిపై  నిషేధం విధించింది. మగవారి నుంచి ఆడవారిగా లింగ మార్పిడి చేసుకున్న ట్రాన్స్ జెండర్లకు ప్రపంచ మహిళ క్రీడల పోటిల్లో పాల్గొనేందుకు అర్హత ఉండదని పేర్కొంది. ఈ విషయాన్ని ప్రపంచ అథ్లెటిక్ అధ్యక్షుడు లార్డ్ కో వెల్లడించారు.

 

ఆటల్లో పాల్గొనేందుకు లింగమార్పిడి చేసుకున్న వారి నుంచి భవిష్యత్తులో మహిళల కేటగిరీని రక్షించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ట్రాన్స్ జెండర్ల అర్హతపై పరిశోధన జరిపేందుకు ఓ వర్కింగ్ గ్రూప్ ను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.  మార్చి 31 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.