Junior Asia Cup 2023: జపాన్‌ను చిత్తుచేసి ఫైనల్‌ చేరిన టీమిండియా.. నేరుగా ప్రపంచ కప్ టోర్నీకి క్వాలిఫై..

|

Jun 11, 2023 | 9:58 AM

Women’s Junior Asia Cup 2023: జపాన్‌ వేదికగా జరుగుతున్న జూనియర్‌ మహిళల ఆసియా కప్‌ హాకీ టోర్నీలో భారత జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీఫైనల్‌లో టీమిండియా అమ్మాయిలు 1-0తో ఆతిథ్య జపాన్ జట్టుపై విజయం..

Junior Asia Cup 2023: జపాన్‌ను చిత్తుచేసి ఫైనల్‌ చేరిన టీమిండియా.. నేరుగా ప్రపంచ కప్ టోర్నీకి క్వాలిఫై..
Indian Women’s Hockey Team
Follow us on

Women’s Junior Asia Cup 2023: జపాన్‌ వేదికగా జరుగుతున్న జూనియర్‌ మహిళల ఆసియా కప్‌ హాకీ టోర్నీలో భారత జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీఫైనల్‌లో టీమిండియా అమ్మాయిలు 1-0తో ఆతిథ్య జపాన్ జట్టుపై విజయం సాధించారు. మ్యాచ్ ఆద్యంతం కూడా ఒక గోల్ మాత్రమే నమోదు అయింది. హోరాహోరీగా సాగిన ఈ సెమీస్‌‌లో భారత్‌ తరఫున, అలాగే పూర్తి మ్యాచ్‌లో సునేలితా(47వ నిమిషంలో) ఏకైక గోల్ చేసింది.

అయితే ఆసియా కప్ టోర్నీ టాప్ 3 స్థానాల్లో నిలిచిన జట్లు ఈ ఏడాది(నవంబర్-డిసెంబర్) చివరిలో జరిగే ఎఫ్‌ఐహెచ్‌ జూనియర్‌ ప్రపంచకప్‌నకు అర్హత సాధిస్తాయి. ఈ క్రమంలో ఆసియా కప్ ఫైనల్‌కి చేరిన టీమిండియా.. శాంటియాగో వేదికగా జరిగే ప్రపంచకప్ టోర్నీకి క్వాలిఫై అయింది.

మరోవైపు ఆదివారం జరిగే ఆసియా కప్ ఫైనల్ 2023 మ్యాచ్‌లో చైనా లేదా సౌత్ కోరియాతో మన అమ్మాయిలు తలపడనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..