AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోహ్లీ ఓపెనర్ అయితే.. ఆ స్థానాన్ని భర్తీ చేసేదెవరు.?

వన్డే ప్రపంచకప్ అయిపొయింది. ప్రస్తుతం టీమిండియా దృష్టి వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌పైకి మళ్లింది. ఇందులో భాగంగానే కెప్టెన్ విరాట్ కోహ్లీ సఫారీలతో జరిగిన చివరి టీ20లో సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని విఫలమయ్యాడని చెప్పొచ్చు. ఫార్మటు ఏదైనా భారత్‌కు టాప్ ఆర్డర్ ప్రధాన బలం. ఓపెనర్లతో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆకాశమే హద్దుగా విజృంభిస్తే.. ప్రత్యర్థి జట్టులో వణుకు పుట్టాల్సిందే. అలాంటి టాప్ ఆర్డర్ ఒకవేళ విఫలమైతే.. మ్యాచ్ చేజారిపోయినట్లే. ఎందుకంటే […]

కోహ్లీ ఓపెనర్ అయితే.. ఆ స్థానాన్ని భర్తీ చేసేదెవరు.?
Ravi Kiran
| Edited By: |

Updated on: Sep 25, 2019 | 6:45 PM

Share
వన్డే ప్రపంచకప్ అయిపొయింది. ప్రస్తుతం టీమిండియా దృష్టి వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌పైకి మళ్లింది. ఇందులో భాగంగానే కెప్టెన్ విరాట్ కోహ్లీ సఫారీలతో జరిగిన చివరి టీ20లో సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని విఫలమయ్యాడని చెప్పొచ్చు. ఫార్మటు ఏదైనా భారత్‌కు టాప్ ఆర్డర్ ప్రధాన బలం. ఓపెనర్లతో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆకాశమే హద్దుగా విజృంభిస్తే.. ప్రత్యర్థి జట్టులో వణుకు పుట్టాల్సిందే. అలాంటి టాప్ ఆర్డర్ ఒకవేళ విఫలమైతే.. మ్యాచ్ చేజారిపోయినట్లే. ఎందుకంటే మిడిల్ ఆర్డర్‌లో చివరి వరకు ఉంది ఒంటిచేత్తో గెలిపించే ఆటగాడు ఇంకా టీమ్‌కు దొరకలేదు. కోహ్లీకి ఐపీఎల్‌లో ఓపెనర్‌గా ఘనమైన రికార్డు ఉండటంతో అతడ్ని టీ20ల్లో ఓపెనర్‌గా పంపిస్తే బాగుంటుందని చాలామంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
అయితే కోహ్లీ ఓపెనర్‌గా దిగితే.. మిడిల్ ఆర్డర్‌లో జట్టును ఆదుకునే సరైన ఆటగాడు ఎవ్వరూ ఉండరని క్రీడా విశ్లేషకుల అంచనా. ఎందుకంటే దేశవాళీ క్రికెట్‌లో టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా పేరుగాంచిన శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే‌లు ఇంకా జట్టులో స్థిరంగా కుదుర్కోలేదు. అటు రిషబ్ పంత్, హార్దిక్ పాండ్య కూడా వారి స్థాయికి తగ్గట్టు ప్రదర్శన చేయాల్సి ఉంది. వీరిద్దరూ కూడా ఐపీఎల్, దేశవాళీ టీ20లలో అద్భుతమైన ఆటగాళ్లు.. అదే ఫామ్‌ను అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో కంటిన్యూ చేయలేకపోతున్నారు.ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, వరల్డ్‌కప్ సెమీఫైనల్‌ల్లో మాదిరిగానే ఒకవేళ టాప్ ఆర్డర్ విఫలమైతే.. అనుభవం లేని మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ వల్ల జట్టుకు ఘోర ఓటములు తప్పవు. గత కొంతకాలంగా నమోదైన గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే.. దాదాపు 28 సార్లు తక్కువ ఇన్నింగ్స్‌లలో టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ 100.. ఆపైగా పరుగులను రాబట్టారు. 100 కంటే ఎక్కువ పరుగులు కొట్టిన దాదాపు 18 సార్లు టీమిండియా విజయకేతనం ఎగరవేసింది. అంతేకాకుండా టాప్ ఆర్డర్‌లో ఒక్క వికెట్ పడినా కూడా 17 సార్లు భారత్ విజయం సొంతం చేసుకోవడం గమనార్హం. దీని బట్టే టాప్ ఆర్డర్ ఆటగాళ్లు జట్టుకు ప్రధాన బలం అని చెప్పవచ్చు.
ప్రస్తుతం టీమిండియా ఫామ్ బట్టి చూస్తుంటే టీ20 వరల్డ్‌కప్‌లో టాప్ ఫోర్ స్పాట్ దక్కించుకోవడం ఖాయమే. కానీ టాప్ ఆర్డర్ ఫెయిల్ అయిన ప్రతిసారి.. టీమ్ మేనేజ్‌మెంట్ దానికి అనుగుణంగా ప్లాన్ బీ మాత్రం సిద్ధం చేయడంలో పూర్తిగా విఫలమవుతూ వస్తోంది. ఇప్పటికైనా ఈ సమస్యను టీమ్ దృష్టిలో పెట్టుకుని మరో ఐసీసీ ఈవెంట్ వచ్చేలోపు పరిష్కరిస్తే బాగుంటుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే యువ క్రికెటర్లు ఇప్పటి నుంచి అవకాశాలు ఇస్తూ రిజర్వ్ బెంచ్‌ను స్ట్రాంగ్ చేసుకుంటే.. అన్ని పరిణామాలను ధీటుగా ఎదురుకోవచ్చు.