భారత్ ముంగిట భారీ స్కోర్.. విండీస్ 315/5

కటక్ లో భారత్‌తో జరుగుతున్న కీలకమైన వన్డేలో విండీస్ ఆటగాడు నికోలస్ వీర విహారం చేశాడు. 64 బంతుల్లో 10 ఫోర్లు, మూడు సిక్సర్లతో 89 పరుగులు చేసిన పూరన్ శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. మరో ఆటగాడు షాయ్ హోప్ వన్డేల్లో వేగంగా 3000 పరుగులు సాధించిన విండీస్ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 50 ఓవర్లు ముగిసేసరికి విండీస్ 5 వికెట్లు కోల్పోయి 315 పరుగుల భారీ స్కోరు సాధించింది. నవదీప్ సైని రెండు వికెట్లు […]

భారత్ ముంగిట భారీ స్కోర్.. విండీస్ 315/5

Edited By:

Updated on: Dec 22, 2019 | 5:55 PM

కటక్ లో భారత్‌తో జరుగుతున్న కీలకమైన వన్డేలో విండీస్ ఆటగాడు నికోలస్ వీర విహారం చేశాడు. 64 బంతుల్లో 10 ఫోర్లు, మూడు సిక్సర్లతో 89 పరుగులు చేసిన పూరన్ శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. మరో ఆటగాడు షాయ్ హోప్ వన్డేల్లో వేగంగా 3000 పరుగులు సాధించిన విండీస్ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 50 ఓవర్లు ముగిసేసరికి విండీస్ 5 వికెట్లు కోల్పోయి 315 పరుగుల భారీ స్కోరు సాధించింది. నవదీప్ సైని రెండు వికెట్లు తీయగా శార్దూల్ ఠాకూర్, షమీ, జడేజా తలా ఒక వికెట్ తీశారు.