భలే! స్మిత్ బ్యాటింగ్..నవ్వుల్ పంచెన్!

లండన్‌: యాషెస్‌ సిరీస్‌ రెండో టెస్టులో భాగంగా శుక్రవారం మూడో రోజు  వర్షం కారణంగా 24.1 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఆసీస్‌ నాలుగు వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. స్టీవ్‌ స్మిత్‌(13 బ్యాటింగ్‌), వేడ్‌(0 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నారు. అయితే ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌స్మిత్‌ తన విచిత్ర బ్యాటింగ్‌తో నవ్వులు పూయించాడు. ఇంగ్లాండ్‌ బౌలర్లు విసిరిన చెత్త బంతులను ఆడే క్రమంలో స్మిత్‌ వాటిని చిత్రవిచిత్రంగా వదిలేసి అభిమానులకు భలే వినోదం పంచాడు. ఇందుకు […]

  • Ram Naramaneni
  • Publish Date - 5:30 pm, Sat, 17 August 19
భలే! స్మిత్ బ్యాటింగ్..నవ్వుల్ పంచెన్!
Smith Funny batting

లండన్‌: యాషెస్‌ సిరీస్‌ రెండో టెస్టులో భాగంగా శుక్రవారం మూడో రోజు  వర్షం కారణంగా 24.1 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఆసీస్‌ నాలుగు వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. స్టీవ్‌ స్మిత్‌(13 బ్యాటింగ్‌), వేడ్‌(0 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నారు. అయితే ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌స్మిత్‌ తన విచిత్ర బ్యాటింగ్‌తో నవ్వులు పూయించాడు. ఇంగ్లాండ్‌ బౌలర్లు విసిరిన చెత్త బంతులను ఆడే క్రమంలో స్మిత్‌ వాటిని చిత్రవిచిత్రంగా వదిలేసి అభిమానులకు భలే వినోదం పంచాడు. ఇందుకు సంబంధించిన వీడియోలను అభిమానులు ట్విటర్‌లో తెగ ట్రోల్ చేస్తున్నారు. బుధవారం ప్రారంభమైన రెండో టెస్టు మూడో రోజు ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేస్తుండగా ఈ సరదా బ్యాటింగ్‌ చోటుచేసుకుంది.