Virushka Couple: దయచేసిన ఆ పని మాత్రం చేయకండి.. ఫోటోగ్రాఫర్లకు విజ్ఞప్తి చేసిన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు..

Virushka Couple: ఇండియన్ మోస్ట్ ఫేమస్ కపుల్‌గా గుర్తింపు పొందిన విరుష్క(విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ) దంపతులకు ఇటీవలే పండంటి..

Virushka Couple: దయచేసిన ఆ పని మాత్రం చేయకండి.. ఫోటోగ్రాఫర్లకు విజ్ఞప్తి చేసిన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు..

Updated on: Jan 13, 2021 | 9:06 PM

Virushka Couple: ఇండియన్ మోస్ట్ ఫేమస్ కపుల్‌గా గుర్తింపు పొందిన విరుష్క(విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ) దంపతులకు ఇటీవలే పండంటి ఆడబిడ్డ జన్మించిన విషయం తెలిసిందే. ఆ చిన్నారిని చూసేందుకు భారత్ మాత్రమే కాదు.. యావత్ ప్రపంచంలోని ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఫ్యాన్స్ ఆశలపై విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు నీళ్లు చల్లారు. తమ చిన్నారి ఫోటోలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా దానికి సంబంధించి ఫోటోగ్రాఫర్లకు విరష్క జంట విజ్ఞప్తి చేసింది.

ఆ మేరకు ఒక ప్రకటన విడుదల చేసిన ఈ సెలెబ్రిటీ జంట.. తమ పాపను ఎవరూ ఫోటోలు తీయొద్దని కోరారు. ‘మా చిన్నారి ప్రైవసీని కాపాడాలనుకుంటున్నాం. మా కూతురుకు సంబంధించి ఎలాంటి ఫోటోలు గానీ, వార్తలు గానీ ప్రచురించొద్దు. ఈ అంశంలో తమ విజ్ఞప్తిని అర్థం చేసుకుంటామని భావిస్తున్నాం’ అని విరాట్, అనుష్క తమ ప్రకటనలో పేర్కొన్నారు.

Also read:

Ravi Teja Khiladi : జోరు పెంచిన మాస్ మహారాజ్.. ‘ఖిలాడి’మూవీ టీజర్ కు డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్ .?

ఏపీలో భోగి మంటల పొలిటికల్ హీట్, ప్రభుత్వ జీవోలను మంటల్లో పడేసిన టీడీపీ నేతలు, ఇదేమి కడుపుమంటోనని వైసీపీ సెటైర్లు