ఏపీలో భోగి మంటల పొలిటికల్ హీట్, ప్రభుత్వ జీవోలను మంటల్లో పడేసిన టీడీపీ నేతలు, ఇదేమి కడుపుమంటోనని వైసీపీ సెటైర్లు

ఏపీలో భోగి మంటలు రాజకీయ కాక రేపాయి. రాజకీయ నేతల భోగి మంటలు ఏపీలో పొలిటికల్‌ సెగలు కక్కాయి. పండుగ రోజూ పాలిటిక్స్‌ నడిచాయి...

ఏపీలో భోగి మంటల పొలిటికల్ హీట్, ప్రభుత్వ జీవోలను మంటల్లో పడేసిన టీడీపీ నేతలు, ఇదేమి కడుపుమంటోనని వైసీపీ సెటైర్లు
Follow us

|

Updated on: Jan 13, 2021 | 8:00 PM

ఏపీలో భోగి మంటలు రాజకీయ కాక రేపాయి. రాజకీయ నేతల భోగి మంటలు ఏపీలో పొలిటికల్‌ సెగలు కక్కాయి. పండుగ రోజూ పాలిటిక్స్‌ నడిచాయి. రైతులకు అన్యాయం జరుగుతోందంటూ ప్రభుత్వం ఇచ్చిన జీవోలను ఆ మంటల్లో పడేసి కాల్చారు టీడీపీ నేతలు. చాలా చోట్ల టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వ జీవోలను మంటల్లో వేసి కాల్చారు. రైతులకు వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని విమర్శించారు. కృష్ణాజిల్లా పరిటాలలో భోగి వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు ఐదు జీవో పేపర్లను మంటల్లో వేశారు. మోటార్లకు మీటర్లతో ఉచిత విద్యుత్‌ ఉద్దేశాలను ప్రభుత్వం దెబ్బతీస్తోందని విమర్శించారు. ఒక్కసారి అవకాశం ఇస్తే జగన్‌ ఏం చేస్తున్నారో చూడాలన్నారు. తాను ఏం తప్పు చేశానో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు చంద్రబాబు.

అయితే, జీవో కాపీలను భోగి మంటల్లో వేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది వైసీపీ. రైతులకు జరుగుతున్న మంచిని తట్టుకోలేని కడుపు మంటతోనే ఇలా చేశారని విమర్శించారు నేతలు. నగరిలో కుటుంబ సభ్యులతో కలిసి భోగి సంబరాలు చేసుకున్నారు ఎమ్మెల్యే రోజా. ఈ సందర్భంగానే ఆమె చంద్రబాబు తీరుపై విమర్శలు చేశారు. మంత్రి వెల్లంపల్లి కూడా చంద్రబాబుకు కౌంటర్‌ ఇచ్చారు. రైతులకు మంచి చేస్తుంటే.. వాళ్లకు ఇదేమి కడుపు మంటో అర్థం కావడం లేదంటూ కౌంటర్లు ఇచ్చారు వైసీపీ నేతలు.

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..