Virat New Record: కింగ్ కోహ్లీ..దేశంలోనే నెంబర్ వన్..అరుదైన రికార్డ్

Virat New Record:  భారత క్రికెట్ టీమ్ కెప్టెన్, రన్ మెషీన్‌  విరాట్‌కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా..?. ఆటలోనూ, బయట లైఫ్‌లోనూ దూకుడు వ్యవహరించే కోహ్లీకి కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే గ్రౌండ్‌లో రికార్డుల ఊచకోత మొదలెట్టాడు భారత కెప్టెన్. వన్ బై వన్ ఒడిసిపడుతూ తన ఖాతాలో వేసుకుంటున్నాడు. తాజాగా గ్రౌండ్‌కి వెలుపల కూడా ఓ అరుదైన రికార్డు నమోదు చేశాడు ఈ క్రేజీ క్రికెటర్. ఇన్‌స్టాగ్రామ్‌లో 50 మిలియన్ల […]

Virat New Record: కింగ్ కోహ్లీ..దేశంలోనే నెంబర్ వన్..అరుదైన రికార్డ్
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 18, 2020 | 9:42 AM

Virat New Record:  భారత క్రికెట్ టీమ్ కెప్టెన్, రన్ మెషీన్‌  విరాట్‌కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా..?. ఆటలోనూ, బయట లైఫ్‌లోనూ దూకుడు వ్యవహరించే కోహ్లీకి కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే గ్రౌండ్‌లో రికార్డుల ఊచకోత మొదలెట్టాడు భారత కెప్టెన్. వన్ బై వన్ ఒడిసిపడుతూ తన ఖాతాలో వేసుకుంటున్నాడు. తాజాగా గ్రౌండ్‌కి వెలుపల కూడా ఓ అరుదైన రికార్డు నమోదు చేశాడు ఈ క్రేజీ క్రికెటర్. ఇన్‌స్టాగ్రామ్‌లో 50 మిలియన్ల ఫాలోవర్స్‌ని సంపాదించుకున్న తొలి ఇండియన్ రికార్డులకెక్కాడు. 

ఇప్పటివరకు తన ఇన్‌స్టా ఖాతాలో కేవలం 930 పోస్టులు మాత్రమే చేశాడు కోహ్లీ. కానీ మన కెప్టెన్‌ ఆటతీరుకు, లీడర్‌షిప్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఫాలోయింగ్ ఉండటంతో..అతడు ఈ మైలురాయిని అందుకోడానికి పెద్ద టైమ్ పట్టలేదు. బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా 49.9 మిలియన్ల ఫాలోవర్స్‌తో ఇండియాలో రెండో స్థానాన్ని ఆక్రమించగా..44.1 మిలియన్ల ఫాలోవర్స్‌తో మరో బాలీవుడ్ నటి దీపికా పదుకొనే 3వ స్థానంలో ఉంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్స్ కలిగిన వ్యక్తిగా పోర్చుగల్ సాకర్ వీరుడు క్రిస్టియానో రొనాల్డ్.. ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. అతడి ఇన్‌స్టా ఖాతాకి ఏకంగా 200 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

View this post on Instagram

?

A post shared by Virat Kohli (@virat.kohli) on

ఇది కూడా చదవండి : ‘అమ్మ బయెపిక్’…శోభన్‌బాబు దొరికేశాడు..!