ఆ ముగ్గురిలో ఒకరిపై వేటు తప్పదుః కోహ్లీ

|

Jan 12, 2020 | 12:49 PM

న్యూ ఇయర్‌లో శ్రీలంకపై సిరీస్ విక్టరీ టీమిండియాకు ఫుల్ జోష్‌ను ఇచ్చింది. శుక్రవారం జరిగిన చివరి టీ20లో భారత్ 78 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు శిఖర్ ధావన్(52), కెఎల్ రాహుల్(54)లు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. ఇంతవరకు బాగానే ఉంది గానీ.. జట్టులో ఉన్న ముగ్గురు ఓపెనర్లు సూపర్ ఫామ్‌లో ఉండటంతో వచ్చే టీ20 వరల్డ్ ‌కప్‌కు ఎవరు ఉంటారు.? ఎవరిపై వేటు పడుతుంది.? అన్న దానిపై ఇప్పటికే సోషల్ […]

ఆ ముగ్గురిలో ఒకరిపై వేటు తప్పదుః కోహ్లీ
Follow us on

న్యూ ఇయర్‌లో శ్రీలంకపై సిరీస్ విక్టరీ టీమిండియాకు ఫుల్ జోష్‌ను ఇచ్చింది. శుక్రవారం జరిగిన చివరి టీ20లో భారత్ 78 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు శిఖర్ ధావన్(52), కెఎల్ రాహుల్(54)లు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. ఇంతవరకు బాగానే ఉంది గానీ.. జట్టులో ఉన్న ముగ్గురు ఓపెనర్లు సూపర్ ఫామ్‌లో ఉండటంతో వచ్చే టీ20 వరల్డ్ ‌కప్‌కు ఎవరు ఉంటారు.? ఎవరిపై వేటు పడుతుంది.? అన్న దానిపై ఇప్పటికే సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. అటు ఇదే విషయాన్ని కెప్టెన్ విరాట్ కోహ్లీ దగ్గర కూడా ప్రస్తావించగా అతడు తెలివిగా సమాధానమిచ్చాడు.

‘రోహిత్ శర్మ, ధావన్, రాహుల్‌లు ముగ్గురూ కూడా అద్భుతమైన ఆటగాళ్లు. వారు చక్కటి ఫామ్‌ను కొనసాగిస్తుండటంతో మాకు ఎంపిక చేసుకోవడంలో ఆప్షన్స్ లభిస్తాయని కోహ్లీ తెలిపాడు. అయితే జనాలు మాత్రం తమ ఫేవరెట్ ఆటగాడిని పొగుడుతూ.. మరొకరిని విమర్శించడం కరెక్ట్ కాదని హితవు పలికాడు. ఇదంతా ఒక జట్టు ఆట అని.. ఎవరికి వారు అద్భుత ప్రదర్శనలు ఇచ్చినా.. అన్నీ కూడా జట్టు విజయం కోసమేనన్నాడు. ఇక ఈ విషయాన్ని ఫ్యాన్స్ గుర్తుంచుకోవాలని కోహ్లీ స్పష్టం చేశాడు. అటు శార్దూల్ ఠాకూర్, నవదీప్ సైనీలపై కూడా ప్రశంసలు కురిపించిన టీమిండియా కెప్టెన్.. వారికి మరిన్ని అవకాశాలు దక్కితే అద్భుతమైన బౌలర్లుగా రూపుదిద్దుకుంటారని చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఇండియా-ఆస్ట్రేలియా మూడు వన్డేల సిరీస్ మంగళవారం నుంచి ముంబైలో ప్రారంభం కానుంది. కాగా, ఫిట్‌నెస్ టెస్టులో ఫెయిల్ అయ్యి హార్దిక్ పాండ్య న్యూజిలాండ్ ఏ సిరీస్ నుంచి తప్పుకున్న సంగతి విదితమే.