గోల్డ్ మెడల్ సాధిస్తుందని అనుకున్న రెజ్లర్ వినేష్ ఫోగాట్ ఓటమిపాలైంది. 53 కిలోల రెజ్లింగ్ విభాగం క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో బెలారస్‌కు చెందిన వెనెస్సాపై 3-9 తేడాతో ఓడిపాయింది. ప్రీక్వార్టర్స్ మ్యాచ్‌లో స్వీడన్ క్రీడాకారిణి సోఫియాను 7-1 తేడాతో ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు చేరిన ఫోగాట్.. ఇప్పుడు ఓడిపోవడంతో ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఇక వినేష్‌కు కాంస్యం దక్కాలంటే.. వెనెస్సా ఫైనల్స్ చేరేంతవరకు వేచి చూడాల్సిందే.
మరోవైపు టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత విశ్వక్రీడల్లో పతకం అందుకుంది. ఇవాళ జరిగిన మ్యాచ్‌లో జర్మనీపై 5-4తో విజయాన్ని సాధించి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. ఆరంభంలో భారత హాకీ టీం కాస్త తడబడినా.. ఆ తర్వాత పుంజుకుని అద్భుతంగా ఆడింది. ఈ మ్యాచ్‌లో పెనాల్టీ కార్నర్‌లు ఎక్కువగా నమోదు కావడం విశేషం.
Read Also: 41 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించిన భారత హాకీ జట్టు.. కాంస్యం సొంతం
బ్రేకప్ బాధ నుంచి బయటపడాలంటే.? ఈ నాలుగు విషయాలు తప్పనిసరిగా గుర్తుంచుకోండి!
మొసలికి చిక్కిన అడవి దున్న.. కట్ చేస్తే సీన్ రివెర్స్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే!
బ్రతుకున్న పామును కరకరా నమిలి మింగేసిన యువకుడు.. కారణం తెలిస్తే షాకే.!