Tokyo Olympics 2021: టోక్యో ఒలింపిక్స్‌లో తొలి స్వర్ణం.. రికార్డు సృష్టించిన చైనీస్ షూటర్.!

టోక్యో ఒలింపిక్స్‌లో చైనా తొలి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఆ దేశానికీ చెందిన షూటర్ యాంగ్ క్విన్.. శనివారం నిర్వహించిన మహిళల...

Tokyo Olympics 2021: టోక్యో ఒలింపిక్స్‌లో తొలి స్వర్ణం.. రికార్డు సృష్టించిన చైనీస్ షూటర్.!
China

Updated on: Jul 24, 2021 | 9:39 AM

టోక్యో ఒలింపిక్స్‌లో చైనా తొలి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఆ దేశానికీ చెందిన షూటర్ యాంగ్ క్విన్.. శనివారం నిర్వహించిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించింది. ఈ విభాగంలో ఆమె 251.8 స్కోరుతో ఒలింపిక్ రికార్డు సృష్టించింది. మరోవైపు ఈ విభాగంలో భారత్ నిరాశపరిచింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మహిళల క్వాలిఫికేషన్ రౌండ్‌లో ఎలవెనిల్(626.5 పాయింట్స్), అపూర్వి(621.9 పాయింట్స్) ఫైనల్‌కు క్వాలిఫై కాలేకపోయారు.

ఆర్చరీ మిక్స్‌డ్ విభాగంలో భారత్ ముందడుగు..

ఆర్చరీ మిక్స్‌డ్ విభాగంలో భారత్ క్వార్టర్ ఫైనల్స్‌లోకి అర్హత సాధించింది. చైనాకు చెందిన ప్లేయర్స్‌పై దీపికా కుమారి, ప్రవీణ్ జాదవ్ 5-3 తేడాతో అద్భుత విజయాన్ని సాధించారు. ఈ గెలుపుతో భారత్ క్వార్టర్ ఫైనల్స్‌లోకి వెళ్లగా.. అక్కడ దక్షిణ కొరియాతో తలపడే అవకాశం ఉంది.

Also Read:

రోడ్డుపై విచిత్ర యాక్సిడెంట్.. క్షణాల్లో సీన్ రివర్స్.. షాకింగ్ వీడియో!

జింకల మందపై ఎటాక్ చేసిన పెద్దపులి.. ఈ ఫోటోలో అదెక్కడ ఉందో కనిపెట్టండి బాసూ.!

ఆకుకూరలు ఫ్రెష్‌గా ఉండాలా.? ఇలా మాత్రం చేయొద్దు! తస్మాత్ జాగ్రత్త.. వైరల్ వీడియో!

Loading...
Unable to load recommendations.
Follow Us