ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న టోక్యో ఒలింపిక్స్ ప్రారంభమైంది. 2020లో జరగాల్సిన ఈ క్రీడా సంగ్రామం కరోనా కారణంగా ఈ ఏడాదికి వాయిదా పడిన విషయం విదితమే. కరోనా కారణంగా ప్రేక్షకులు లేకుండానే ఈ మెగా ఈవెంట్ మొదలైంది. ఇదిలా ఉంటే ఉదయం 5.30 గంటలకు ఆర్చరీలో మహిళల వ్యక్తిగత క్వాలిఫైయింగ్ రౌండ్ మొదలైంది.
మొదటి రోజు భారత ప్లేయర్స్ ఆర్చరీ ర్యాంకింగ్ రౌండ్స్‌లో పాల్గొన్నారు. మహిళల వ్యక్తిగత ర్యాంకింగ్ రౌండ్‌లో భారత ఆర్చర్ దీపికా కుమారి తొమ్మిదో స్థానంలో నిలవగా.. ఇక ఆర్చరీ వ్యక్తిగత పురుషుల ర్యాంకింగ్ రౌండ్లో తరుణదీప్ రాయ్, దాస్, ప్రవీణ్ జాదవ్ సరిగ్గా రాణించలేదు. ర్యాంకింగ్ రౌండ్లో మొదటి 25 స్థానాల్లో ఎవ్వరూ చేరలేకపోయారు. మిక్స్‌డ్ టీమ్ క్వాలిఫికేషన్ రౌండ్‌లో కూడా భారత్ ఓడిపోయి తొమ్మిదో స్థానానికి పడిపోయింది.
Competition Schedule – 2⃣3⃣ July 2021
Tonight the @Olympics will officially commence with the #Tokyo2020 Opening Ceremony at 8pm JST. ?
?Archery ranking round
?Rowing sculls heats
?Opening Ceremony ?For the daily Olympic schedule ▶️ https://t.co/xzDg8rES2o pic.twitter.com/apCgEArWeF
— #Tokyo2020 (@Tokyo2020) July 23, 2021
Wishing PM @sugawitter and ?? the very best for #Tokyo2020 @Olympics and @Paralympics. We look forward to a season of incredible performances by the world’s best sportspersons! @Tokyo2020
— Narendra Modi (@narendramodi) July 23, 2021
మహిళల ఆర్చరీ విభాగం నుంచి తొమ్మిదో స్థానంలో నిలిచిన దీపికాతో ప్రవీణ్ కలిసి మిక్స్‌డ్ ఈవెంట్‌లో పాల్గొననున్నారు.
Kim Je Deok with the perfect 60 to finish! The youngest archer at these @Olympics takes the top seed with 688 points!#ArcheryatTokyo #archery pic.twitter.com/MTRZ5uuN0m
— World Archery (@worldarchery) July 23, 2021
Stay tuned as Recurve Archers @ArcherAtanu, @tarundeepraii & @pravinarcher begin their #Tokyo2020 journey with Men’s Individual Ranking Round in a few minutes
Wish them luck! #Cheer4India @PMOIndia | @ianuragthakur | @NisithPramanik | @WeAreTeamIndia | @indian_archery
— SAIMedia (@Media_SAI) July 23, 2021
Live Update | #Tokyo2020 #Cheer4India @ArcherAtanu @tarundeepraii @pravinarcher
Men’s Individual Ranking Round | After 12 of 72 Arrows ? pic.twitter.com/fAjlBz5vPE
— SAIMedia (@Media_SAI) July 23, 2021
Live Update | #Tokyo2020 #Cheer4India @ArcherAtanu | @tarundeepraii | @pravinarcher
Men’s Individual Ranking Round | After 24 of 72 Arrows ? pic.twitter.com/5SsNmsXrS9
— SAIMedia (@Media_SAI) July 23, 2021
Live Update | #Tokyo2020 #Cheer4India @ArcherAtanu | @tarundeepraii | @pravinarcher
Men’s Individual Ranking Round | After 36 of 72 Arrows ? pic.twitter.com/Uu6y0QC4pL
— SAIMedia (@Media_SAI) July 23, 2021
Live Update | #Tokyo2020 #Cheer4India@ArcherAtanu | @tarundeepraii | @pravinarcher
Men’s Individual Ranking Round | After 48 of 72 Arrows ? pic.twitter.com/SAMssvJ48M
— SAIMedia (@Media_SAI) July 23, 2021
పురుషుల ర్యాంకింగ్ రౌండ్‌లో భారతీయ ఆర్చర్స్ రాణించలేకపోయారు. మిక్స్‌డ్ టీం ఈవెంట్‌లో భారత్ భారాన్ని భరించాల్సి ఉంటుంది. చివరి రౌండ్ తర్వాత తుది స్కోరు ఇలా ఉంది
ప్రవీణ్ జాదవ్ 656 మార్కులతో 31వ స్థానంలో నిలిచాడు.
దాస్ 652 పాయింట్లతో 35వ స్థానంలో నిలిచాడు
తరుణదీప్ రాయ్ 652 పాయింట్లు, తక్కువ ఎక్స్‌తో 37 వ స్థానంలో నిలిచాడు
10 రౌండ్ల ఆట పూర్తయింది. భారతీయ ఆర్చర్లలో ఎవరూ టాప్ 25కి చేరుకోలేదు. 10వ రౌండ్లో 56 పాయింట్లు సాధించి ప్రవీణ్ జాదవ్ ప్రస్తుతం ముగ్గురు భారతీయ ఆర్చర్లలో అగ్రస్థానంలో ఉన్నాడు, అతను 26వ స్థానంలో ఉన్నాడు. దాస్ కూడా 56 పాయింట్లు సాధించినా 28వ స్థానంలో ఉన్నాడు. మరోవైపు, తరుణదీప్ 54 పాయింట్లు సాధించి 38వ స్థానంలో ఉన్నాడు.
దాస్ ర్యాంకింగ్ కారణంగా భారత్ మిక్స్‌డ్ ఈవెంట్ జట్టు కూడా ఆరో స్థానానికి పడిపోయింది. దీపికా, దాస్ ఇద్దరూ మిక్స్‌డ్ టీం ఈవెంట్‌ను ఆడనున్నారు.
సెకండాఫ్ మొదలైంది. ప్రవీణ్ జాదవ్ ఏడో రౌండ్‌లో 55 పాయింట్లు సాధించాడు. దాస్ 55, తరుణదీప్ రాయ్ 54 పాయింట్లు స్కోర్ చేశారు.
ద్వితీయార్ధంలో భారత ఆటగాళ్ళు మెరుగైన ఆట చూపించాల్సి ఉంటుంది. ఇది గనక జరగకపోతే.. డ్రాలో స్ట్రాంగ్ ప్లేయర్స్‌తో పోటీ పడాల్సి ఉంటుంది.
మొదటి సగం రౌండ్లు ముగిశాయి. ప్రస్తుతానికి భారత అథ్లెటిక్స్ నిరాశపరిచారు. ప్రవీణ్ యాదవ్ 329 స్కోరుతో 30వ స్థానంలో, దాస్ 329 పాయింట్లతో 31వ స్థానంలో ఉన్నారు. తరుణదీప్ రాయ్ 323 పాయింట్లతో 45వ స్థానంలో ఉన్నారు. కొరియా అథ్లెటిక్స్ ఇక్కడ కూడా తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు.
రెండవ రౌండ్లో పేలవమైన ఆట తరువాత, దాస్ చెలరేగాడు. X-10-9-9-9తో 11వ స్థానానికి చేరుకున్నాడు. తరుణదీప్ 53 పాయింట్లతో 35వ స్థానానికి చేరుకున్నాడు
ముగ్గురు ఆటగాళ్లకు రెండో రౌండ్ పెద్దగా కలిసి రాలేదు. దాస్ 54, తరుణదీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్ 55 పాయింట్స్ సాధించారు. ముగ్గురూ టాప్ 10లో ఉన్నారు.
అతాను దాస్ తొలి రౌండ్‌లో 58 పాయింట్లు సాధించాడు. ఈ రౌండ్లో అతడు X-10-10-10-9-9 స్కోరు సాధించాడు. దాస్ ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్నాడు. తరుణదీప్ రాయ్ 55 పాయింట్లతో 31వ స్థానంలో, ప్రవీణ్ జాదవ్ 51 పాయింట్లతో 40వ స్థానంలో ఉన్నారు.
క్వార్టర్ ఫైనల్స్‌లో 32వ రౌండ్, 16వ రౌండ్ తర్వాత ఒలింపిక్ రికార్డు సృష్టించిన కొరియాకు చెందిన ఆన్ శాన్‌తో దీపిక తలపడవచ్చు.
భారత్ నుంచి వ్యక్తిగత పురుషుల ర్యాంకింగ్ రౌండ్లో ముగ్గురు ఆర్చర్స్ పాల్గొంటారు. భారత నెంబర్ వన్ ప్లేయర్ అతాను దాస్, తరుణదీప్ రాయ్, ప్రణీవ్ జాదవ్ పోటీ పడుతున్నారు.
అనుకున్నదే జరిగింది. కొరియాకు చెందిన ముగ్గురు ఆర్చర్లు మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. మొదటి ర్యాంక్ ఎం శాన్ ర్యాంకింగ్ రౌండ్లో 680 స్కోరుతో ఒలింపిక్ రికార్డును నెలకొల్పింది, గతంలో 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో నమోదైన 673 స్కోర్‌ను అధిగమించింది.
చివరి రౌండ్‌లో దీపిక అద్భుతాలు సృస్టించలేకపోయింది. ఈ రౌండ్లో ఆమె X-10-9-9-9-7 స్కోరు చేసి 54 పాయింట్లు సాధించాడు. మొత్తం 663 స్కోరుతో దీపిక తొమ్మిదో స్థానంలో నిలిచింది.
దీపికా కుమారికి 11 వ రౌండ్లో ఒక్క ఎక్స్ (పర్ఫెక్ట్ స్కోరు, కుడివైపున), 10 రాలేదు. ఈ కారణంగా ఆమె ఏడవ స్థానానికి పడిపోయింది. ఈ రౌండ్లో ఆమె స్కోరు 9-9-9-9-9-8.
10వ రౌండ్లో దీపిక అద్భుతంగా పుంజుకుంది. ఈసారి 58 పాయింట్లు సాధించింది. ఆమె 10వ రౌండ్ స్కోర్ XX-10-10-9-9. దీనితో ఆరో స్థానానికి చేరుకుంది. ఇక కొరియన్ ప్లేయర్స్ ముగ్గురూ కూడా మొదటి మూడు స్థానాల్లో ఉన్నారు.
తొమ్మిదవ రౌండ్‌లో దీపికా కుమారి చివరి షాట్‌కు మరో 7 పాయింట్స్ సాధించింది. ఈ రౌండ్లో XX-10-10-9-7 ఆమె స్కోర్. ఇక దీపికకు మరో మూడు రౌండ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి.
దీపిక కుమారికి ఎనిమిదో రౌండ్ కలిసొచ్చింది. అయితే చివరి షాట్‌లో మాత్రం ఎక్కువ పాయింట్స్ సాధించలేకపోయింది. ఈ రౌండ్లో ఆమె స్కోర్ 10-9-9-9-9-7. ప్రస్తుతం ఎనిమిదో స్థానానికి పడిపోయింది.
ఏడవ రౌండ్లో దీపిక మంచి ఆరంభం సాధించింది, కానీ చివరికి నిరాశపరిచింది. ఈసారి 55 పాయింట్లు పొందింది. ఈ రౌండ్లో ఆమె స్కోర్ వివరాలు X-10-9-9-9-8
కొరియాకు చెందిన ఆన్ శాన్ ర్యాంకింగ్ రౌండ్లో ఒలింపిక్ రికార్డును బద్దలు కొట్టడానికి దగ్గరగా ఉంది. ర్యాంకింగ్ రౌండ్లో ఇప్పటివరకు ఉన్న అత్యుత్తమ స్కోరు 673 కాగా, ఆరు రౌండ్ల తరువాత, శాన్ స్కోర్ 345 పాయింట్లు. ఇదే ఆటతీరు కొనసాగితే ర్యాంకింగ్ రౌండ్‌లో ప్రపంచ రికార్డు బద్దలుకావడం ఖాయం.
ఆరో రౌండ్ ముగిసేసరికి దీపికా కుమారి 57 పాయింట్లు సాధించింది. ప్రస్తుతం ఆమె టోటల్ స్కోర్ 334
నాలుగో రౌండ్ ముగిసేసరికి దీపికా కుమారి 14వ స్థానంలో నిలిచింది. ఆమె స్కోర్ 51 కాగా.. 218 పాయింట్లు దక్కించుకుంది.
ఉదయం 5.30 గంటలకు ఆర్చరీలో మహిళల వ్యక్తిగత క్వాలిఫైయింగ్ రౌండ్ మొదలైంది. భారత్ నుంచి ఆర్చర్ దీపికా కుమారి పోటీపడుతుండగా.. ఆమె స్కోర్ వివరాలు ఇలా ఉన్నాయి.
రియో ఒలింపిక్స్‌లో భారత్ కేవలం రెండు మెడల్స్ మాత్రమే దక్కించుకుంది. బ్యాడ్మింటన్‌లో సింధు సిల్వర్ మెడల్, రెజ్లింగ్‌లో సాక్షి మాలిక్ బ్రాంజ్ మెడల్ గెలిచారు. ఈసారి భారత్ నుంచి 127 మంది అథ్లెట్లు టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నారు. ఖచ్చితంగా చరిత్రను తిరగరాసే అవకాశాలు చాలానే ఉన్నాయి.
ఎన్నడు లేని విధంగా ఈసారి భారత్ నుంచి 127 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. అధికారులు, కోచ్‌లు, ఇతర సహాయ సిబ్బంది కలిపితే ఈ సంఖ్య 228కి చేరుతుంది. 2016లో జరిగిన రియో ఒలింపిక్స్‌లో కేవలం రెండే మెడల్స్ గెలిచి నిరాశపరిచిన ఇండియా.. ఈసారి ఆ సంఖ్యను పెంచుకోవాలన్న పట్టుదలతో ఉంది. రియో ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్‌లో సింధు సిల్వర్ మెడల్, రెజ్లింగ్‌లో సాక్షి మాలిక్ బ్రాంజ్ మెడల్ గెలిచారు. ఇక ఏ గేమ్‌లోనూ మెడల్స్ రాలేదు. కానీ ఈసారి మాత్రం చరిత్రను తిరగరాసే అవకాశాలు చాలానే కనిపిస్తున్నాయి
టోక్యో ఒలింపిక్స్ ప్రారంభోత్సవానికి భారత్ నుంచి 22 మంది క్రీడాకారులు, ఆరుగురు అధికారులను మాత్రమే అనుమతిస్తున్నారు. ప్రారంభోత్సవాన్ని కేవలం 950 మాత్రమే వీక్షిస్తారు. ప్రపంచదేశాల నుంచి 20 మంది విశిష్ట అతిధులు హాజరవుతారు. జపాన్ జక్రవర్తి అకిహితో ఒలింపిక్ వేడుకలను ప్రారంభిస్తారు. అమెరికా ఫస్ట్ లేడీ జిల్ బైడెన్ కూడా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరువుతన్నారు. జపాన్ ప్రధాని సుగా ఆమెకు ఘనస్వాగతం పలికారు. టోక్యో ఒలింపిక్స్ నిర్వహణలో తెలుగువాళ్లు కూడా భాగస్వామ్యులయ్యారు. టోక్యో ఒలింపిక్స్‌కు వాలంటీర్లుగా పనిచేస్తున్నారు.
ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోన్న టోక్యో ఒలింపిక్స్ ఎట్టకేలకు ప్రారంభమైంది. 2020లో జరగాల్సిన ఈ క్రీడా సంగ్రామం కరోనా కారణంగా ఈ ఏడాదికి వాయిదా పడిన విషయం విదితమే. భారత కాలమాన ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ఒలింపిక్స్ వేడుకలు ప్రారంభమవుతాయి.