Tokyo Olympics 2020: రెఫరీపై దాడి చేసినందుకు గాను ఓ కోచ్‌పై వేటు పడింది. ఒలింపిక్స్‌లో జరిగిన ఇలాంటి షాకింగ్ ఘటనకు దోషిగా తేలింది ఎవరో కాదు..భారత రెజ్లర్ దీపక్ పునియా విదేశీ కోచ్ మురాద్ గైదరోవ్. రెఫరీపై దాడిని తీవ్రంగా తీసుకున్న ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ).. మురాద్‌ను టోక్యో గ్రామం విడిచిపెట్టి వెళ్లాలని ఆదేశించింది. అలాగే ఆయన అక్రిడిటేషన్‌ను కూడా రద్దు చేసింది. కాంస్య పోరులో భాగంగా గురువారం భారత్ రెజ్లర్ దీపక్ పునియా.. శాన్ మారినోకు చెందిన మైల్స్ నాజిమ్ అమైన్‌పై ఓడిపోయాడు. మ్యాచ్ అనంతరం కోచ్ మురాద్ రెఫరీపై దాడికి పాల్పడ్డారు. రెఫరీపై జరిగిన దాడిని ప్రపంచ రెజ్లింగ్ విభాగం శుక్రవారం ఐవోసీ దృష్టికి తీసుకొచ్చింది. ఈమేరకు విచారించిన ఐవోసీ.. కోచ్‌ను హెచ్చరించింది. ఈ విషయంలో భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్‌ఐ) క్షమాపణ చెప్పింది. గతంలోనూ ఈ కోచ్ ఇలాంటి దాడులకు పాల్పడ్డాని ఎఫ్‌ఐఎల్‌ఏ తెలపగా.. అక్రిడిటేషన్ రద్దు చేస్తున్నట్లు ఐవోసీ పేర్కొంది.
రష్యాకు చెందిన మురాద్ గైదరోవ్.. ఆటగాడిగా 2004 ఏథెన్స్ ఒలింపిక్స్ బరిలో నిలిచినప్పుడు కూడా ఇలాంటి ఘటన జరిగింది. క్వార్టర్ ఫైనల్‌లో మురాద్ ఓడిపోయాడు. దీంతో ప్రత్యర్థిపై దాడికి పాల్పడి డిస్ క్వాలిఫై అయ్యాడు. ఆ తరువాత 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో మాత్రం రజత పతకం సాధించాడు.
మరోవైపు టోక్యో ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు పోటీ పడనున్న క్రీడాంశాలు నేటితో ముగియనున్నాయి. జులై 23న ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు భారత్ ఐదు పతకాలు మాత్రమే సాధించింది. ఇందులో రెండు రజత పతకాలు ఉండగా, మూడు కాంస్య పతకాలు ఉన్నాయి. వెయిట్‌లిఫ్టింగ్ నుంచి మీరాబాయి చాను, రెజ్లింగ్ నుంచి రవి దహియా రజత పతకాలు సాధించగా.. బాడ్మింటన్‌లో సింధు, హాకీ పురుషుల టీం, బాక్సింగ్ నుంచి లవ్లీనా కాంస్యాలు సాధించారు. అయితే, నేడు ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లకు చివరిరోజు. అయితే, పతకాలు వచ్చే అవకాశాలు ఇంకా మిగిలే ఉన్నాయి. దీంతో నేడు పతకాలు లభిస్తాయా లేదా అనేది చూడాలి. ఒలింపిక్స్ తొలిరోజే వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను పతకం సాధించగా, మరి చివరి రోజు ఎవరు పతకం అందించనున్నారో చూడాలి.
ముఖ్యంగా జావెలిన్ త్రోపై పతకం ఆశలు ఉన్నాయి. నీరజ్ చోప్రా క్వాలిఫికేషన్ రౌండ్‌లో తొలిస్థానంలో నిలవడంతో ఫైనల్లో కచ్చితంగా మెడల్ గెలుస్తాడని భారత అభిమానులు భావిస్తున్నారు. మరోవైపు రెజ్లింగ్‌లో భజరంగ్ పూనియా కాంస్యం కోసం తలపడనున్నాడు. అలాగే గోల్ఫ్‌లో భారత క్రీడాకారిణి అదితి అశోక్ పతకంపై ఆశలు అలాగే ఉన్నాయి.
అతడు మిల్కాసింగ్ సోదరుడు.. కానీ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు.. ఆడిన తొలి మ్యాచ్‌లోనే సెంచరీ బాదాడు..