Tokyo Olympic 2021: సుశీల్ కుమార్ 2008 లో ఒలింపిక్ కాంస్యంతోపాటు 2012 లో లండన్ ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించాడు. భారత్ నుంచి రెండు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన ఆటగాడిగా పేరుపొందాడు. 2019 సంవత్సరంలో కో సుల్తాన్‌లో ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ నిర్వహించారు. ప్రపంచం నలుమూలల నుంచి వెటరన్ రెజ్లర్లు ఇందులో పాల్గొంటున్నారు. రష్యా కోచ్ ఒక జర్నలిస్టుకు ఇంటర్వ్యూ ఇస్తున్న టైంటో ఎవరో ఆయనను భారత రెజ్లర్ సుశీల్ కుమార్ గురించి ఓ ప్రశ్న అడిగారు. దీనికి ఆయన సమాధానమిస్తూ.. ‘అతనో సింహం. అతను ఏ రూపంలో ఉన్నా, ప్రత్యర్థికి ప్రమాదం పొంచి ఉంటుందని’ సుశీల్ కుమార్ గురించి చెప్పుకొచ్చాడు. ఈ ఛాంపియన్‌షిప్‌లో మొదటి రౌండ్‌లో సుశీల్ కుమార్ ఎలిమినేట్ అయ్యాడు. కానీ, అతని ఆధిపత్యం మాత్రం తగ్గలేదు. భారతదేశం నుంచి రెండు ఒలింపిక్ పతకాలు సాధించిన ఏకైక ఆటగాడిగా సుశీల్ కుమార్ పేరుగాంచాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో సుశీల్ కుమార్ కాంస్య పతకం సాధించగా, 2012 లో రజత పతకం సాధించాడు. లండన్ ఒలింపిక్ క్రీడల్లో రజతం గెలిచిన తరువాత సుశీల్ పేరు చరిత్రలో నిలిచిపోయింది. ఒలింపిక్ క్రీడల్లో రెండు వ్యక్తిగత పతకాలు సాధించిన ఏకైక భారతీయుడిగా పేరుగాంచాడు. సుశీల్ కుమార్ తన 14 సంవత్సరాల వయస్సులో ఛత్రసల్ స్టేడియంలో శిక్షణ ప్రారంభించాడు. 1980 మాస్కో ఒలింపిక్స్‌లో రెజ్లర్ సత్పాల్ సింగ్‌తో కలిసి శిక్షణ పొందాడు.
2003 ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో తొలిసారి కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. దీని తరువాత, న్యూయార్క్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సుశీల్ పతకం పొందలేకపోయాడు. కానీ, అతని ఆటతీరు చాలా ఆకట్టుకుంది. దాంతో సుశీల్ ఏథెన్స్ ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం పొందాడు. 21 ఏళ్ల సుశీల్ 60 కిలోల విభాగంలో పోటీపడ్డాడు. మొదటి రౌండ్లో బంగారు పతక విజేత యాండ్రో క్వింటానా చేతిలో ఓడిపోయాడు. 2006 ఆసియా క్రీడలలో తిరిగి పుంజుకున్నాడు. దీంట్లో కాంస్య పతకాన్ని గెలుచుకుని సత్తా చాటాడు. ఒలింపిక్ క్రీడలకు ఒక సంవత్సరం ముందు, అంటే 2007 ఆసియా ఛాంపియన్‌షిప్‌లో సుశీల్ రజత పతకం సాధించాడు. బీజింగ్ ఒలింపిక్ క్రీడల్లో 66 కిలోల వెయిట్ కేటగిరీ ఫ్రీస్టైల్‌లో తలపడ్డాడు. తొలి రౌండ్‌లో ఆండ్రీ స్టాడ్నిక్ చేతిలో ఓడిపోయాడు. అయితే, స్టాడ్నిక్ ఫైనల్‌కు చేరుకోవడంతో సుశీల్‌కుమార్‌కు పతకం గెలిచేందుకు మరో అవకాశం అందించాడు. మొదట అమెరికన్ రెజ్లర్ డౌగ్ ష్వాబ్‌ను ఎదుర్కొన్న సుశీల్.. 4–1, 0–1, 3–2తో ఓడించాడు. ఆ తరువాత రౌండ్లో, అతను 1–0, 0–4, 7–0తో బెలారస్‌కు చెందిన ఆల్బర్ట్ బాటరోవ్‌ను ఓడించి కాంస్య పతకం వైపు అడుగులు వేశాడు. సుశీల్ కుమార్ కేవలం 70 నిమిషాల వ్యవధిలో వరుసగా 3 మ్యాచ్‌లు ఆడాడు. లియోనిడ్ స్పిరిడోనోవ్‌తో జరిగిన కాంస్య పతకం పోరులో గెలిచి కాంస్య పతకం గెలిచాడు.
Also Read:
టోక్యో ఒలింపిక్స్‌లో శరణార్థుల టీం.. ఒలింపిక్ పతాకంతో బరిలోకి.. ప్రపంచ శాంతి కోసమే అంటోన్న ఐఓసీ