Tokyo Olympics 2020: గ్రేట్ బ్రిటన్ స్టార్ టెన్నిస్ క్రీడాకారుడు ఆండీ ముర్రే టోక్యో ఒలింపిక్స్ 2020 సింగిల్స్ విభాగంలో నుంచి తప్పుకున్నాడు. తొడ గాయం కారణంగా ముర్రే ఈ నిర్ణయం తీసుకున్నాడు. అతను తన మొదటి మ్యాచ్‌లో కెనడాకు చెందిన ఫెలిక్స్ అగుర్ ఎలియాసిమ్‌తో తలపడాల్సి ఉంది. కానీ, ముర్రే సింగిల్స్ విభాగంలో కోర్టులో పాల్గొనడంలేదు. అయితే, డబుల్స్ విభాగంలో బరిలోకి దిగుతానని వెల్లడించాడు. వైద్యుల సూచన మేరకు ముర్రే ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశాడు. “నేను సింగిల్స్ నుంచి తప్పుకోవడం చాలా బాధ కలిగిస్తోంది. కానీ నా వైద్య సిబ్బంది రెండు ఈవెంట్లలోనూ ఆడకుండా ఉండాలని సూచించారు. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. కేవలం సింగిల్స్ నుంచి మాత్రమే తప్పుకుంటున్నాను. ప్రస్తుతం నా దృష్టంతా డబుల్స్‌పైనే ఉంది” అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు.
రెండుసార్లు విజేతగా..
ముర్రే 2012 లండన్ ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించాడు. అలాగే 2016 రియోఒలింపిక్స్లోనూ విజేతగా నిలిచాడు. కానీ, ఈసారి జరిగే టోక్యో ఒలింపిక్స్‌లో సింగిల్స్ బరి నుంచి తప్పుకున్నాడు. ముర్రే తొంటి గాయంతో కొంతకాలంగా బాధపడుతున్నాడు. ఈ ఏడాది జనవరిలో, కరోనా వైరస్ కారణంగా అతను ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొనలేకపోయాడు. కానీ, గత నెల వింబుల్డన్‌లో వరుసగా మ్యాచ్‌లను గెలిచాడు. డబుల్స్ విభాగంలో, అతను జో సాలిస్బరీతో ఒలింపిక్స్ బరిలో నిలవనున్నాడు. ఈ జోడీ శనివారం వారి మొదటి మ్యాచ్‌లో గెలిచింది. తదుపరి మ్యాచులో జర్మనీకి చెందిన కెవిన్ క్రావిట్జ్ – టిమ్ పుయెట్జ్‌తో తలపడనున్నారు.
టోక్యో ఒలింపిక్స్‌లో సూపర్ సండే ప్రారంభం కూడా భారత్‌కు కలిసిరాలేదు. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో ఇద్దరు భారత షూటర్లు మను బాకర్, యషస్విని దేస్వాల్ ఫైనల్స్‌కు చేరుకోలేకపోయారు. షూటర్‌లు ఇద్దరూ క్వాలిఫికేషన్ రౌండ్‌లో లక్ష్యాన్ని చేరుకోలేక నిరాశపరిచారు. చేరుకోలేకపోయారు. మరోవైపు, బ్యాడ్మింటన్ నుంచి భారత స్టార్ ఉమెన్ షట్లర్ పీవీ సింధు రౌండవ రౌండ్‌లోకి ఎంటరైంది.ఇజ్రాయెల్ షట్లర్‌పై మొదటి నుంచి ఆధిపత్యం ప్రదర్శించి విజయం సాధించింది.
Also Read:
Tokyo Olympics 2020: రోయింగ్‌లో పతకం ఆశలు సజీవం.. సెమీస్ చేరిన అర్జున్ లాల్, అరవింద్ సింగ్