Naina Jaiswal: టేబుల్ టెన్నిస్ ప్లేయర్‏కు ఆకతాయిల వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన నైనా జైస్వాల్‌..

|

Aug 12, 2022 | 1:48 PM

ఇన్‌స్టాగ్రామ్‌లో వేధిస్తున్న తనను వేధిస్తున్న పోకిరిలపై చర్యలు తీసుకోవాలని టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ హైదరాబాద్ (Hyderabad Police) పోలీసులను ఆశ్రయించింది.

Naina Jaiswal: టేబుల్ టెన్నిస్ ప్లేయర్‏కు ఆకతాయిల వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన నైనా జైస్వాల్‌..
Naina Jaiswal
Follow us on

Table tennis player Naina Jaiswal: సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో ప్రముఖులకు ఆకతాయిల నుంచి వేధింపులు పెరుగుతున్నాయి. తాజాగా.. ఓ క్రీడాకారిణి తనను వేధిస్తున్న పోకిరిలపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో వేధిస్తున్న తనను వేధిస్తున్న పోకిరిలపై చర్యలు తీసుకోవాలని టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ హైదరాబాద్ (Hyderabad Police) పోలీసులను ఆశ్రయించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో కొందరు అసభ్యకరంగా మెస్సెజ్‌లు చేస్తూ తనును వేధిస్తున్నారని నైనా జస్వాల్ ఫిర్యాదు చేసింది. నైనా జైస్వాల్ ఫిర్యాదు మేరకు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం వేట మొదలుపెట్టామని.. త్వరలోనే వారిని పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.

హైదరాబాద్‌కు చెందిన నైనా జైస్వాల్.. భారతదేశానికి చెందిన టేబుల్ టెన్నిస్ స్టార్ క్రీడాకారుల్లో ఒకరిగా పేరు సంపాదించుకుంది. నైనా జైస్వాల్.. జాతీయ, అంతర్జాతీయ ఛాంపియన్‌షిప్‌లలో పలు టైటిళ్లను సైతం గెలుచుకుని.. అంతర్జాతీయ క్రీడాకారిణిగా రాణిస్తోంది.

ఇదిలాఉంటే.. 2022 ఫిబ్రవరిలో నైనా జైస్వాల్ ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ అయింది. అప్పుడు కూడా టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైస్వాల్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి.. 

Airtel 5G: టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్‌.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు..